పొన్నూరు నియోజకవర్గంలో డాక్టర్ పెమ్మసాని మంగళవారం సుడిగాలి పర్యటనను చేపట్టారు. టీడీపీ – జనసేన – బీజేపీ ఆధ్వర్యంలో తొలుత బ్రాహ్మణకోడురులో ప్రారంభం అయిన ఆ ర్యాలీ వెళ్లలూరు, మామిల్లపల్లి, మునిపల్లె, గోళ్లమూడిపాడు, శ్రీపురం, పచ్చలతాడిపర్రు, కట్టెంపూడి, తాల్లపాలెం, ఆలూరు, కొండమూదిలో జరిగిన పర్యటనలో ఆయన పాల్గొన్నారు. కాగా ఆయా ప్రాంతాల్లోని పలు సమస్యలపై స్పందించారు. ఈ భూమిపై ఎనలేని ప్రేమ ఉంది కాబట్టి మళ్ళీ వెనక వచ్చానని తెలియజేశారు. నేనే రాజు – నేనే మంత్రి అనే చందాన ఈ ప్రభుత్వం పాలన సాగిస్తోందని చెప్పారు. మద్యపానం చేస్తానని చెప్పిన జగన్ ప్రభుత్వం నేడు నాసిరకం మద్యం విక్రయిస్తూ ప్రజల రక్తం పిండేస్తున్నారన్నారు. అభివృద్ధి పెరిగితేనే ఆదాయం కూడా పెరుగుతుందని, ప్రగతికి పూలబాట వేసే వారిని ఎన్నుకోవాలని చంద్రశేఖర్ కోరారు.  పర్యటనలో బీజేపీ రాష్ట్ర మీడియా కో ఆర్డినేటర్ పాతూరి నాగభూషణం, టీడీపీ సీనియర్ నాయకులు దుగ్గిరాల సీతారామయ్యతో పాటు పలువురు టీడీపీ – జనసేన – బిజెపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.