నా రక్తంలోనే ఇండియా ఉంది. * అప్పుల పథకాలతో పాలన ఎల్లకాలం సాగదు. * పేరేచర్ల బహిరంగ సభలో డాక్టర్ పెమ్మసాని ‘ఎన్ ఆర్ ఐ అంటే నా రక్తంలోనే ఇండియా ఉందని అర్థం.’ అని టిడిపి నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. మేడికొండూరు మండలంలో సోమవారం జరిగిన రోడ్ షో అనంతరం పేరేచర్లలో టిడిపి జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తాడికొండ నియోజకవర్గ టిడిపి అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ సభా అధ్యక్షతన ఆ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా పెమ్మసాని రాకను స్వాగతిస్తూ వైసీపీకి చెందిన 110 కుటుంబాలు ఆ పార్టీని వీడుతూ టిడిపిలో చేరాయి. కార్యకర్తల ఆగమనాన్ని అభిలాషిస్తూ డాక్టర్ పెమ్మసానితో పాటు శ్రావణ్ కుమార్ వారికి టిడిపి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  ఈసారి గనుక చంద్రబాబు ముఖ్యమంత్రి కాకపోతే రాష్ట్రం అధోగతి పాలవుతుందనే భయంతోనే టిడిపిలో చేరానని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కార్యక్రమంలో భాగంగా బూత్ స్థాయిలో పనిచేసిన పలువురు ఇన్చార్జిలకు ప్రశంసా పత్రాలను అందజేసిన పిదప సత్కరించారు. కార్యక్రమంలో జనసేన తాడికొండ నియోజకవర్గ ఇన్చార్జి విజయ శేఖర్ తో పాటు పలువురు టిడిపి-జనసేన నాయకులు పాల్గొన్నారు.