గెలవడం పక్కా.. మెజారిటీ ఎంతన్నదే లెక్క * సిరిపురం సభలో పెమ్మసాని ‘ గెలవడం పక్కా.. మెజారిటీ ఎంతన్నదే నా లెక్క.’ అని టీడీపీ నాయకులు డా. పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. సోమవారం మేడికొండూరులో జరిగిన రోడ్డు షో లో భాగంగా సిరిపురం గ్రామంలో పెమ్మసాని మాట్లాడారు. స్థానిక టీడీపీ నాయకుల నేతృత్వంలో ఏర్పాటు చేసిన సభలో పెమ్మసానితో పాటు తాడికొండ నియోజకవర్గ టి డి పి అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం పెమ్మసాని మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తలు అంటే మందు బాటిళ్లకు అమ్ముడుపోయే మనుషులు కాదని తెలిపారు. చంద్రబాబు తీసుకొచ్చిన 3 యునివర్సిటీల చుట్టూ అద్భుతమైన నగరం నిర్మించాల్సింది పోయి, యునివర్సిటీలకు కరెంట్ కట్ చేసిన వికృత ఘనత ఈ ప్రభుత్వానికే చెల్లుతుందన్నారు. మిర్చి రైతులకు గిట్టుబాటు ధర లేదని పంటలకు నీళ్లు లేవని ఆయన అన్నారు. రోడ్ షో సాగిందిలా. మేడికొండూరు మం. లోని మేడికొండూరు, కొత్తూరు, జంగంగుంటల పాలెం, సిరిపురం, సరిపూడి, విసిదల గ్రామాల్లో పర్యటనలో పాల్గొన్నారు. సిరిపురం గ్రామ పర్యటనలో భాగంగా ఎడ్లబండిని నడుపుతూ పెమ్మసాని గ్రామంలో పర్యటించారు. అలాగే మార్గం మధ్యలో కొఱ్ఱపాడులోని ఓ మిరపతోటలో పనులు చేస్తున్న వ్యవసాయ కూలీలను కలుసుకున్నారు. స్థానిక, కూలీల సమస్యలను ఈ సంధర్భంగా అడిగి తెలుసుకున్నారు.