Events

Tone News Interview
March 19, 2024    

Tone News Interview

Tags: No Categories
Meet with Nara Lokesh in Mid Valley City.
March 18, 2024    

Meet with Nara Lokesh in Mid Valley City.

Pemmasani meets Nara Lokesh at Mid Valley City.They discussed on the solutions for the problems that are currently faced by the society in that particular locality.
Road show at Lalpuram
March 16, 2024    

Road show at Lalpuram

ప్రలోభాలు పవన్ ను టచ్ చేయలేవు. * గుంటూరు రూరల్ పర్యటనలో డా. పెమ్మసాని. ‘ పవన్ ను చాలామంది ప్రలోభ పెట్టాలని చూసారు. ఆ ప్రలోభాలన్నీ పవన్ కు వెంట్రుక తో సమానం.’ అని టీడీపీ నాయకులు డా. పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు రూరల్ ప్రాంతమైన ఏటుకూరు నుంచి ప్రారంభమైన ఎన్నికల పర్యటనలో పెమ్మసాని చంద్రశేఖర్, ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులు కలిసి శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ పదేళ్ల క్రితం ప్రారంభమైన జనసేనకు కార్యకర్తలు ఊపిరి అయి నిలబడ్డారన్నారు. రాష్ట్రం కష్టాల్లో ఉంటే అడ్డుకున్న మహోన్నత వ్యక్తి పవన్ అని తెలిపారు. ఆయన కుటుంబంలోనే కుల ప్రస్తావన లేని పవన్ పై ఈ వైసీపీ నాయకులు కులాల కుమ్ములాటలు రుద్దాలని చూడటం మూర్ఖత్వమేనని పెమ్మసాని తెలియజేశారు. అనంతరం రామాంజనేయులు మాట్లాడుతూ ఈ ప్రభుత్వ రాక్షస పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందని అన్నారు. పవన్ కళ్యాణ్ ను టచ్ చేయాలంటే ముందు ఆయన అభిమానులను టచ్ చేసే దైర్యం ఉండాలని తెలిపారు. పర్యటనలో ఆరో డివిజన్ కార్పొరేటర్ పోతురాజు సమత, గోరంట్ల కార్పొరేటర్ ఎర్రమట్టి పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
Dr Pemmasani's Public Programs
March 16, 2024    

Dr Pemmasani's Public Programs

Tags: No Categories
Guntur Dist TDP,Janasena &BJP Meeting
March 16, 2024    

Guntur Dist TDP,Janasena &BJP Meeting

 టిడిపి, బిజెపి, జనసేన మూడు పార్టీల ఉమ్మడి సమావేశం గుంటూరులోని స్థానిక మౌర్య ఫంక్షన్ హాల్ లో శనివారం జరిగింది.అనంతరం డాక్టర్ పెమ్మసాని మాట్లాడుతూ మూడు శక్తివంతమైన, సామర్థ్యం గల పార్టీలు ఏర్పరచిన సభ అంటే ఎంత శక్తిదాయకంగా ఉంటుందో ఈ సమావేశాన్ని చూస్తే అర్థమవుతోందని ఆయన తెలిపారు. అమరావతి వంటి ప్రతిష్టాత్మకమైన నగర నిర్మాణానికి బిజెపి సహకారం కూడా కావాలని ఆయన కోరారు. అనంతరం బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్ కోసం మూడు పార్టీలు కలిసి ఎన్నికలలో పోటీకి సిద్ధమయ్యాయని తెలిపారు.  ఈ కార్యక్రమంలో తెనాలి జనసేన టిడిపి కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్, గుంటూరు పశ్చిమ టిడిపి అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి, గుంటూరు తూర్పు నియోజకవర్గ టిడిపి అభ్యర్థి మహమ్మద్ నసీర్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ కోవెలమూడి రవీంద్రబాబు(నాని) తదితరులు పాల్గొన్నారు. పెమ్మసాని ఆధ్వర్యంలో చేరికలు టిడిపి నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పై వైసీపీ నాయకుల్లో నమ్మకం నానాటికి పెరుగుతుంది. ఆయన ఆధ్వర్యంలో టిడిపిలో చేరే వారి సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతుండడంతో క్రమంగా నియోజకవర్గాల వారీగా వైసిపి ఖాళీ అవుతుంది. తాడికొండ మండలం రావెల గ్రామానికి చెందిన మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కొమ్మినేని రామ చంద్రరావు ఆధ్వర్యంలో 600 కుటుంబాలు నేడు టిడిపిలో చేరాయి.
Dr Pemmasani's Public Programs
March 16, 2024    

Dr Pemmasani's Public Programs

Tags: No Categories
Interview with Jaffar
March 16, 2024    

Interview with Jaffar

Tags: No Categories
Mahila Cadre Meet with Super Six
March 15, 2024    

Mahila Cadre Meet with Super Six

 గుంటూరులోని బి.వి.ఆర్ కన్వెన్షన్ హాల్లో ప్రత్తిపాడు నియోజకవర్గ క్లస్టర్ – 2 మహిళా ఆత్మీయ సమావేశానికి పెమ్మసాని ముఖ్యఅతిథిగా శుక్రవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసిన జగన్ మధ్య నిషేధం చేస్తానని అక్కాచెల్లెళ్లకు హామీ ఇచ్చారని, కానీ నేడు కల్తీ మద్యాన్ని ప్రభుత్వం ద్వారా విక్రయింపజేస్తూ, మద్యం అమ్మకాల్లో 70% వాటాలను జగన్ జేబులో వేసుకుంటున్నారని పెమ్మసాని పేర్కొన్నారు.జగన్ ప్రభుత్వంలో పేదలకు మిగిలింది నిరాశేనని, యువతకు గంజాయిని అలవాటు చేశారని ఆయన వివరించారు. రాష్ట్ర ప్రజలకు సమసమాజ న్యాయం చేయగల సత్తా టిడిపికి మాత్రమే ఉందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కార్యక్రమంలో ప్రత్తిపాడు నియోజకవర్గం టిడిపి అభ్యర్థి బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ జగన్ ను ఇంటికి పంపడానికి ఇంకా 30 రోజులు మాత్రమే వ్యవధి ఉందని అన్నారు. రాబోయేది అక్షరాలా మహిళ ప్రభుత్వం అని, టిడిపి వల్లే మహిళలు ఆర్థిక అభివృద్ధి పొందగలరని ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. రాబోయే టీడీపీ ప్రభుత్వంలో మహిళలకు, ప్రజలకు ఆర్థిక సమానతలను అందించే విధంగా ‘సూపర్ సిక్స్’ హామీలతో టిడిపి ప్రజల ముందుకు వచ్చిందన్నారు.  కార్యక్రమంలో గుంటూరు వెస్ట్ టిడిపి ఇన్చార్జ్ కోవెలమూడి రవీంద్రబాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వందనాదేవి, 46వ డివిజన్ కార్పొరేటర్ నూకవరపు బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
Masjid Visit
March 15, 2024    

Masjid Visit

మసీదులో డా. పెమ్మసాని ప్రత్యేక పూజలు. * పెమ్మసాని చేతులమీదుగా అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఆవిష్కరణ. ‘ కొన్ని కోట్ల మందికి అబ్దుల్ కలాం ఆదర్శప్రాయులని టీడీపీ నాయకులు డా. పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. రంజాన్ మాసం పురస్కరించుకుని గుంటూరులోని స్థానిక పట్టాభిపురంలో గల అతీఖుర్ రెహమాన్ మసీదులో ముఫ్తీ ఇమామ్ మౌజాన్, ముస్లిం సోదరులతో కలిసి ఆయన శుక్రవారం రోజా విరమణ, నమాజ్, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం మసీదుకు ఎదురుగా ఏర్పాటుచేసిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహావిష్కరణను గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి, నియోజకవర్గ ఇన్చార్జి కోవెలమూడి నాని, తాడికొండ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ తో కలిసి చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలాం గారు ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టడంలో చంద్రబాబు గారి సహకారం కూడా ఉందని తెలిపారు.
Tags: No Categories
Dr Pemmasani's Public Programs
March 15, 2024    

Dr Pemmasani's Public Programs

Tags: No Categories