Roadshow at Ponnur Constituency
వైయస్సార్ వేరు – జగన్ వేరు. * పరిశ్రమలను నాశనం చేశారు – డాక్టర్ పెమ్మసాని. ‘గత ఎన్నికల్లో వైయస్సార్ ను చూసి అందరూ జగన్ కు ఓటు వేశారు. కానీ వైయస్సార్ వేరు, జగన్ వేరు అని ప్రజలకు ఇప్పుడు అర్థమైంది.’ అని టిడిపి నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. పొన్నూరు నియోజకవర్గంలో ఆయన మంగళవారం చేపట్టిన సుడిగాలి పర్యటనలో భాగంగా 19 గ్రామాలలో రోడ్ షో నిర్వహించారు. పొన్నూరు నియోజకవర్గ టిడిపి అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర గారితో కలిసి బ్రాహ్మణ కోడూరు మొదలు కసుకర్రు వరకు ఆయన పర్యటించారు. దారి పొడవునా మహిళలు, వృద్ధులు, చిన్నారులు, డాక్టర్ పెమ్మసానిని, నరేంద్రను చూసేందుకు, కలిసి మాట్లాడేందుకు పోటీపడ్డారు. పెమ్మసానితో కలిసి ఫోటోలు దిగేందుకు ఉత్సాహం కనబరిచారు. ఆయన తన పర్యటన ఆసాంతం ప్రజా, స్థానిక సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగారు. రోడ్ షో లో భాగంగా పలు గ్రామాల్లో పర్యటిస్తూ, ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పర్యటనలో భాగంగా కొండమూది, వడ్డిముక్కల గ్రామాల్లో టీడీపీ, జనసేన జెండాలను పెమ్మసాని, ధూళిపాళ్ల కలిసి ఆవిష్కరించారు. అలాగే కొండమూది, మాచవరం, సీతారామపురం తదితర గ్రామాల్లో అంబేద్కర్, ఎన్టీయార్ విగ్రహాలకు పెమ్మసాని, నరేంద్ర విడివిడిగా పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. పర్యటనలో బిజెపి రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ పాతూరి నాగభూషణం, టిడిపి సీనియర్ నాయకులు దుగ్గిరాల సీతారామయ్య, జనసేన పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త వడ్డాణం మార్కండేయులుతో పాటు టీడీపీ – జనసేన – బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
12
Mar
Ponnur Assembly Media Meeting
Pemmasani attends Ponnur Constituency Media Meeting and interacted with Media.
Ponnur Assembly - Roadshow
పొన్నూరు నియోజకవర్గంలో డాక్టర్ పెమ్మసాని మంగళవారం సుడిగాలి పర్యటనను చేపట్టారు. టీడీపీ – జనసేన – బీజేపీ ఆధ్వర్యంలో తొలుత బ్రాహ్మణకోడురులో ప్రారంభం అయిన ఆ ర్యాలీ వెళ్లలూరు, మామిల్లపల్లి, మునిపల్లె, గోళ్లమూడిపాడు, శ్రీపురం, పచ్చలతాడిపర్రు, కట్టెంపూడి, తాల్లపాలెం, ఆలూరు, కొండమూదిలో జరిగిన పర్యటనలో ఆయన పాల్గొన్నారు. కాగా ఆయా ప్రాంతాల్లోని పలు సమస్యలపై స్పందించారు. ఈ భూమిపై ఎనలేని ప్రేమ ఉంది కాబట్టి మళ్ళీ వెనక వచ్చానని తెలియజేశారు. నేనే రాజు – నేనే మంత్రి అనే చందాన ఈ ప్రభుత్వం పాలన సాగిస్తోందని చెప్పారు. మద్యపానం చేస్తానని చెప్పిన జగన్ ప్రభుత్వం నేడు నాసిరకం మద్యం విక్రయిస్తూ ప్రజల రక్తం పిండేస్తున్నారన్నారు. అభివృద్ధి పెరిగితేనే ఆదాయం కూడా పెరుగుతుందని, ప్రగతికి పూలబాట వేసే వారిని ఎన్నుకోవాలని చంద్రశేఖర్ కోరారు. పర్యటనలో బీజేపీ రాష్ట్ర మీడియా కో ఆర్డినేటర్ పాతూరి నాగభూషణం, టీడీపీ సీనియర్ నాయకులు దుగ్గిరాల సీతారామయ్యతో పాటు పలువురు టీడీపీ – జనసేన – బిజెపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Perecherla Meeting
నా రక్తంలోనే ఇండియా ఉంది. * అప్పుల పథకాలతో పాలన ఎల్లకాలం సాగదు. * పేరేచర్ల బహిరంగ సభలో డాక్టర్ పెమ్మసాని ‘ఎన్ ఆర్ ఐ అంటే నా రక్తంలోనే ఇండియా ఉందని అర్థం.’ అని టిడిపి నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. మేడికొండూరు మండలంలో సోమవారం జరిగిన రోడ్ షో అనంతరం పేరేచర్లలో టిడిపి జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తాడికొండ నియోజకవర్గ టిడిపి అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ సభా అధ్యక్షతన ఆ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా పెమ్మసాని రాకను స్వాగతిస్తూ వైసీపీకి చెందిన 110 కుటుంబాలు ఆ పార్టీని వీడుతూ టిడిపిలో చేరాయి. కార్యకర్తల ఆగమనాన్ని అభిలాషిస్తూ డాక్టర్ పెమ్మసానితో పాటు శ్రావణ్ కుమార్ వారికి టిడిపి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసారి గనుక చంద్రబాబు ముఖ్యమంత్రి కాకపోతే రాష్ట్రం అధోగతి పాలవుతుందనే భయంతోనే టిడిపిలో చేరానని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కార్యక్రమంలో భాగంగా బూత్ స్థాయిలో పనిచేసిన పలువురు ఇన్చార్జిలకు ప్రశంసా పత్రాలను అందజేసిన పిదప సత్కరించారు. కార్యక్రమంలో జనసేన తాడికొండ నియోజకవర్గ ఇన్చార్జి విజయ శేఖర్ తో పాటు పలువురు టిడిపి-జనసేన నాయకులు పాల్గొన్నారు.
Students meet NRI College
ప్రపంచం తలకిందులు చేసే శక్తి యువతది * విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో డాక్టర్ పెమ్మసాని. ‘భావితరాలను నిర్మించే ఆర్కిటెక్ట్ లు మీరు, గొంతెత్తి ప్రశ్నిస్తే, తలెత్తి నిలదీస్తే ప్రపంచం తలకిందులయ్యే శక్తి మీది.’ అని టిడిపి నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. మండలంలోని విశదల గ్రామంలో గల ఎన్నారై ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో విద్యార్థులతో పెమ్మసాని ముఖాముఖి కార్యక్రమంలో సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఉపాధ్యాయుడిగా అమెరికాలోని 50 – 60 మంది విద్యార్థులకు పాఠాలు చెప్పానన్నారు. ఆధర్మం, అన్యాయ మార్గంలో వేసే అడుగులు వ్యక్తిత్వం పై ప్రభావం చూపుతాయని, సమాజంలో డబ్బు ఒకటే కాదని, విలువలు కూడా కావాలని పెమ్మసాని ఈ సందర్భంగా వివరించారు. ఓటు విషయానికొస్తే అన్ని పార్టీల వ్యక్తుల్ని విద్యార్థులు ఒకసారి గమనించాలని, ఎవరైతే ప్రజలకు ఉపయోగపడతారో గుర్తించి ఓటెయ్యాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో తాడికొండ నియోజకవర్గ టిడిపి అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ తో పాటు ఎన్నారై విద్యాసంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తిలక్ పలువు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సవివరమైన సమాధానాలు చెప్పారు.
Siripuram Outdoor Meet
గెలవడం పక్కా.. మెజారిటీ ఎంతన్నదే లెక్క * సిరిపురం సభలో పెమ్మసాని ‘ గెలవడం పక్కా.. మెజారిటీ ఎంతన్నదే నా లెక్క.’ అని టీడీపీ నాయకులు డా. పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. సోమవారం మేడికొండూరులో జరిగిన రోడ్డు షో లో భాగంగా సిరిపురం గ్రామంలో పెమ్మసాని మాట్లాడారు. స్థానిక టీడీపీ నాయకుల నేతృత్వంలో ఏర్పాటు చేసిన సభలో పెమ్మసానితో పాటు తాడికొండ నియోజకవర్గ టి డి పి అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం పెమ్మసాని మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తలు అంటే మందు బాటిళ్లకు అమ్ముడుపోయే మనుషులు కాదని తెలిపారు. చంద్రబాబు తీసుకొచ్చిన 3 యునివర్సిటీల చుట్టూ అద్భుతమైన నగరం నిర్మించాల్సింది పోయి, యునివర్సిటీలకు కరెంట్ కట్ చేసిన వికృత ఘనత ఈ ప్రభుత్వానికే చెల్లుతుందన్నారు. మిర్చి రైతులకు గిట్టుబాటు ధర లేదని పంటలకు నీళ్లు లేవని ఆయన అన్నారు. రోడ్ షో సాగిందిలా. మేడికొండూరు మం. లోని మేడికొండూరు, కొత్తూరు, జంగంగుంటల పాలెం, సిరిపురం, సరిపూడి, విసిదల గ్రామాల్లో పర్యటనలో పాల్గొన్నారు. సిరిపురం గ్రామ పర్యటనలో భాగంగా ఎడ్లబండిని నడుపుతూ పెమ్మసాని గ్రామంలో పర్యటించారు. అలాగే మార్గం మధ్యలో కొఱ్ఱపాడులోని ఓ మిరపతోటలో పనులు చేస్తున్న వ్యవసాయ కూలీలను కలుసుకున్నారు. స్థానిక, కూలీల సమస్యలను ఈ సంధర్భంగా అడిగి తెలుసుకున్నారు.
Medikonduru Road Show
*పెమ్మసాని దెబ్బకు వైసిపి ఖాళీ. * మేడికొండూరులో ఒక్కరోజులోనే వైసీపీకి చెందిన వంద కుటుంబాల చేరిక. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు జగన్ అబద్దాలకు హద్దు ఉండదు. నోటికి వచ్చిన అబద్ధపు హామీలన్నీ ఇస్తారు.’ అని టిడిపి నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. టిడిపి నాయకులు డా. పెమ్మసాని చేపట్టిన నియోజకవర్గాల పర్యటనలకు విశేషమైన స్పందన లభిస్తోంది. పర్యటించిన ప్రతి ప్రాంతంలోనూ వైసీపీ కార్యకర్తలు టీడీపీ వైపు ఆకర్షితులవుతూ, పెమ్మసాని నేతృత్వంలో పార్టీలో చేరుతున్నారు. మేడికొండూరు మండలంలో సోమవారం పెమ్మసాని రోడ్ షోలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని అంకమ్మ చెట్టు వద్ద ఏర్పాటు చేసిన సభలో మండలానికి చెందిన 100 కుటుంబాలు పెమ్మసాని ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. చేరిన వారిలో వైసీపీ మద్దతుతో గెలిచిన వార్డు మెంబర్లు కూడా ఉండటం విశేషం. పెమ్మసాని, తెనాలి శ్రావణ్ కుమార్ ఆశావహులకు టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ తేదీ నాటికి వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమని తెలిపారు. జగన్ ఇంకా మారకుండా నోటికి వచ్చినట్లు అబద్ధాలు చెప్పడం వల్ల నిజాలు చెప్పే అసలైన నాయకుల హామీలకు కూడా విలువ లేకుండా పోయే ప్రమాదం ఉందన్నారు. సంక్షేమం కోసం పుట్టిన పార్టీ టీడీపీ అని, అలాంటి పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజాభివృద్ధి సాధ్యమని డా. పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. అనంతరం టీడీపీ స్ధానిక నియోజకవర్గ టిడిపి అభ్యర్థి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ఇరిగేషన్ మంత్రి అంబటి ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. తాగడానికి నీళ్లు లేక ప్రజలు బాధపడుతుంటే, కోటప్పకొండ తిరునాల్లకు నీళ్లు వదిలడమేనా పాలన అంటే అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ స్థాయి టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
Rally - Procession by Pawan Kalyan fans
గుంటూరు పార్లమెంట్ ఆఫీస్ నుండి జనసేన అభిమానులతో ర్యాలీనీ మొదలుపెట్టిన పెమ్మసాని చంద్రశేఖర్ అందరికీ అభివాదం చేసుకుంటూ ర్యాలీ సాగింది…
ఏటుకూరు బైపాస్ వరకు బైకులు కార్ల తో ర్యాలీ కొనసాగించారు. ఏటుకూరు బైపాస్ నుండి పత్తిపాడు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి రామాంజనేయులు జనసేన నాయకులు తో ర్యాలీ కొనసాగింది. ఏటుకూరు జనసేన కార్యకర్తలు భారీ ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. ఏటుకూరు సెంటర్లో జనసేన మహిళకార్యకర్తలు హారతులతో పెమ్మసాని చంద్రశేఖర్ కు ఘన స్వాగతం పలికారు. మొదట ఆంజనేయ స్వామి గుడి లో ఆశీర్వచనం తీసుకొని ర్యాలీని కొనసాగించారు. కోలాటం తో రోడ్డు పొడవునా సంబరంగా ర్యాలీ చేశారు.
ఏటుకూరు బైపాస్ వరకు బైకులు కార్ల తో ర్యాలీ కొనసాగించారు. ఏటుకూరు బైపాస్ నుండి పత్తిపాడు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి రామాంజనేయులు జనసేన నాయకులు తో ర్యాలీ కొనసాగింది. ఏటుకూరు జనసేన కార్యకర్తలు భారీ ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. ఏటుకూరు సెంటర్లో జనసేన మహిళకార్యకర్తలు హారతులతో పెమ్మసాని చంద్రశేఖర్ కు ఘన స్వాగతం పలికారు. మొదట ఆంజనేయ స్వామి గుడి లో ఆశీర్వచనం తీసుకొని ర్యాలీని కొనసాగించారు. కోలాటం తో రోడ్డు పొడవునా సంబరంగా ర్యాలీ చేశారు.
District Telugunadu Trade Union Council(TNTUC) Cell Meet
మీ సమస్యలకు గొంతుకలా ఉంటా. * ట్రేడ్ యూనియన్ నాయకులతో డా. పెమ్మసాని. ప్రజా సమస్యలకు గొంతుకలా పార్లమెంట్ వేదికగా ప్రశ్నిస్తాను. శ్రమ శక్తికి నిర్వచనమైన కార్మిక లోకాన్ని చులకనగా చూడకూడదని ఈ ప్రభుత్వానికి తెలిసి రావాలి. టీడీపీ జిల్లా కార్యాలయంలో టీ ఎన్ టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారా జోషి సభా అధ్యక్షతన ఆదివారం జరిగిన ట్రేడ్ యూనియన్ నాయకులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో డా. పెమ్మసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము ‘ప్రజా శంఖారావం’ ప్రచారంలో భాగంగా ప్రతీ గడపకు కూడా వెళ్తున్నామని, 30గజాల ఇళ్ళల్లో ఆరుగురు జీవిస్తుండటం చూసి చలించిపోయామన్నారు. ఈ సమస్యలపై ఇతర సంపన్నులు సైతం ఆలోచించాలి అని ఆయననే సందర్భంగా కోరారు. పేదరికం నిర్మూలనకు తన వంతు కృషి చేస్తానన్నారు. అలాగే కార్యక్రమంలో భాగంగా టీఎన్ టీయూసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు గుంటుపల్లి శేషగిరిరావు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన సమయం వచ్చిందన్నారు.అలాగే భవన నిర్మాణ కార్మికుల కోసం ఇసుక తదితర సమస్యలపై దృష్టి పెట్టాలని తెలిపారు. అనంతరం నేరెళ్ల సురేశ్ కుమార్ మాట్లాడుతూ పెమ్మసాని నామినేషన్ వేయకుండానే ఎన్నికల్లో గెలిచేశారని చెప్పారు. తండ్రి లేని బిడ్డ అనే కారణంతో ఒక్క అవకాశం ఇస్తే ప్రజల్ని ముంచేసారన్నారు. కార్యక్రమంలో టీఎన్ టీయూసీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి మదమంచి శ్రీనివాసరావు, జనసేన కార్మిక విభాగం నాయకుడు ఆళ్ల హరి తదితరులు పాల్గొన్నారు.