Kumar Pumps Showroom Visit
ప్రోత్సాహకాలు లేక పరిశ్రమలు కుదేలు. * కార్మికులతో డాక్టర్ పెమ్మసాని. నాయకుడిని బట్టి ప్రజలు, పరిశ్రమలను బట్టి కార్మికుల జీవితాలు ఆధారపడి ఉంటాయి. ఒక కార్మికుడి కష్టం ఒక వ్యవస్థను నిలబెడుతుంది.’ అని టిడిపి నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. తెనాలిలోని కుమార్ పంప్స్ అండ్ మోటార్స్ పరిశ్రమను ఆయన గురువారం పరిశీలించారు. అక్కడి కార్మికులతో మమేకమై కాసేపు మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కష్టపడి పని చేసే వారికే ఆ కష్టం విలువ తెలుస్తుందని, కార్మికులు గాని కార్యకర్తలు గాని బాగున్నప్పుడే వ్యవస్థలు సజావుగా నడుస్తాయని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఎన్నో పరిశ్రమలు ప్రోత్సాహకాలు లేక కుదేలవుతున్నాయని, మరికొన్ని పరిశ్రమలు రాష్ట్రం వదిలి వెళ్ళిపోతున్నాయని ఆయన వివరించారు. తర్వాత సంస్థ అధినేత కొత్తా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ 50 ఏళ్ల చరిత్రలో ప్రస్తుత పరిస్థితి లాంటి ఇబ్బందులు ఎప్పుడూ ఎదురు కాలేదని తెలిపారు. ప్రతి ఒక్కరు ఆలోచించి తమ నిర్ణయం తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా అందరినీ కోరారు.
21
Mar
SP Office Visit - Attack on Prattipadu MLA
పత్తిపాడు నియోజకవర్గ టిడిపి అభ్యర్థి బూర్ల రామాంజనేయులుపై బుధవారం జరిగిన వైసీపీ నాయకుల దాడిని ఖండిస్తూ డాక్టర్ పెమ్మసానితో పాటు పలువురు టీడీపీ, బిజెపి, జనసేన నాయకులు ఎస్పీ తుషార్ డూడీని ఆయన కార్యాలయంలో గురువారం కలిసి ఫిర్యాదు చేశారు. ఎస్పీని కలిసి సమస్యను వివరించిన తర్వాత ఎన్నికల నియమావళిని సంపూర్ణంగా అమలు చేయాలని కోరారు. అనంతరం విలేకరులతో పెమ్మసాని మాట్లాడుతూ ఎస్పీ, కలెక్టర్ కలిసి ఎన్నికల నిబంధనలపై స్పష్టమైన వైఖరిని అవలంబించాలని కోరారు. అధికార పార్టీ నాయకులు ఇదే తీరున దాడులకు తెగబడితే చూస్తూ ఊరుకోబోమని, తమదైన పద్ధతిలో సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని వైసిపి నాయకులను ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, తాడికొండ నియోజకవర్గం టిడిపి అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టిడిపి అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి, గుంటూరు తూర్పు నియోజకవర్గం టిడిపి అభ్యర్థి మహమ్మద్ నసీర్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, బిజెపి జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.
Meet With Makinavaripet People
నమ్మకాన్ని వమ్ము చేయం. * బాబు చలవతో ఎయిమ్స్ ద్వారా మూడు వేల ఉద్యోగాలు. ‘ఎయిమ్స్ ను మంగళగిరికి తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు కృషి ఎనలేనిది. ఎయిమ్స్ ను తీసుకురాకుంటే మూడు వేల ఉద్యోగాలు వచ్చేవే కావు. లోకేష్ గారు, తానుప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయబోము’ అని టిడిపి నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. మంగళగిరి మండలం నవులూరు గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగిన కార్మిక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎయిమ్స్, ఎయిమ్స్ లో పనిచేసే సిబ్బందిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 2014లో చంద్రబాబు పట్టుబట్టి మరి ఎయిమ్స్, మూడు యూనివర్సిటీలను రాజధాని ప్రాంతంలో తీసుకు రాగలిగారన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం మంగళగిరి పరిసరాల్లో యువతను గంజాయి, మత్తుమందుకు బానిసలను చేస్తుందని వివరించారు. మహిళలు తలుచుకుంటే ఆదిశక్తులుగా మారి ప్రభుత్వాలనే కూల్చేసిన చరిత్ర మనకు విధితమేనని తెలిపారు. ఎయిమ్స్ చుట్టుపక్కల డ్రైన్ సిస్టం, డంపింగ్ యార్డ్ నిర్మూలన, తాగునీటి సమస్య వంటి ఎన్నో ఇబ్బందులతో ప్రజలు సతమతమవుతున్నారని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయా సమస్యలపై దృష్టి పెడతామని పెమ్మసాని చెప్పారు. నారా లోకేష్ ఒక సింహం. ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ టిడిపి సమన్వయకర్త నందం అబద్దయ్య, బిజెపి జిల్లా మాజీ అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మైనర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
Attack on Prathipadu MLA
Pemmasani meets Prathipadu MLA. They discussed about various issues.
Guntur-West party office inauaguration ceremony
Guntur-west party office inaugaration ceremony with GALLA MADHAVI (Guntur-west TDP Janasena BJP MLA candidate)
Break Fast with NaraLokesh in Aparna 1 Apartments
శ్రమ ఆయన రక్తంలోనే ఉంది. * నారా లోకేష్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో డా. పెమ్మసాని. ‘ చేనేతల గురించి చెప్పిన ఎన్టీయార్ గళం మనిషై మంగళగిరి బరిలో కాలు దువ్వుతుంది. ఈ నియోజకవర్గం నిజంగా చాలా అదృష్టం చేసుకుంది.’ అని టీడీపీ నాయకులు డా. పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. తాడేపల్లిలోని నివాసంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో బుధవారం రోటరీ క్లబ్, కిరాణా అసోసియేషన్, చేనేత సంఘ సభ్యులతో జరిగిన సమావేశంలో పెమ్మసాని కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర సంబంధిత ప్రాజెక్టులు తీసుకు రావడంతో తమ వంతు కృషి తాము చేస్తామని, ఉద్యోగాల కల్పనకు సహకరిస్తామని చెప్పారు. ఇతరుల గురించి ఆలోచించే అలాంటి వ్యక్తులు ఉండబట్టే దుర్మార్గులు ఉన్న ఈ సమాజం ఇంకా బ్యాలెన్స్ గా ఉందన్నారు. కష్టపడే తత్వం, శ్రమ తన రక్తంలో నింపుకున్న నారా లోకేశ్ వంటి నాయకులు మంగళగిరికి లభించారన్నారు. కాగా సభ్యులతో మాట్లాడుతూ స్థానిక సమస్యలు, ప్రజలకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై లోకేశ్ సవివరంగా సభ్యులతో చర్చించారు. రాబోయే ఎన్నికల దృష్ట్యా ఏదేని సమస్యలు తలెత్తినా తనను సంప్రదించాలని లోకేశ్ కోరారు.
Ponnur Roadshow
చేబ్రోలు మండలంలోని వేజెండ్ల లో డాక్టర్ పెమ్మసాని, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రతో కలిసి మంగళవారం పర్యటించారు. అందులో భాగంగా ఆయన వేజెండ్ల లోని పలు ప్రాంతాలలో పర్యటిస్తూ స్థానికులను కలుసుకొని మాట్లాడారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన జగన్, ప్రజల 45 ఏళ్ల భవితవ్యాన్ని నాశనం చేశారన్నారు. ఇక మళ్ళీ రానేమో అన్న భయంతోనే స్థానిక ఎమ్మెల్యే అక్రమ మైనింగ్ తో చెలరేగిపోతున్నారని తెలిపారు. అదే దోపిడీలో జగన్ కు వాటాలు లేవంటే నమ్మగలమా? అని ఆయన నిలదీశారు. స్థానిక ఎమ్మెల్యే ఒక్క ఛాన్స్ ఇస్తేనే 700 ఎకరాలు మింగేశారని, ఇక పార్లమెంట్ కు వెళ్తే ఇంకేం చేస్తారోనన్నారు. తాను చట్ట సభలోకి అడుగు పెట్టిన మారు క్షణం నుంచి ప్రజలకు భరోసాగా ఉంటానని, ముస్లింల మనోభావాలకు, స్వేచ్ఛకు విఘాతం కలగకుండా చూసుకుంటానని స్పష్టం చేశారు. అలాగే ధూళిపాళ్ల మాట్లాడుతూ ముస్లింలకు నిజమైన న్యాయం చేసింది టీడీపీ అని తెలిపారు. రంజాన్ తోఫా, మసీదుల మరమ్మతులు, విద్యార్థులకు సహాయ సహకారాలు అందించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఈ జగన్ ప్రభుత్వంలో ముస్లింల కోసం ఒక్క రూపాయి అయినా ఖర్చు చేసారా? అని ప్రశ్నించారు. ఈ పర్యటనలో మండల ప్రెసిడెంట్ మైలా వెంకటరామారాజు తదితరులు పాల్గొన్నారు.
Ponnur Quarry Visit
కిలా(రి)డి దోపీడీ. * 700 ఎకరాల్లో అక్రమ మైనింగ్. * రూ. 2,100 కోట్లు తినేసిన భూ బకాసురులు * దోపిడీ కింగ్ కు ఎంపీ అభ్యర్థిగా జగన్ ప్రమోషన్. * దళితుల భూముల ఆక్రమణ – అక్రమ గ్రావెల్ : డా. పెమ్మసాని.’దళితుల, ప్రభుత్వ భూములను ఆక్రమించి, అక్రమ గ్రావెల్ తవ్వుకోవడానికి మీకు అనుమతులు ఎవరిచ్చారు?దాదాపు 700 ఎకరాలకు పైగా భూముల్లో జరుగుతున్న అక్రమ తవ్వకాలను అడ్డుకోవాల్సింది పోయి ఎకరానికి రూ. 30 లక్షలు చొప్పున ఈ ఎమ్మెల్యే కప్పం వసూలు చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యంగా వీరనాయునిపాలెంలోని అక్రమ మైనింగ్ జరుగుతున్న 60 ఎకరాల్లో 20 ఎకరాలు దళితులకు చెందినవేనని, మిగిలినవన్నీ ప్రభుత్వ భూములేనని గ్రామస్తులు ఆరోపిస్తున్నారని పేర్కొన్నారు. వందలకొద్దీ అడుగులు తవ్వుకుంటూ పోవడంతో భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయన్నారు. కనీసం పంట పొలాలకు కూడా నీళ్లు అందే పరిస్థితి కనిపించడం లేదని తెలిపారు. సకాలంలో నీరు అందక 40 క్వింటాళ్లు పండాల్సిన మొక్కజొన్న, తదితర పంటల దిగుబడి నేడు 10 క్వింటాళ్లకు పడిపోయిందని వివరించారు. రూ. 2,100 కోట్లు దిగమింగారు మండలంలో ప్రతి ఎకరా అక్రమ తవ్వకానికి 30 లక్షలు చొప్పున వసూలు చేయడమే గాక గడిచిన నాలుగున్నర ఏళ్లలో రూ. 2,100 కోట్లను ఈ వైసీపీ నాయకులు దిగమింగారని చెప్పారు. అదే సొమ్మును నియోజకవర్గంలోని రోడ్ల నిర్మాణానికి గాని డ్రైన్ల నిర్మాణానికి గాని ఉపయోగించి ఉంటే ప్రజాజీవనం బాగుపడేదని ఆయన అభిప్రాయపడ్డారు. పచ్చని సపోటా, మొక్కజొన్న తోటలు కూడా తవ్వేసి గ్రావెల్ అక్రమ సరఫరా చేస్తున్న ఈ నాయకులను మళ్లీ గెలిపిస్తే నియోజకవర్గం భూస్థాపితం అవుతుందని ఆయన తన ఆవేదనను వ్యక్తపరిచారు.
Break Fast with NaraLokesh in Amaravathi Apartments
Dr Pemmasani Chandrasekhar breakfast meet with residents of Amaravathi apartments accompained by Nara Lokesh.