ప్రపంచం తలకిందులు చేసే శక్తి యువతది * విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో డాక్టర్ పెమ్మసాని. ‘భావితరాలను నిర్మించే ఆర్కిటెక్ట్ లు మీరు, గొంతెత్తి ప్రశ్నిస్తే, తలెత్తి నిలదీస్తే ప్రపంచం తలకిందులయ్యే శక్తి మీది.’ అని టిడిపి నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. మండలంలోని విశదల గ్రామంలో గల ఎన్నారై ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో విద్యార్థులతో పెమ్మసాని ముఖాముఖి కార్యక్రమంలో సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఉపాధ్యాయుడిగా అమెరికాలోని 50 – 60 మంది విద్యార్థులకు పాఠాలు చెప్పానన్నారు. ఆధర్మం, అన్యాయ మార్గంలో వేసే అడుగులు వ్యక్తిత్వం పై ప్రభావం చూపుతాయని, సమాజంలో డబ్బు ఒకటే కాదని, విలువలు కూడా కావాలని పెమ్మసాని ఈ సందర్భంగా వివరించారు. ఓటు విషయానికొస్తే అన్ని పార్టీల వ్యక్తుల్ని విద్యార్థులు ఒకసారి గమనించాలని, ఎవరైతే ప్రజలకు ఉపయోగపడతారో గుర్తించి ఓటెయ్యాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో తాడికొండ నియోజకవర్గ టిడిపి అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ తో పాటు ఎన్నారై విద్యాసంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తిలక్ పలువు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సవివరమైన సమాధానాలు చెప్పారు.