Prathipadu Road Show
అణచివేత, డబ్బే జగన్ రాజకీయం + ఉద్యోగస్తులను జగన్ బిచ్చగాళ్లుగా చేశారు. + ఇకనైనా ప్రజలు చైతన్యవంతం కావాలి + ప్రత్తిపాడు మండలం పర్యటనలో డాక్టర్ పెమ్మసాని. ప్రత్తిపాడు: ‘అధికారంలోకి వచ్చింది మొదలు అణచివేత, డబ్బు ఈ రెండిటి ఆధారంగానే జగన్ తన రాజకీయాన్ని నడుపుతున్నారు. ఉద్యోగస్తులకు జీతాలు కూడా ఇవ్వకుండా బిచ్చగాళ్లుగా మారుస్తున్నారు. ఒకటో తేదీన జీతాలు వస్తే చాలు అన్నట్లు ఉద్యోగస్తులు ఇబ్బందులు పడుతున్నారు.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. ఎన్నికల పర్యటనలో భాగంగా ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి అభ్యర్థి బూర్ల రామాంజనేయులు తో కలిసి పెమ్మసాని ప్రత్తిపాడు మండలంలో శుక్రవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా యనమదల, ఈదుల పాలెం, చినకొండ్రుపాడు, రావిపాటి వారి పాలెం, ప్రత్తిపాడు, పెదగొట్టిపాడు గ్రామాల్లో ఇరువురు నాయకులు తమ పర్యటనను కొనసాగించారు. పర్యటనలో భాగంగా పలు గ్రామాలలో పెమ్మసాని, రామాంజనేయులు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ తల్లిదండ్రులు నేర్పించే మంచితనమే పిల్లలు కూడా అలవర్చుకుంటారు. శత్రువైనా సరే ఎదురొచ్చినప్పుడు నవ్వుతూ నమస్కారం చేయడం భారతీయ సంప్రదాయం. ఓట్లు ఎవరికి వేయాలన్నది ఓటర్ల వ్యక్తిగతమైన విషయం. అలా అని కక్ష్య, ఈర్ష్యలతో మెసలడం అనేది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. దయచేసి నవ్వుతూ ఉండండి, ఆరోగ్యానికి మంచిది. * ఒకటో తేదీన జీతాలు కూడా ఇవ్వని ఈ ప్రభుత్వం కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఐదేళ్లుగా ఇక్కట్లు పాలయ్యారు. ఇటీవల నన్ను కలిసిన కొందరు ఉద్యోగులు ఒకటో తేదీన జీతాలు వచ్చేట్టుగా చూడమని చేసిన అభ్యర్థనను వింటే వాళ్ళ సమస్య ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. పోలీసులను ఒక రాక్షసులుగా, ఇంకొందరు ఉద్యోగులను బానిసలుగా మార్చిన ఏకైక ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వమే. ప్రకృతి సహజ సిద్ధవనరులైన ప్రాంతాల్లో బాక్సైట్, గ్రానైట్, మైనింగ్ అంటూ అక్రమ తవ్వకాలతో వైసీపీ నాయకులు దోచేస్తున్నారు. ఆ అవినీతి సొమ్ముతో ఓట్లను కొనుగోలు చేస్తూ, రాజకీయం చేస్తున్నారు. ఇకనైనా ప్రజలు చైతన్యవంతులు కావాలి. లేకపోతే సమాజం నాశనం అవుతుందని అర్థం చేసుకోవాలి. మరో రెండు రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో టిడిపి 120-130 స్థానాల్లో విజయం సాధించబోతుంది. రోడ్లు అద్వానంగా ఉన్న పలు గ్రామాల్లో రహదారులు నిర్మింపచేసే బాధ్యత మేము తీసుకుంటాం.’ అని మాట్లాడారు. + బూర్ల రామాంజనేయులు: ఈ అరాచక పాలనకు మరొక రెండు రోజులే గడువు ఉంది. టిడిపి ప్రభుత్వంలో వేసిన రోడ్లే తప్ప వైసీపీ ఏ ఒక్క రోడ్డు అయినా వేసిందా? మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తే ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేసుకోవచ్చు. 50 ఏళ్లకే పెన్షన్ రావాలంటే చంద్రబాబు రావాలి. యువతకు ఉద్యోగాలు రావాలంటే చంద్రబాబు రావాలి. * ఈ పర్యటనలో టిడిపి నాయకులు తాళ్ల వెంకటేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, బీసీ టీడీపీ నాయకులు నిమ్మల శేషయ్య తదితర గ్రామ మండల స్థాయి టిడిపి, జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు.
Yadavas Meeting
బీసీలకు అండగా టీడీపీ. + ఈ ప్రభుత్వంలో ఎదిగిన ఒక్క బీసీ నాయకుడైనా ఉన్నారా? + తెనాలి బీసీ ఆత్మీయ సమావేశంలో పెమ్మసాని. తెనాలి నియోజకవర్గ కేంద్రంలోని స్థానిక ఎన్విఆర్ కళ్యాణ మండపంలో గురువారం జరిగిన యాదవ ఆత్మీయ సమావేశం కార్యక్రమానికి గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కూడా పాల్గొన్నారు. * పెమ్మసాని చంద్రశేఖర్: నటుడిగా జీవితాన్ని ప్రారంభించి, దేవుడి మందిరంలో దేవుడి పటంగా ఉంచుకునే స్థాయికి ఎదిగిన నందమూరి తారక రామారావు గారు పెట్టిన టిడిపికి ఆనాటి నుంచి నేటి వరకు బీసీలు అండగా ఉన్నారు. అన్నగారి నాయకత్వంలోనే ఒక దేవేందర్ గౌడ్ గాని, ఎర్ర నాయుడు వంటి ఎంతోమంది బీసీ నాయకులుగా ఎదిగారు. గెలుస్తామని నమ్మకమున్న సీట్లలో 90 శాతం పైగా జగన్ తన సామాజిక వర్గానికి కేటాయించుకుని, ఓడిపోయే సీట్లను మాత్రం బీసీలు, ఇతర కులాలకు ఇచ్చారు. పేదవాళ్లకు ఇళ్ళు ఇస్తామని చెప్పి, తెనాలి పట్టణం, పట్టణ పరిసరాల ప్రాంతాల్లోని అందరినీ తీసుకెళ్లి సిరిపురంలో పడేశారు. ఇదేనా సమసమానత్వం అంటే? యాదవ సోదర, సోదరీమణులు ఒకసారి మాట ఇస్తే ప్రాణం పోయేంతవరకు ఆ మాటపై నిలబడతారని నాకు తెలుసు. మీరే ఆలోచించండి. మీ అభివృద్ధికి బాటలు వేస్తానని నా సాయ శక్తులకు కృషి చేస్తానని మాట ఇస్తున్నాను. * నాదెండ్ల మనోహర్: రాష్ట్ర రాజకీయాలకు అతీతంగా తెనాలి నియోజకవర్గంలో రాజకీయ లక్షలు ఎప్పుడూ నేను వినలేదు. ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టారో ఎవరైతే మనల్ని వేధించారో ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, తెనాలి నియోజవర్గంలోని టిడిపికి కార్యకర్తలకు మరోసారి నేను హామీ ఇస్తున్నాను. ప్రజలకు అంకిత భావంతో మనం పని చేసినప్పుడు మార్పు అనేది కచ్చితంగా తీసుకురావచ్చు. చేతిలో ఉన్న అవకాశాలు, ఓట్లను ఉపయోగించుకుందాం అనుకుంటే, అంతకుమించిన పొరపాటు మరొకటి ఉండదు. యాదవులు మానవత్వం ఉన్న వ్యక్తులు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మిమ్ములను మా సొంత మనుషులుగా చూసుకుంటాం అని యాదవులకు హామీ ఇస్తున్నాను. స్థానికంగా యాదవులు కోరుకుంటున్న కమ్యూనిటీ హాల్ ను నిర్మింపజేసే బాధ్యత నేను తీసుకుంటాను. మీరు ఏ స్థాయిలో మాకు అండగా నిలబడతారో, అదే స్థాయిలో నేను, పెమ్మసాని గారు ప్రజలకు, ప్రజాభివృద్ధికి అండగా నిలబడతాం. * ఆలపాటి రాజేంద్రప్రసాద్: యాదవులు అంతా టిడిపికి అనుకూలంగా ఉన్నారు. తెనాలి నియోజకవర్గంలో బీ.సీలే పార్టీకి వెన్నెముక. గడిచిన ఈ ఐదేళ్లలో నియోజకవర్గంలో జగన్ ప్రభుత్వం యాదవులకు ఏ పదవులు ఇచ్చిందో చెప్పండి. జగన్ కు అబద్ధం చెప్పడం తప్ప నిజం చెప్పకూడదు అనే శాపం ఉందేమో! ఏ సభలో చూసినా, ఏ ప్రచారం చేసినా కళ్ళు ఆర్పుకుంటూ అబద్ధాలే చెబుతూ ఉంటారు. రాజ్యాంగం కల్పించిన స్థానికంగా 16 వేల పదవులను నిర్ధాక్షన్యంగా ఈ జగన్ యాదవులకు దూరం చేశారు. బీసీ డిక్లరేషన్ ప్రకటించిన ఏకైక పార్టీ టిడిపి నే అని గర్వంగా చెబుతున్నాను. ప్రజలను, ప్రజా సంపదను దోచుకునే నాయకులు కావాలా! ప్రజా సంక్షేమం కోరుకునే పెమ్మసాని చంద్రశేఖర్, నాదెండ్ల మనోహర్ వంటి నాయకులు కావాలా! మనసంతా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ తాడిబోయిన శ్రీనివాసరావు, తెనాలి పట్టణ టీడీపీ తాడిబోయిన హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Tenali Road Show
ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క. + జగన్ ప్రభుత్వానికి పెమ్మసాని హెచ్చరిక. + తెనాలి ఎన్నికల పర్యటనలో పెమ్మసాని, మనోహర్. ‘రౌడీయిజాలు, గల్లీ గల్లీలో గంజాయి విక్రయాలు ఇకనైనా ఆపేయాలి. వచ్చేది టిడిపి ప్రభుత్వం అన్యాయం అరాచకాలపై ఉక్కు పాదం మోపుతుంది.ఇప్పటిదాకా ఒక లెక్క ఇకనుంచి మరో లెక్క.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలిలోని ఐతానగర్ నుంచి గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తన పర్యటనను గురువారం ప్రారంభించారు. తెనాలి నియోజకవర్గం కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తో కలిసి చేపట్టిన పర్యటనలో స్థానికులతో మాట్లాడుతూ ముందుకు సాగారు. పెమ్మసాని చంద్రశేఖర్: జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ ప్రతి ఏటా జాబ్ విషయం మర్చిపోయి సాక్షి కేలండర్ విడుదల చేస్తున్నారు. రాజధాని ప్రాంతాన్ని స్మశానం అని వ్యాఖ్యానించిన జగన్, ఆ పార్టీ నాయకులు ఆ స్మశానంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఎందుకు ఇచ్చారు? అంటే పేదలను కాటికాపరులుగా భావించటం మీ ప్రభుత్వం ఉద్దేశమా? అబద్ధాలు చెప్పి, చెప్పి.. నిజం అంటే ఏంటో కూడా జగన్ మర్చిపోయారు. పొద్దున లెగిస్తే నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ జగన్ ప్రచారం చేసుకుంటారు. మరి ఒక దళిత డ్రైవర్ ను వైసిపి నాయకులు చంపితే ఎందుకు ఊరుకున్నారు? ఒక దళిత వైద్యుడు మాస్క్ అడిగాడు అన్న కోపంతో అతని ప్రాణాలు పోయేవరకు హింసించారు. ఇదేనా ఎస్సీ, ఎస్టీలకు వైసీపీ ప్రభుత్వంలో దక్కే విలువ? పేరుకు మాత్రం బీసీలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన జగన్ ప్రభుత్వం కనీసం ఆ కార్పొరేషన్ కార్యాలయాల్లో కూర్చోడానికి కుర్చీ కూడా ఇవ్వలేకపోతున్నారు. జగన్ ప్రభుత్వంలో మంచినీళ్లు దొరుకుతున్నాయో లేదో గాని, ప్రతి గల్లీలో గంజాయి మాత్రం దొరుకుతుంది. ఈ జగన్ ప్రభుత్వానికి ఒకటే చెబుతున్నాను. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇకనుంచి ఇంకో లెక్క ఉంటుంది. రౌడీయిజం చేసే వాళ్లకు, గంజాయి విక్రేతలపై మా ప్రభుత్వం ఉక్కు పాదం మోపబోతుంది. ప్రభుత్వ శాఖల్లో చాలామంది అధికారులు ఈ ప్రభుత్వానికి వంత పాడుతున్నారు. పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ వేసుకోవడంపై ఆ ప్రభుత్వం ఆంతర్యం ఏంటో అర్థం కావడం లేదు. మహా అయితే గడిచిన ఐదేళ్లు మాత్రమే ఉండే జగన్, ప్రజలు జీవితాంతం వాడుకోవాల్సిన పాస్ పుస్తకాలపై ఫోటోలు ఎందుకు వేసుకోవలసి వచ్చింది? నాదెండ్ల మనోహర్: ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వారంలోనే గంజాయి విక్రయాలను అరికడతాం. తెనాలిలో ఇదివరకు ఎప్పుడూ లేనివిధంగా రౌడీయిజం, గంజాయి విక్రయాలు మితిమీరి పోయాయి. * ఈ పర్యటనలో మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి, మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, టిడిపి తెలంగాణ నాయకులు నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Padmasali Athmiya Samavesam
పేదలకు ఇల్లు కట్టించే బాధ్యత మాది. + స్థానిక ఎమ్మెల్యేకు ప్రజా సమస్యలపై అవగాహన శూన్యం. + తెనాలిలో జరిగిన పద్మశాలి ఆత్మీయ సమావేశంలో పెమ్మసాని. తెనాలి నియోజకవర్గ కేంద్రంలోని స్థానిక ఎన్విఆర్ కళ్యాణ మండపంలో గురువారం జరిగిన పద్మశాలీ ఆత్మీయ సమావేశం కార్యక్రమానికి గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ కోటమీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. * పెమ్మసాని చంద్రశేఖర్: నేను బుర్రిపాలెం బుల్లోడు కాను, అవినీతిపరుల గుండెల్లో దిగబోయే బుల్లెట్ ను. పద్మశాలీలు అంటే ఒక సంస్కృతి, సాంప్రదాయం. ప్రతి ఒక్కరికి దుస్తులు ధరించడంలో వినూత్నతను పరిచయం చేసిన పద్మశాలీలకు నా వందనాలు. కళను నమ్మకొని ఎక్కడెక్కడకో వెళ్లి జీవిస్తున్న వారు కొందరైతే ఇక్కడే ఉంటూ చేనేత కళపై ఆధారపడి జీవిస్తున్న వారు మరెందరో ఉన్నారు. నా సతీమణి కూడా ఈ చేనేత కార్మికుల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం చేనేత కార్మికుల సమస్యలను ఆమె ద్వారా విన్నప్పుడు చాలా బాధనిపించింది. ఆ సమస్యలు విన్నాక ఏదో ఒక మంచి చేయాలి అని మేమిద్దరం దృఢమైన నిర్ణయం తీసుకున్నాం. ఎన్నికల తర్వాత మీతో కూర్చొని, మీ సమస్యలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే మెరుగైన జీవన విధానాలను అందించగలుగుతామనేది సంఘ నాయకులతో కూర్చుని చర్చిద్దాం. నేను, లోకేష్, మనోహర్ గారు అందరం కలిసి చేనేత సంఘాలకు వీలైనంత సహాయ సహకారాలు అందిస్తాం. కనీసం ఇల్లు లేని వ్యక్తులు కూడా మీలో చాలామంది ఉన్నారు. అయితే అలాంటి పేదలకు జగన్ రెడ్డి లాగా ఒక సెంటు భూమి ఇచ్చి చేతులు దులుపుకునే అవసరం టిడిపికి లేదు. టిడిపి నేతృత్వంలో రెండు సెంట్లు స్థలాల్లో ఇల్లు లేదా టిట్కో నివాసాలు అందించే బాధ్యత టిడిపి, మేము తీసుకుంటాము. ముందు ముందు అవకాశాలు ఉన్న ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలన్న అంశంపై జగన్ గారితో పాటు స్థానిక ఎమ్మెల్యేకు కూడా అవగాహన శూన్యం అనుకుంటా! * నాదెండ్ల మనోహర్: జనసేనలో మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సంఘం చేనేత సంక్షేమ సంఘం. ప్రభుత్వంలోని యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ఉపాధి, సంక్షేమ అవకాశాలు మెరుగుపలుచుకోవాల్సిన అవసరం ఉంది. చేనేతల నుంచి యూనిఫామ్ లు తీసుకున్నామని జగన్ అబద్ధం చెప్పారు. ఐదు కంపెనీలకు రూ. 670 కోట్లు కేవలం యూనిఫామ్ లకు కట్టబెట్టిన ఘనత ఈ జగన్ ప్రభుత్వానిది. పచ్చి అబద్ధాలు చెప్పి, ప్రజలను మోసం చేసి, ఇప్పుడు ఓట్ల కోసం ఈ వైసీపీ నాయకులు మన ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 40 రోజుల పాదయాత్రను పూర్తి చేసుకున్నాను. ఈ పాదయాత్రలో అడుగడుగునా ప్రజలు వైసిపి వల్ల పడ్డ బాధలను చెప్పుకున్నారు. * ఇతర ప్రాంతాల్లో, రాష్ట్రాల్లో నివసిస్తున్న మన ప్రాంతానికి చెందిన యువత, ఇతర వర్గాల ఓటర్లు ఓటు వేయాలని బాధ్యతగా సొంత ఖర్చు పెట్టుకుని ఎన్నికల కోసం వస్తున్నారు. ప్రజల సమస్యలను తీర్చాలని ఉద్దేశంతో చంద్రబాబు గారు ఉచిత బస్సు, మహిళల కోసం మరిన్ని పథకాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈరోజు టెక్నాలజీని ఎంతగా ఉపయోగిస్తే అన్ని మెరుగైన ఉద్యోగాలు లభిస్తున్నాయి. మహిళలు కూడా అదే స్థాయిలో సాంకేతికతను ఉపయోగించుకొని అవకాశాలు అందిపుచ్చుకోవాలి. ఆలపాటి రాజేంద్రప్రసాద్: మన ప్రాంతంలో పద్మశాలీలను విశాల హృదయులు అని పిలుస్తుంటాం. విభజనకు ముందు నుంచి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పద్మశాలీలకు టిడిపీ ఉన్నత స్థానం కల్పించింది. ఈ ప్రభుత్వంలో ఇల్లు కట్టుకోవాలనుకున్న బీదల ఆశలు అడియాశలు అయ్యాయి. టిడిపి హయాంలో ఇల్లు కట్టించి ఏర్పాటుచేసినా సరే, ఈ ప్రభుత్వం వచ్చాక ఇళ్లన్నీ మట్టిపాలు చేసింది. తెనాలి నియోజకవర్గంలో 10,000 మంది ఉన్న ఈ ఓటర్లలో మెజారిటీ శాతం ఓటర్లంతా టిడిపికే వేస్తామని చెబుతున్నారంటే, వైసిపి ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకత స్పష్టమవుతుంది. మన ఇళ్లల్లో మనం ఉండగలమా! మన భూములు మనకు సొంతం అవుతాయా! అన్న అభద్రతా భావంలో ఉన్నామంటే, ఈ ప్రభుత్వం ఎంత అరాచక పాలన చేస్తుందో అర్థమవుతుంది. ఇలాంటి ఎన్నో విపత్కర పరిస్థితుల్లో మనకి ఉన్న ఒకే ఒక్క ఆసరా మన ఓటు హక్కు. చేతిలో ఉన్న ఆ ఆయుధంతోని మనల్ని మనం కాపాడుకుంటూనే సమాజాన్ని కూడా కాపాడే బాధ్యత తీసుకోవాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఓటు వేయకపోవడం అనేది మహా పాపం అనే గ్రహించాలి. జొన్నాదుల మహేష్ సభా అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి చిల్లపల్లి శ్రీనివాసరావు, అవ్వారు శ్రీనివాసరావు, దివి అనిత, దివి హేమంత్, పడవల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Guntur Town Visit
నరకయాతనలో నగర జనం. + అర్థ దశాబ్దంగా దర్శనమిస్తున్న అసంపూర్ణ వంతెనలు. + ట్రాఫిక్ ఇక్కట్లు తీర్చలేని అస్తవ్యస్త ప్రభుత్వం. + గుంటూరులో అసంపూర్ణంగా ఆగిన వంతెనల పరిశీలనలో పెమ్మసాని ‘పెరుగుతున్న నగర జనాభాకు తగ్గ రహదారులు లేవు. ప్రజా జీవనానికి తగ్గ సౌకర్యాలు లేవు. ట్రాఫిక్ సమస్యలు తీర్చే నాధులు లేరు. పురాతన, నూతన వంతెనల స్థితిగతులు పట్టించుకునే నాయకులు లేరు. అస్తవ్యస్తంగా మారిన నగర జీవనంలో ట్రాఫిక్ సమస్యలు కూడా ఒక భాగమైపోయాయి. ఈ పరిస్థితులు మారాలని, టిడిపి ప్రభుత్వం రాగానే నవనిర్మాణాలకు శ్రీకారం చుడతామని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ వివరించారు. * నగరంలోని ట్రాఫిక్ సమస్యలపై పెమ్మసాని గుంటూరులో పలు రహదారులను, అసంపూర్ణంగా ఆగిన వంతెనల నిర్మాణాలను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైల్వే శాఖ, గుంటూరు కార్పొరేషన్ సమిష్టి సమన్వయంతో ఏనాడో పూర్తి కావాల్సిన వంతెనలను నేటికీ పట్టించుకోక గాలికి వదిలేసిన ప్రస్తుత ప్రభుత్వ తీరుపై ఆయన మండిపడ్డారు. * కార్యక్రమంలో భాగంగా 1. శ్యామల నగర్(R.U.B) 2. గుంటూరు-నందివెలుగు రోడ్డు (R.O.B) 3. శంకర్ విలాస్ వద్దగల 75 ఏళ్ల పురాతన వంతెన (R.O.B) తదితర ప్రాంతాల్లోని పురాతన, అసంపూర్ణంగా ఆగిన వంతెనలను ఆయన పరిశీలించారు. కాగా సంబంధిత పలువురు అధికారులతో మాట్లాడి ఆయా రైల్వే గేటుల పైగుండా నిర్మాణ ప్రతిపాదనలు జరిగి, ప్రక్రియ ముందుకు సాగని పలు వంతెనల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మాణాలకు జరిగిన నిర్ణయాలు, నిధుల కేటాయింపులు, దారి మళ్లించిన అధికారుల, నాయకుల ఆగడాలు తదితర అంశాలు ఈ సందర్భంగా ప్రస్తావించారు. అసంపూర్తిగా ఆగిన నిర్మాణాలతోపాటు 75 ఏళ్ల క్రితం నిర్మించిన వంతెనల పరిస్థితి కూడా దారుణంగా ఉన్నాయని ఈ సందర్భంగా పెమ్మసాని వ్యాఖ్యానించారు. మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కూడా ఎన్నో ప్రయత్నాలు చేసినా, జగన్ ప్రభుత్వం సహకారం అందించకపోవడంతో ప్రయత్నాలన్నీ ఎక్కడి గొంగళి అక్కడే అన్న తీరున ఆగిపోయాయని ఆయన విమర్శించారు. నిర్మాణాలకు అవసరమైన నిధులన్నీ జగన్ ప్రభుత్వంలో పక్కదారి పట్టాయని, టిడిపి అధికారంలోకి రాగానే ఆగిన నిర్మాణాలకు పరిష్కారం చూపిస్తామని ఆయన వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో త్వరితగతిన వంతెనల నిర్మాణాలు కార్యరూపం దాల్చేలా పాటుపడతామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పోతురాజు సమత, ఈరంటి హరిబాబు, వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.