Events

Pedaravuru Village Meet
March 7, 2024    

Pedaravuru Village Meet

 తెనాలి మండలం పెదరావూరు లో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన టిడిపి – జనసేన మండల కార్యకర్తల ఆత్మీయ సమావేసంలో పాల్గొన్న డాక్టర్ పెమ్మసాని మాట్లాడుతూ తనకు ఊహ తెలిసినప్పటి నుంచి తెనాలి రోడ్లను ఇంత దారుణంగా ఎప్పుడూ చూడలేదని, ఆ రోడ్లు చూసి అన్నం తినే ఏ ఒక్కరూ వైసిపికి ఓటు వేయలేరని ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రతి ఓటర్ నూ పోలింగ్ బూత్ కు తీసుకువెళ్లి ఓట్లు వేయించుకోవాల్సిన బాధ్యత అందరి పైనా ఉందని, తనకు 1-2 ఏళ్లు సమయం ఇస్తే కష్టపడే ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూసే బాధ్యత తనదని డాక్టర్ పెమ్మసాని ఈ సందర్భంగా కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. అనంతరం స్థానిక షరాఫ్ బజార్ లోని జైన్ టెంపుల్ ను ఆయన దర్శించారు. కాగా జైన్ దేవాలయ కమిటీ సభ్యులు డాక్టర్ పెమ్మసానిని గౌరవంతో సత్కరించారు. అనంతరం సభ్యులను ఉద్దేశించి పెమ్మసాని మాట్లాడుతూ సాధారణ జీవనంలో ప్రశాంతత కోరుకునే వ్యక్తులు జైనులు ముందుంటారని, అలాంటి వ్యక్తుల వ్యాపారాలు, కుటుంబాలను ఏ ఒక్కరూ ఇబ్బంది పెట్టకుండా చూసుకునే బాధ్యత తాను తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. జైనులకు ఏదైనా సమస్య వచ్చినా, తన ఆఫీసు తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని, ఒక సెల్ ఫోన్ నుంచే వారి వారి సమస్యలను తీర్చేలా ప్రణాళికలు రచిస్తానని ఈ సందర్భంగా డాక్టర్ పెమ్మసాని వివరించారు.
Pedaravuru Team Meet
March 7, 2024    

Pedaravuru Team Meet

*కమీషన్లు మీరు తిన్నారా మీ నాయకుడా?. * రూ. 20 లక్షల ఖరీదైన భూములను రూ . 40 లక్షలకు ఎందుకు కొన్నారు? * తెనాలి మండల నాయకులతో పరిచయ వేదికలో డాక్టర్ పెమ్మసాని. ‘బుర్రిపాలెంలో జగనన్న కాలనీలను కమీషన్లు తినకుండా కట్టారా! లేదా చెప్పాలి. రూ. 20 లక్షల విలువైన భూములను రూ. 40 లక్షలు ఖర్చుచేసి ఎందుకు కొన్నారో స్పష్టత ఇవ్వాలి. ఆ కమీషన్ల వాటాలు మీరు తిన్నారా? మీ నాయకుడు తిన్నారా? అని టిడిపి నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అడిగారు. తెనాలి మండలం పెదరావూరు లో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన టిడిపి – జనసేన మండల కార్యకర్తల ఆత్మీయ సమావేసంలో పాల్గొన్న డాక్టర్ పెమ్మసాని మాట్లాడుతూ తనకు ఊహ తెలిసినప్పటి నుంచి తెనాలి రోడ్లను ఇంత దారుణంగా ఎప్పుడూ చూడలేదని, ఆ రోడ్లు చూసి అన్నం తినే ఏ ఒక్కరూ వైసిపికి ఓటు వేయలేరని ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రతి ఓటర్ నూ పోలింగ్ బూత్ కు తీసుకువెళ్లి ఓట్లు వేయించుకోవాల్సిన బాధ్యత అందరి పైనా ఉందని, తనకు 1-2 ఏళ్లు సమయం ఇస్తే కష్టపడే ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూసే బాధ్యత తనదని డాక్టర్ పెమ్మసాని ఈ సందర్భంగా కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. అనంతరం స్థానిక షరాఫ్ బజార్ లోని జైన్ టెంపుల్ ను ఆయన దర్శించారు.
07 Mar
March 7, 2024    

Fanboy Meet

 Pemmasani met one of the Fanboy who showed a heart-warming gesture towards him and got to interact with him.
Tags: fanboy
A visit to the farmers Agitation camp
March 6, 2024    

A visit to the farmers Agitation camp

దుగ్గిరాల తాసిల్దార్ కార్యాలయం ఎదురుగా రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష నిరవధికంగా ఆరో రోజుకు చేరిన క్రమంలో దీక్షా శిబిరం వద్దకు వెళ్లి రైతులను పెమ్మసాని గురువారం దుగ్గిరాలలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పసుపును నమ్మిన రైతులు తమ పంటను నిల్వ ఉంచుకొని, ధర ఎక్కువ పలికిననాడు అమ్ముకుంటూ ఉంటారన్నారు. ఈ క్రమంలో కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ ఉంచిన పసుపు బస్తాలు అగ్ని ప్రమాదానికి గురై నెల గడిచినా స్పందించని ఈ ప్రభుత్వ తీరును ఆయన తూర్పారబెట్టారు. రైతులకు అందాల్సిన బీమాను సంబంధిత కలెక్టర్, ప్రభుత్వం ముందుగా అంచనా వేయాల్సి ఉన్నా ప్రభుత్వం నేటికీ పట్టించుకోలేదన్నారు. కోల్డ్ స్టోరేజ్ ప్రమాద ఘటనపై తక్షణమే విచారణ జరపాలని డిమాండ్ చేసిన పిదప రైతులను కలుసుకొని ఘటనపై వివరాలను పెమ్మసాని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 380 మంది రైతులకు చెందిన 1.40 లక్షల బస్తాల పసుపు కాలిపోయిందని, ఇప్పటివరకు కనీసం ఈ ప్రభుత్వం బీమాకు సంబంధించిన సర్టిఫికేషన్ కూడా ఇవ్వలేకపోయిందని వాపోయారు. తమ ఎమ్మెల్యే అయితే రెండు నెలలుగా కనిపించకుండా పోయారని, ప్రభుత్వంతో ఆయనకు పనులు ఉంటేనే ప్రజలకు కనిపిస్తారా? అని ఈ సందర్భంగా రైతులు స్థానిక ఎమ్మెల్యేని ప్రశ్నించారు. పెమ్మసానికి తమ బాధను వెళ్ళబోసుకున్న వారిలో స్థానిక రైతులు పేర్ని రవి, కళ్ళం రామకృష్ణారెడ్డి, వేములపల్లి వెంకటరామయ్య తదితరులు ఉన్నారు.
TDP Office opening-Krishnayapalem
March 6, 2024    

TDP Office opening-Krishnayapalem

*పదేళ్లు మా ప్రభుత్వమే. * కృష్ణాయపాలెంలో విలేకరులతో డాక్టర్ పెమ్మసాని. ప్రజాజీవనం గాడిన పడాలంటే టిడిపి ప్రభుత్వం కనీసం 10 ఏళ్లకు తగ్గకుండా అధికారంలో ఉండాలని టిడిపి నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. మంగళగిరి మండలం, కృష్ణయపాలెం గ్రామంలో టిడిపి నూతన కార్యాలయాన్ని పెమ్మసాని బుధవారం ప్రారంభించారు. పెమ్మసాని రాకను పురస్కరించుకొని గ్రామ శివారులు మొదలు టిడిపి కార్యాలయం వరకు భారీ ర్యాలీ నడుమ ఆయనను స్థానిక టిడిపి నాయకులు తీసుకువెళ్లారు. ప్రారంభోత్సవం అనంతరం ఆయన మాట్లాడుతూ తన, తమ పార్టీ విజయాన్ని ప్రజలు ఎప్పుడో నిర్ణయించేశారని, ఇప్పుడు మెజారిటీపైనే తమ దృష్టి అంతా కేంద్రీకృతమై ఉందన్నారు. స్థానికంగా, మండల పరంగా రైతులకు పలు సమస్యలు ఉన్నాయని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమస్యల పరిష్కారంపై ముందుగా దృష్టి పెడతామని డాక్టర్ పెమ్మసాని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టిడిపి గ్రామ అధ్యక్షుడు ఆవల రవికిరణ్, ఈలప్రోలు శ్రీనివాసరావు, మంచికలపూడి వైష్ణవి, తదితరులు పాల్గొన్నారు.
06 Mar
March 6, 2024    

Slum visit

*సమన్వయ సన్నాహం. * పార్లమెంట్ నియోజకవర్గ జనసేన సమన్వయకర్తలతో డా. పెమ్మసాని, మనోహర్ సమావేశం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా చేతులు కలిపిన చంద్రబాబు – పవన్ ఆదేశాలను గ్రామస్థాయికి తీసుకెళ్లబోతున్నామని టిడిపి నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల జనసేన పార్టీ సమన్వయకర్తలతో తెనాలిలో సమావేశం జరిగింది. నియోజకవర్గ టిడిపి – జనసేన కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన ఈ సమావేశంలో టిడిపి నాయకులు డాక్టర్ పెమ్మసాని పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల, గ్రామ స్థాయిలో ఉన్న టిడిపి – జనసేన కార్యకర్తలను, నాయకులను ఒక తాటిపైకి తీసుకురావడంపై మాట్లాడామన్నారు. ఇరు పార్టీల నాయకులతో త్వరలోనే ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తామని చెప్పారు. అనంతరం మనోహర్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని మెరుగైన ఎన్నికల వాతావరణం ఏర్పరచి ఇరు పార్టీలకు ఉపయోగపడేలా సంసిద్ధమవుతున్నామన్నారు. చంద్రబాబు, పవన్ ఆదేశాలకు తగ్గట్టు ఓటు ట్రాన్స్ ఫర్ జరిగేలా చేయడమే తమ ధ్యేయమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Priyadarshini Engineering college-Fresher's day
March 5, 2024    

Priyadarshini Engineering college-Fresher's day

*ఆల్ రౌండర్ గా ఉంటేనే సక్సెస్. * విద్యార్థులతో డాక్టర్ పెమ్మసాని. విద్యార్థులు ఆల్ రౌండర్ గా, టీమ్ గా పనిచేసినప్పుడే సక్సెస్ వస్తుందని టిడిపి నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. పుల్లడిగుంట వద్ద ఉన్న ప్రియదర్శిని ఇన్స్ టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్ మెంట్ గ్రౌండ్స్ లో ఫ్రెషర్స్ డే కార్యక్రమం మంగళవారం జరిగింది. ఆ కార్యక్రమానికి డాక్టర్ పెమ్మసానితో పాటు ప్రత్తిపాడు నియోజకవర్గ టిడిపి అభ్యర్థి బూర్ల రామాంజనేయులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ విద్యార్థులు తలుచుకుంటే సాధించలేనిది అంటూ ఏదీ లేదని, వ్యక్తిగత ప్రేరణ, క్రమశిక్షణ ఉన్న ప్రతి విద్యార్థి తన లక్ష్యాన్ని చేరుకోగలరని చెప్పారు. ప్రతి వ్యక్తి తన చివరి నిమిషంలో ఫలానా పని చేయలేకపోయామని బాధపడకూడదని సూచించారు. ఓటేసే ముందు ప్రతీ ఒక్కరు వ్యక్తిగతంగా ప్రశ్నించుకొని, ఎవరైతే సమాజానికి ఉపయోగపడతారో ఆలోచించి మరీ ఓటేయాలని డా. పెమ్మసాని కోరారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ చైర్మన్ చందు రామారావు, ప్రిన్సిపల్ చందు బాబు తదితరులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు.

Jaya HO BC Meeting- Rally
March 5, 2024    

Jaya HO BC Meeting- Rally

*జయహో బీసీ. గుంటూరు పార్టీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా డా. పెమ్మసాని బయలుదేరగా, లక్ష్మీపురం నుంచి తూర్పు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి నసీర్ కూడా తమ ర్యాలీతో కలిసి భారీ ఊరేగింపుగా ‘ జయహో బీసీ’ కార్యక్రమానికి బయల్దేరి వెళ్లారు. లక్ష్మీపురం నుంచి జిన్నా టవర్ సెంటర్, బీ ఆర్ స్టేడియం రోడ్డు మీదుగా ఎన్టీయార్ సర్కిల్, బస్టాండ్, ఆర్టీసీ కాలనీ, ఆటోనగర్ గుండా జాతీయ రహదారి పైకి వాహన ర్యాలీ చేరుకుంది. చిన, పెద కాకాని మీదుగా నాగార్జున యునివర్సిటీ ఎదురుగా ఏర్పాటు చేసిన సభాస్థలి వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం సభలో పాల్గొన్న పెమ్మసాని చంద్రశేఖర్, తెనాలి శ్రావణ్ కుమార్ కలిసి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడికి పుష్ప గుచ్చం ఇచ్చి అభినందనలు తెలియజేశారు.
TDP Party Office Inauguration in Thullur
March 4, 2024    

TDP Party Office Inauguration in Thullur

Pemmasani attends TDP Party Office Opening Ceremony in Mangalgiri.
Meet with Janasena Co-ordinators
March 4, 2024    

Meet with Janasena Co-ordinators

*సమన్వయ సన్నాహం. * పార్లమెంట్ నియోజకవర్గ జనసేన సమన్వయకర్తలతో డా. పెమ్మసాని, మనోహర్ సమావేశం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా చేతులు కలిపిన చంద్రబాబు – పవన్ ఆదేశాలను గ్రామస్థాయికి తీసుకెళ్లబోతున్నామని టిడిపి నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల జనసేన పార్టీ సమన్వయకర్తలతో తెనాలిలో సమావేశం జరిగింది. నియోజకవర్గ టిడిపి – జనసేన కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన ఈ సమావేశంలో టిడిపి నాయకులు డాక్టర్ పెమ్మసాని పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల, గ్రామ స్థాయిలో ఉన్న టిడిపి – జనసేన కార్యకర్తలను, నాయకులను ఒక తాటిపైకి తీసుకురావడంపై మాట్లాడామన్నారు. ఇరు పార్టీల నాయకులతో త్వరలోనే ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తామని చెప్పారు. అనంతరం మనోహర్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని మెరుగైన ఎన్నికల వాతావరణం ఏర్పరచి ఇరు పార్టీలకు ఉపయోగపడేలా సంసిద్ధమవుతున్నామన్నారు. చంద్రబాబు, పవన్ ఆదేశాలకు తగ్గట్టు ఓటు ట్రాన్స్ ఫర్ జరిగేలా చేయడమే తమ ధ్యేయమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Tags: janasena, tdp
23 24 25 26 27 28 29 30 31 32