మీ సమస్యలకు గొంతుకలా ఉంటా. * ట్రేడ్ యూనియన్ నాయకులతో డా. పెమ్మసాని. ప్రజా సమస్యలకు గొంతుకలా పార్లమెంట్ వేదికగా ప్రశ్నిస్తాను. శ్రమ శక్తికి నిర్వచనమైన కార్మిక లోకాన్ని చులకనగా చూడకూడదని ఈ ప్రభుత్వానికి తెలిసి రావాలి. టీడీపీ జిల్లా కార్యాలయంలో టీ ఎన్ టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారా జోషి సభా అధ్యక్షతన ఆదివారం జరిగిన ట్రేడ్ యూనియన్ నాయకులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో డా. పెమ్మసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము ‘ప్రజా శంఖారావం’ ప్రచారంలో భాగంగా ప్రతీ గడపకు కూడా వెళ్తున్నామని, 30గజాల ఇళ్ళల్లో ఆరుగురు జీవిస్తుండటం చూసి చలించిపోయామన్నారు. ఈ సమస్యలపై ఇతర సంపన్నులు సైతం ఆలోచించాలి అని ఆయననే సందర్భంగా కోరారు. పేదరికం నిర్మూలనకు తన వంతు కృషి చేస్తానన్నారు. అలాగే కార్యక్రమంలో భాగంగా టీఎన్ టీయూసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు గుంటుపల్లి శేషగిరిరావు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన సమయం వచ్చిందన్నారు.అలాగే భవన నిర్మాణ కార్మికుల కోసం ఇసుక తదితర సమస్యలపై దృష్టి పెట్టాలని తెలిపారు. అనంతరం నేరెళ్ల సురేశ్ కుమార్ మాట్లాడుతూ పెమ్మసాని నామినేషన్ వేయకుండానే ఎన్నికల్లో గెలిచేశారని చెప్పారు. తండ్రి లేని బిడ్డ అనే కారణంతో ఒక్క అవకాశం ఇస్తే ప్రజల్ని ముంచేసారన్నారు. కార్యక్రమంలో టీఎన్ టీయూసీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి మదమంచి శ్రీనివాసరావు, జనసేన కార్మిక విభాగం నాయకుడు ఆళ్ల హరి తదితరులు పాల్గొన్నారు.