Roadshow In Ponnur Assembly
చేబ్రోలు మండలంలోని శుద్ధపల్లి నల్లపాడు వీరనాయకుని పాలెం సేకూరు, గరువుపాలెం వడ్లమూడి ప్రాంతాలలో పొన్నూరు నియోజకవర్గ టిడిపి అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర తో కలిసి డాక్టర్ పెమ్మసాని మంగళవారం పర్యటించారు. అనంతరం వడ్లమూడి సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమ ముగింపు సభలో డాక్టర్ పెమ్మసాని ఈ విధంగా మాట్లాడారు.. ముస్లింల ఆవేదన చూసి తట్టుకోలేకపోయాను. డా. పెమ్మసాని రెండు రోజుల క్రితం లామ్ గ్రామంలో టీడీపీలో చేరిన కొందరు వైసీపీ నేతలు మాట్లాడుతూ ‘మమ్మల్ని బెదిరిస్తున్నారు అన్న’ అని చెప్పారు. ఆ క్షణం నేను ఆవేదన చెందాను అని వివరించారు. ఒక్క రూపాయీ అవినీతి జరగదు. ఎవరి కష్టం వృథా కాకుండా, ఒక్క రూపాయి అవినీతి జరక్కుండా అభివృద్ధి చేసి చూపించే బాధ్యత నాది. ఏటా రూ. 5 కోట్ల చొప్పున ఐదేళ్లకు రూ. 25 కోట్ల ప్రభుత్వ నిధులతో పాటు తన సొంత నిధులను కూడా కలిపి అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. తాను పనిచేస్తానే తప్ప, ఒకరి కష్టాన్ని దోచుకోవడం చేతకాదని తెలిపారు.
Roadshow In Lam
తాడికొండ మండలం లోని లాం గ్రామంలో సోమవారం జరిగిన ప్రచార కార్యక్రమంలో తెనాలి శ్రావణ్ కుమార్ తో కలిసి గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. పెమ్మసాని చంద్రశేఖర్: నేడు టిడిపిలో చేరిన కార్యకర్తల్లో షేక్ మీరా, బషీర్, షాజహాన్ తదితరులున్నారు. వైసీపీ పై విరక్తి చెంది ఆ కార్యకర్తలంతా టీడీపీలో చేరారు. పార్టీ మారాలన్న ఆలోచన వచ్చిందే మొదలు ఆ కార్యకర్తలపై వైసీపీ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. జగన్ కూడా అలాంటి వారే. అని పెమ్మసాని మాట్లాడారు. కార్యక్రమం అనంతరంకార్యక్రమం అనంతరం ప్రచార ర్యాలీని ప్రారంభించిన డాక్టర్ పెమ్మసాని లాం గ్రామంలోని పలు ప్రాంతాలలో వ్యక్తులను, వర్గాలను కలుసుకొని ఆప్యాయంగా పలకరించారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని మరీ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ గురించి ప్రజలకు అవగాహన కల్పించేలా అందరికీ వివరంగా తెలియజేశారు.
At Mangalgiri Radhothsavam
నృసింహుని ఆశీర్వాదం ఏపీకి అవసరం. * మంగళగిరి రథోత్సవంలో నారా లోకేశ్ – ‘డా. పెమ్మసాని. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం ఆంధ్రప్రదేశ్ కు అవసరం. ఆ స్వామి కృపాకటాక్షాలతో త్వరలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడబోతుంది.’ అని టిడిపి జాతీయ పార్టీ అధ్యక్షులు నారా లోకేశ్, గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డా . పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు . మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరుగుతున్న రథోత్సవంలో యువనేత లోకేష్ తో కలిసి డా.. పెమ్మసాని సోమవారం పాల్గొన్నారు. ఆ సందర్భంగా , భక్తులతో కలిసి లోకేశ్ రథాన్ని లాగారు. పెమ్మసాని తొలుత పానకాల స్వామి దర్శనం చేసుకోగా, అనంతరం దిగువనపర్వతానికి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్లి దర్శనంతో పాటు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయం ప్రాంగణానికి వెలుపల ఉ న్న స్వామి వారి ఉత్సవ విగ్రహం ఉన్న రథాన్ని నారా లోకేశ్తో కలిసి ముందుకు తీసుకువెళ్లారు. ఈ క్రమంలో జయహో నరసింహా అంటూ భక్తులు భక్తి పారవశ్యం కొద్దీ తరించిపోయారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ, జిల్లా, నియోజకవర్గ నేతలు పాల్గొన్నారు.
Sri Lakshmi Ammavari Prathista-Buchiyathota
సకల శుభాలకు మూలం. * మహా లక్ష్మమ్మ అమ్మవారి విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమంలో డాక్టర్ పెమ్మసాని దంపతులు. ‘మహాలక్ష్మి అంటేనే సకల శుభాలకు మూలం. ఆ తల్లి దయతో రాష్ట్రానికి పట్టిన చీడ త్వరలో వీడిపోవాలి. అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు నగరంలోని స్థానిక 55వ డివిజన్లో గల బుచ్చయ్య తోటలో ఉన్న శ్రీ మహా లక్ష్మమ్మ అమ్మవారి దేవస్థానంలో విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమంలో పెమ్మసాని దంపతులు సోమవారం పాల్గొన్నారు. పెమ్మసాని దంపతులు తొలుత దేవాస్థానంలోకి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించగా పెమ్మసాని దంపతులతో పాటు గుంటూరు నసీర్ అహ్మద్ ను సత్కరించారు. అనంతరం భోజన ప్రసాద వితరణ లో పాల్గొన్న పెమసాని దంపతులు నాసిర్ భక్తులకు భోజనం వడ్డించారు. జంధ్యాల వేంకట రామలింగేశ్వర శాస్త్రి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టిడిపి నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్, ఆలయ సేవా సమితి సభ్యులతో పాటు పలువురు టీడీపీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.
Breakfast with Sri Nara Lokesh garu
Pemmasani along with Sri Nara Lokesh visits Mangalagiri for breakfast program.They visit Apartment and interacts with it’s Residents.
Guntur East Padyatra
Huge Rally is conducted in Guntur-East Constituency. Pemmasani attends the rally and interacts with people.
At Birthday celebration of Surya Prakash
ప్రజల అంచనాలకు మించి మా అభివృద్ధి. * వ్యాపారవేత్త చాపరాల సూర్య ప్రకాష్ పుట్టినరోజు వేడుకల్లో డాక్టర్ పెమ్మసాని. ‘జగన్ ప్రభుత్వం వైఫల్యం తర్వాత ప్రజలు టిడిపి వైపు ఆశగా చూస్తున్నారు. ప్రజల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అభివృద్ధి చేసి చూపిస్తాం.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. గుంటూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త చాపరాల సూర్య ప్రకాష్ గారి 84వ పుట్టినరోజు వేడుకలు స్థానిక మాజేటి రామ్ కళ్యాణ మండపం లో ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పెమ్మసాని మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో తన పాత మిత్రులను ఉపాధ్యాయులను కలుసుకోగలిగానని అన్నారు. రాజకీయాలు మాట్లాడాల్సిన వేదిక కాకపోయినా ఏదో ఒక సందర్భంలో ప్రజా సమస్యలు తమ కంట పడుతున్నాయని ఆయన తెలిపారు. టిడిపి ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోపే తమ అభివృద్ధి ఎలా ఉంటుందో చూపిస్తామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అనంతరం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టిడిపి అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి మాట్లాడుతూ ప్రజలు సరైన సమయంలో సరైన నాయకున్ని ఎంచుకున్న నాడే అసలైన ప్రజాస్వామ్యం నిలబడుతుందని తెలిపారు. అలాగే గుంటూరు తూర్పు నియోజకవర్గ టిడిపి అభ్యర్థి మహమ్మద్ నజీర్ అహ్మద్ మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకున్న జగన్ ప్రభుత్వం అరాచక పాలనకు తెరతీసిందని, అడుగడుగునా నలిగిపోయిన ప్రజానీకం జగన్ ప్రభుత్వానికి తిలోదకాలు వదలడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ వేడుకల్లో ప్రముఖ ఎనలిస్ట్ అడుసుమిల్లి శ్రీనివాసరావు, డాక్టర్ రామశేషయ్య, బిజెపి నాయకులు నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.
Meet with District Youth Cadre
గుంటూరు జిల్లా టిడిపి కార్యాలయంలో ఆదివారం జరిగిన జిల్లా తెలుగు యువత ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పెమ్మసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎంపీగా గెలిచి సైరన్ సౌండ్ వచ్చే వాహనాల్లో ప్రయాణించడానికి రాలేదని, తన వంతు సాయంగా యువతకు, ఇతరులకు తోడ్పాటును అందించేందుకు వచ్చామని చెప్పారు. యువత నిరుత్సాహపడకుండా సాంకేతికతతో పోటీపడుతూ ముందుకు సాగాలన్నారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, తాను కలిసి రాబోయే పదేళ్లకు ఉపయోగపడేలా ప్రజలకు, యువతకు ఉపయోగపడేలా పలు ప్రణాళికలు రచిస్తున్నామని, యువత సహకరిస్తే మరెన్నో అద్భుతాలు సృష్టించగలమని ఆయన తెలిపారు. రాజధాని పరిధిలో మూడు యూనివర్సిటీలు తెచ్చిన ఘనత చంద్రబాబు గారిదే అని అన్నారు. అయితే మరో 40 యూనివర్సిటీలు రాజధానికి రావడానికి సిద్ధంగా ఉండగా, జగన్ రద్దు చేయడంతో ఆగిపోయిన విషయం చాలామందికి తెలియదని వివరించారు. అలాగే జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు రాయపాటి సాయి కృష్ణ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని ఎంతోమంది యువతను ఇబ్బందులు పెట్టారని, అయినా తెలుగు యువత ఎక్కడా వెనకడుగు వేయలేదని తెలిపారు. కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టిడిపి అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి, గుంటూరు పశ్చిమ టిడిపి నాయకులు కోవెలమూడి రవీంద్రబాబు(నాని), తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి ఫిరోజ్, కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.