Events

Madam Meeting at Tenali
April 21, 2024    

Madam Meeting at Tenali

Tags: No Categories
Madam Door to Door Campain
April 21, 2024    

Madam Door to Door Campain

Tags: No Categories
Dr Pemmasani's Public Programs
April 21, 2024    

Dr Pemmasani's Public Programs

Tags: No Categories
Party Joinings Sangathi gunta,RamiReddy Nagar,HusanNagar
April 20, 2024    

Party Joinings Sangathi gunta,RamiReddy Nagar,HusanNagar

“ప్రజలకు అండగా టిడిపి సూపర్ సిక్స్. + పెమ్మసాని ఆధ్వర్యంలో టిడిపిలో చేరిన 15వ డివిజన్ వైసిపి నాయకులు. ‘టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ ద్వారా ప్రజలకు మేలు చేసే బాధ్యత మాది.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు అన్నారు. తూర్పు నియోజకవర్గంలోని 15వ డివిజన్లో సుమారు 200 మంది వైసీపీ నాయకులు శనివారం టిడిపిలో చేరారు. పెమ్మసాని, నసీర్ అహ్మద్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరగగా, టిడిపి ప్రజా సంక్షేమ కార్యక్రమాలనుంచి పార్టీలోకి వస్తున్నట్లు కార్యకర్తలు తెలిపారు. అనంతరం పెమ్మసాని మాట్లాడుతూ డివిజన్లో రోడ్లన్నీ అద్వానంగా ఉన్నాయని, తాగునీటి సమస్యతో ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని ఆయన గుర్తు చేశారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సూపర్ సిక్స్ ద్వారా ప్రజలకు మేలు చేయడమే గాక రోడ్లు తాగునీరు, డ్రైనేజీ తదితర సమస్యలను పరిష్కరించే బాధ్యత తాము తీసుకుంటామని ఆయన తెలిపారు. నియోజకవర్గ అసెంబ్లీ టిడిపి అభ్యర్థి నసీర్ అహ్మద్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా ముస్లిం మహిళలు ధైర్యంగా ఉండేవారని తెలిపారు. సంక్షేమ పథకాలతో పాటు శిక్షణా కేంద్రాలు తదితర కార్యక్రమాలతో చంద్రబాబు ఆదుకున్నారని గుర్తు చేశారు. జగన్ చెప్పిన మోసపు అబద్ధాలు నమ్మి ఓట్లేసిన ప్రజలను ఐదేళ్లుగా అష్ట కష్టాలు పెడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు నంబూరు సుభాని, గుంటూరు నగర టిడిపి అధ్యక్షుడు డేగల ప్రభాకర్, మాజీ డిప్యూటీ మేయర్ షేక్ గౌస్ తదితరులు పాల్గొన్నారు.
తూర్పు వైసీపీకి తుప్పు వదిలిస్తున్న టిడిపి + ఒకే రోజులో నాలుగు డివిజన్ల నాయకులు టిడిపిలో చేరిక. + పెమ్మసాని ఆధ్వర్యంలో టిడిపి కండువా కప్పుకున్న వైసీపీ నేతలు. గుంటూరు తూర్పు నియోజకవర్గం లో ఒకేరోజు వందల మంది కార్యకర్తలు వైసిపికి గుడ్ బై చెప్పారు. టిడిపి కండువా కప్పుకొని పెమ్మసానికి జై కొట్టారు. నియోజకవర్గంలోని 5, 12, 14, 15వ డివిజన్లలో 500 మందికి పైగా వైసిపి కార్యకర్తలు ఆ పార్టీని వీడి గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో శనివారం నాడు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. వివరాల్లోకి వెళితే ఇటీవల వైసిపిని వీడి మాజీ ఎమ్మెల్యే షేక్ సుభాని గారు, పలువురు కార్పొరేటర్లు కార్యకర్తలు నాయకులతో కలిసి టిడిపిలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శనివారం కూడా టిడిపిలోకి చేరికలు జరిగాయి. కాగా 12వ డివిజన్ నుంచి 50 మంది, 14వ డివిజన్ నుంచి 150 మంది, 15వ డివిజన్ నుంచి 200, ఐదో డివిజన్ నుంచి మరో వందమంది నాయకులకు టిడిపి కండువా కప్పిన డా. పెమ్మసాని, నియోజకవర్గ అసెంబ్లీ టిడిపి అభ్యర్థి నసీర్ అహ్మద్, టిడిపి నాయకులు భరత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పెమ్మసాని గారు మాట్లాడుతూ నియోజకవర్గంలో పదేళ్లుగా ఎమ్మెల్యే ఏం అభివృద్ధి చేశారని ఆయన ప్రశ్నించారు. స్థానికంగా కొందరు నాయకులే గంజాయి అమ్ముతున్నా ప్రశ్నించలేని దుస్థితిలో ప్రజలు ఊరకుండి పోతున్నారన్నారు. నియోజకవర్గంలోని డివిజన్లలో రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ సమస్యలతో ప్రజల అవస్థలు పడుతున్నా ఈ ఎమ్మెల్యేకి ఏమీ పట్టడం లేదని విమర్శించారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మౌలిక వసతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, అలాగే ఇళ్ల పట్టాలు లేని అర్హులకు పట్టాలు అందించడం లేదా టిట్కో నివాసాలు కల్పించడం వంటి పరిష్కారాలు చూపిస్తామని భరోసా ఇచ్చారు. 2019లో జగన్ ను నమ్మి పనిచేసిన కార్యకర్తలకు కనీస గౌరవం కూడా పార్టీలో దక్కడం లేదని చెప్పారు. మద్యానికి బానిసలైన కొందరు జగన్ ప్రభుత్వం అందిస్తున్న కల్తీ మద్యానికి బలి అవుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని విచారణ వ్యక్తం చేశారు. మహమ్మద్ నశీర్ అహ్మద్ ఇల్లు ఉండి నేటికీ పట్టాలు అందని అర్హులకు ఇళ్ల పట్టాలు అందించేలా హామీ ఇస్తున్నానని భరోసా ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఓడిపోతుందనే భయంతోనే ఎన్డీఏ కూటమి వల్ల ముస్లింలకు ఇబ్బంది కలుగుతుందనే అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు. పోటీ చేసే దమ్ము లేకనే వైసీపీ నాయకులు ముస్లింలలో ఒక భయం సృష్టిస్తున్నారని ఆయన వివరించారు. ఈ చేరికల కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే షేక్ (నంబూరు) సుభాని, భరత్ రెడ్డి టిడిపి నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్, సిహెచ్ చిట్టిబాబు తదితర టిడిపి, జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు.”
Tags: No Categories
Dr Pemmasani's Public Programs
April 20, 2024    

Dr Pemmasani's Public Programs

Tags: No Categories
kakumanu Road Show
April 19, 2024    

kakumanu Road Show

సామాన్యుడికి ఉపాధి ఎక్కడ? పోలవరం నిర్వీర్యం జగన్ పుణ్యమే. + కాకుమాను మండల పర్యటనలో పెమ్మసాని. పర్యటన వివరాలు.కాకుమాను మండల పర్యటనలో భాగంగా గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎన్నికల ప్రచారం శుక్రవారం నిర్వహించారు. రేటూరు, అప్పాపురం, పెదనందిపాడు, కాకుమాను గ్రామాల్లో పర్యటించిన పెమ్మసానికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా ప్రచార రథం వెంటనే నడుస్తూ జేజేలు పలికారు. దారి పొడవునా పూల వర్షం కురిపిస్తూ హారతులు పట్టారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టిడిపి అభ్యర్థి బూర్ల రామాంజనేయులు, జిల్లా జనసేన అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు, తదితర టిడిపి, బిజెపి, జనసేన నాయకులు పాల్గొన్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు.
సంక్షేమ పథకాలు జగన్ కొత్తగా ఇవ్వడం లేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో అంతకుమించిన పథకాలు అందజేశారు. మంచినీరు, రోడ్లు ఇస్తే ఓట్లు రావని, ఆ డబ్బుతో ఓట్లు కొనుక్కోవాలని జగన్ ప్రయత్నిస్తున్నారు. ఒక వ్యక్తికి ఉద్యోగం అందిస్తే, నెలకి రూ. 30,000 సంపాదించుకోగలిగిన అవకాశం కల్పిస్తే సంక్షేమ పథకాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఫిల్టర్ బెడ్స్ శుభ్రం చేయాలి, చెరువులకు నీరు అందించాలి, నిర్వహణ చేపట్టాలి, ఇవన్నీ సరైన క్రమంలో జరిగితేనే ప్రజలకు సరైన సమయంలో తాగు, సాగునీరు అందుతుంది. ప్రజలకు ఆపద వచ్చిందని తెలిస్తే చంద్రబాబు వెంటనే వచ్చి పరిష్కారం చూపిస్తారు. అదే ప్రజలు సమస్యలతో తల్లడిపోతున్నా సరే జగన్ కనీసం కన్నెత్తి చూడరు. ఇదే ఆ ఇద్దరు నాయకులకు ఉన్న తేడా. కల్తీ మద్యాన్ని గంజాయిని ఎవరు అరికట్టగలరు ప్రజలే నిర్ణయించుకోవాలి. రాష్ట్రం నిండా అప్పుల మయమైపోయింది. ఇల్ల స్థలాలపై క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. రాష్ట్ర ఆదాయం కూలిపోయింది. కొన్ని రోజులు గడిస్తే జగన్ కు కనీసం అప్పు పుట్టే పరిస్థితి కూడా లేదు.
పోలవరం పై చేతులు ఎత్తేసిన జగన్.
రివర్ టెండరింగ్ పేరుతో పోలవరంలో పనులు ఆగిపోయేదాకా జగన్ కు నిద్ర పట్టలేదు. చంద్రబాబు గారు సోమవారం పోలవరంగా సమయానికి కేటాయించుకుని మరీ 72% పనులు పూర్తి చేయించారు. ఇలా నాలుగింట మూడు వంతుల వంతు ప్రాజెక్టు పూర్తయిన పోలవరం పై కాంట్రాక్టర్లు మార్చడం, బిల్లులు ఆపేయడం వంటి పనుల వల్ల పోలవరం అర్ధాంతరంగా నిలిచిపోయింది. మరో నెలలో మా ప్రభుత్వం వస్తుంది. మేము కూడా ఇలా చేయలేమా! రాజకీయం చేయడం మాకు చేతకాదా బ్రదర్! ఆ చిన్నపాటి కానీ మేము మా టిడిపి నీతికి నిజాయితీకి కట్టుబడి ఉన్నాం. సమాజంలో ప్రజలను సమతుల్యంగా ముందుకు నడిపించడం మాత్రమే చంద్రబాబుకు తెలుసు. ఆయన నాయకత్వంలో ఢిల్లీలోని ప్రతి గల్లీ తిరిగైనా సరే నిధులు సమీకరించి అభివృద్ధి చేయగల సమర్థత సామర్థ్యం నాకు ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో నిధులు సమీకరించి డ్రైనేజీ రోడ్లు మంచినీటి పథకాలకు సంబంధించిన అన్ని సదుపాయాలు అందేలా చూస్తాం. కాకుమాను గ్రామంలో స్థానికుల కోరిక మేరకు అడిగిన ఆర్వో ప్లాంట్ పై అంశంపై మాట్లాడుతూ ఎన్నికల వెంటనే ఆరో ప్లాంట్ ఏర్పాటు చేస్తానని భరోసా ఇచ్చారు. ఈ పరిస్థితులన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించి ప్రజలందరూ ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
స్మశానానికి కూడా రోడ్డు వేయలేని ప్రభుత్వం – బూర్ల రామాంజనేయులు. దళితుల ఏరియాలో స్మశానానికి రహదారి కోరడం కనీస అవసరం కూడా తీర్చలేని ఈ ప్రభుత్వం శుద్ధ దండగ తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్మశానానికి వెళ్లే రోడ్డు నిర్మాణం చేపడతాం.వైసిపి ఎమ్మెల్యే కనిపించడం లేదు – జనసేన నాయకులు గాదె వెంకటేశ్వరరావు. ఈ నియోజకవర్గంలో బుగ్గల తిరిగిన జగన్ ను నమ్మి ఇక్కడ ఒక ఎమ్మెల్యే అను గెలిపించారు. ప్రజల పుణ్యమా అని ఆమె మంత్రిగా కూడా పనిచేశారు. కానీ ప్రజా ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలే ముఖ్యమని నిర్ణయించుకున్న ఆ మహిళా ఎమ్మెల్యే ఆరు నెలలుగా ప్రజల్ని వదిలేసి వెళ్లిపోయారు. ఆరు నెలలుగా కనిపించడం లేదు. మాటలు మొహం కడుక్కోవడానికి కూడా నీళ్లు లేక రూ. 200 రూపాయలతో ప్రజలు నీళ్ళు కొనుక్కుంటుంటే ఈ ఎమ్మెల్యే ఎటు వెళ్లిపోయారు? కూటమి తరఫున పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు, బూర్ల రామాంజనేయులు ఇద్దరు ప్రజా నాయకులుగా ముందుకు వచ్చారు.
Tags: No Categories
Dr Pemmasani's Public Programs
April 19, 2024    

Dr Pemmasani's Public Programs

Tags: No Categories
Madam Door to Door Campain
April 19, 2024    

Madam Door to Door Campain

Tags: No Categories
Kollipara Road Show
April 18, 2024    

Kollipara Road Show

కొల్లిపరను మింగేస్తున్న ఇసుక మాఫియా వ్యవసాయాన్ని, నీటిపారుదలను పట్టించుకోనిప్రభుత్వం. + కొల్లిపర మండల పర్యటనలో పెమ్మసాని ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కొల్లిపర మండల కేంద్రంలో గురువారం పర్యటించారు. ఈ పర్యటనలో మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, నియోజకవర్గ అసెంబ్లీ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా కొల్లిపర శివారు ప్రాంతం నుంచి ప్రారంభమైన ప్రచార యాత్ర అంగరంగ వైభవంగా ముందుకు సాగింది. వీధి వీధినా కొనసాగిన ప్రచార రథానికి స్థానికులు అడుగడుగునా పూల వర్షం కురిపించారు. మహిళలు హారతులు పట్టి నాయకులకు స్వాగతం పలుకగా, అభిమానులు, కార్యకర్తలు పలు కూడళ్ల వద్ద గజమాలలు వేసి ఆహ్వానించారు. పెమ్మసాన్ని చంద్రశేఖర్ గారు పట్టిసీమను నిర్వహించే సామర్థ్యం కూడా ఈ ప్రభుత్వానికి లేదు. కేంద్ర ప్రభుత్వం సహాయం అందించే డ్రిప్ ఇరిగేషన్ ఈ ప్రాంతంలోను అందుబాటులో ఉంది. అయితే డ్రిప్ ఇరిగేషన్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ వాటాను ఈ ప్రభుత్వం అందించలేకపోవడంతో ఆ పథకం కూడా మూలన పడింది. ఇసుక మాఫియా జరుగుతుందని ఫిర్యాదులు చేస్తే అలాంటివి ఏమీ జరగడంలేదని మాయమాటలు చెప్పి ఈ నాయకులు తప్పించుకున్నారు. ఇసుక మాఫియా తవ్విన గోతుల వల్ల కొల్లిపర పరిసర ప్రాంతాల్లోని 38 మంది గడిచిన ఐదేళ్లలో ప్రాణాలు వదిలారు. అటు ప్రకృతి పరంగా ఇటు ప్రాణాల పరంగా భారీ నష్టం జరుగుతున్నా ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు. మన ప్రాంతంలో ఇసుక, మైనింగ్, గ్రావెల్ అన్నీ పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. ఈ అవినీతి సొమ్మంతా నాయకులే తింటున్నారా? లేదా పెద్ద తలలకు అందిస్తున్నారా? ప్రజా ధనాన్ని కొందరు అధికారులు, నాయకులు ఇలా దోచుకుంటూ ఉంటే ప్రశ్నించడానికి ఓ పవన్ కళ్యాణ్, ఒక పెమ్మసాని రాకూడదా? అని ప్రశ్నిస్తున్నాను. రాజధాని కోసం 33 వేల ఎకరాలను అందించగా, అందులో 20వేల ఎకరాలను ఒక ఎకరం మాత్రమే ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు అందించారు. కానీ ఆ భూములన్నీ కేవలం ఒక సామాజిక వర్గమానికి మాత్రమే చెందినవంటూ ఈ ప్రభుత్వం నెపం మోపింది. ఒక వ్యక్తి పై కక్షతో వేలాది, లక్షలాదిమంది ప్రజలకు చెందాల్సిన భూములను, ఆస్తులను, భవనాలను నిర్వీర్యం చేసింది. రాష్ట్రానికి రాజధాని అమరావతికి ఇంత ద్రోహం చేసిన నాయకులను ఇంకా నమ్మాలా! వద్దా! అని ప్రజలే నిర్ణయించుకోవాలి. నాదెండ్ల మనోహర్: రోడ్లు, సంక్షేమ పథకాలు, రైతులకు కావలసిన అవసరాలు తీర్చడంలో పూర్తి సహకారం అందిస్తాం. రాష్ట్ర పాలన చేతకాక జగన్ అడ్డదారుల్లో ముందుకు సాగారు. ప్రశ్నించిన టిడిపి, జనసేన, బిజెపి నాయకులను వేధించారు. అరెస్టులు చేసి హింసాత్మక ఘటనలకు తెర తీశారు. ఇన్నాళ్లు కార్యకర్తలంతా పోరాటం చేశారు, ఇంకొక్క నెల గట్టిగా ప్రయత్నిస్తే ఈ రాక్షస పాలనకు చరమ గీతం పాడేయవచ్చు.
ఆలపాటి రాజేంద్రప్రసాద్:ఇల్లు పేరు చెప్పి, పథకాల పేరు చెప్పి ప్రజలను మోసగించి దోచుకున్న ఈ జగన్ ప్రభుత్వాన్ని మీ ఓటు హక్కుతో తరిమికొట్టండి. టిడిపి, జనసేన, బిజెపి కూటమి బలపరిచిన గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమసాని చంద్రశేఖర్, అసెంబ్లీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్లకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి విజయం చేకూర్చాలని కోరుతున్నాను.
Tags: No Categories
Tenali Autonagar Association Meeting
April 18, 2024    

Tenali Autonagar Association Meeting

ఆటోనగర్ అభివృద్ధికి సహకారం. తెనాలి ఆటోనగర్ అసోసియేషన్ సమావేశంలో పెమ్మసాని. ఆటోనగర్ లో వ్యాపారులు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. అవినీతిని తగ్గించే ప్రయత్నం చేస్తాం.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు మాట్లాడారు. తెనాలిలోని స్థానిక ఆటోనగర్ అసోసియేషన్ హాల్లో గురువారం జరిగిన సమావేశానికి నాదెండ్ల మనోహర్ తో కలిసి పెమ్మసాని ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని గారు మాట్లాడుతూ అమెరికా నుంచి ఆంధ్రాకు అయిన త్వరగా రావచ్చేమో గాని, విజయవాడ నుంచి తెనాలికి మాత్రం రాలేమన్నారు. గోతులతో నిండిన ఈ రోడ్లపై ప్రయాణించాలంటే ప్రాణాంతకంగా ఉందని ప్రభుత్వ తీరును ఆయన విమర్శించారు. రోడ్లు, నీళ్లు వంటి కనీస సౌకర్యాలకు బదులు ఓట్లు కొనుక్కోవాలనే దుష్ట ఆలోచనలో ఈ జగన్ ప్రభుత్వం ఉందన్నారు. లారీ డ్రైవర్ల నుంచి పన్నుల రూపేణా గతం కంటే 200% ఎక్కువగా ఈ ప్రభుత్వం సామాన్యుల నుంచి వసూలు చేస్తుందని తెలిపారు. టీడీపీ అధికారంలోకి రాగానే మైక్రో రుణాలు, అసోసియేషన్ సమస్యల పరిష్కారాలకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. అలాగే తెనాలి నియోజకవర్గ అసెంబ్లీ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఈ ఆటోనగర్ ద్వారా 4 వేల మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పారు. ఆటోనగర్లో కష్టపడే వారికి సహకరిస్తున్న సభ్యులకు అభినందనలు తెలిపారు. తాను ప్రజా ప్రతినిధిగా ఉన్న సమయంలో సోలార్ ప్లాంట్, పెదరావూరు – నందివెలుగు నాలుగు లైన్ల రహదారి తదితర ప్రతిపాదనలు, కేటాయింపులు చేశానని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లోనూ ఉన్నతమైన ఆలోచనలతో తాను, పెమ్మసాని గారు కలిసి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని, తమ ఇరువురికి ఓట్లు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులను నాదెండ్ల కోరారు. ఈ కార్యక్రమాన్ని కార్యక్రమంలో అసోసియేషన్ చైర్మన్ చుక్క పల్లి శివ నాగేశ్వరరావు, జనసేన నాయకులు తోటకూర వెంకటరమణ, తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Tags: No Categories
6 7 8 9 10 11 12 13 14 15 16 17