*పెమ్మసాని దెబ్బకు వైసిపి ఖాళీ. * మేడికొండూరులో ఒక్కరోజులోనే వైసీపీకి చెందిన వంద కుటుంబాల చేరిక. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు జగన్ అబద్దాలకు హద్దు ఉండదు. నోటికి వచ్చిన అబద్ధపు హామీలన్నీ ఇస్తారు.’ అని టిడిపి నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. టిడిపి నాయకులు డా. పెమ్మసాని చేపట్టిన నియోజకవర్గాల పర్యటనలకు విశేషమైన స్పందన లభిస్తోంది. పర్యటించిన ప్రతి ప్రాంతంలోనూ వైసీపీ కార్యకర్తలు టీడీపీ వైపు ఆకర్షితులవుతూ, పెమ్మసాని నేతృత్వంలో పార్టీలో చేరుతున్నారు. మేడికొండూరు మండలంలో సోమవారం పెమ్మసాని రోడ్ షోలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని అంకమ్మ చెట్టు వద్ద ఏర్పాటు చేసిన సభలో మండలానికి చెందిన 100 కుటుంబాలు పెమ్మసాని ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. చేరిన వారిలో వైసీపీ మద్దతుతో గెలిచిన వార్డు మెంబర్లు కూడా ఉండటం విశేషం. పెమ్మసాని, తెనాలి శ్రావణ్ కుమార్ ఆశావహులకు టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ తేదీ నాటికి వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమని తెలిపారు. జగన్ ఇంకా మారకుండా నోటికి వచ్చినట్లు అబద్ధాలు చెప్పడం వల్ల నిజాలు చెప్పే అసలైన నాయకుల హామీలకు కూడా విలువ లేకుండా పోయే ప్రమాదం ఉందన్నారు. సంక్షేమం కోసం పుట్టిన పార్టీ టీడీపీ అని, అలాంటి పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజాభివృద్ధి సాధ్యమని డా. పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. అనంతరం టీడీపీ స్ధానిక నియోజకవర్గ టిడిపి అభ్యర్థి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ఇరిగేషన్ మంత్రి అంబటి ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. తాగడానికి నీళ్లు లేక ప్రజలు బాధపడుతుంటే, కోటప్పకొండ తిరునాల్లకు నీళ్లు వదిలడమేనా పాలన అంటే అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ స్థాయి టీడీపీ నాయకులు పాల్గొన్నారు.