ఆటోనగర్ అభివృద్ధికి సహకారం. తెనాలి ఆటోనగర్ అసోసియేషన్ సమావేశంలో పెమ్మసాని. ఆటోనగర్ లో వ్యాపారులు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. అవినీతిని తగ్గించే ప్రయత్నం చేస్తాం.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు మాట్లాడారు. తెనాలిలోని స్థానిక ఆటోనగర్ అసోసియేషన్ హాల్లో గురువారం జరిగిన సమావేశానికి నాదెండ్ల మనోహర్ తో కలిసి పెమ్మసాని ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని గారు మాట్లాడుతూ అమెరికా నుంచి ఆంధ్రాకు అయిన త్వరగా రావచ్చేమో గాని, విజయవాడ నుంచి తెనాలికి మాత్రం రాలేమన్నారు. గోతులతో నిండిన ఈ రోడ్లపై ప్రయాణించాలంటే ప్రాణాంతకంగా ఉందని ప్రభుత్వ తీరును ఆయన విమర్శించారు. రోడ్లు, నీళ్లు వంటి కనీస సౌకర్యాలకు బదులు ఓట్లు కొనుక్కోవాలనే దుష్ట ఆలోచనలో ఈ జగన్ ప్రభుత్వం ఉందన్నారు. లారీ డ్రైవర్ల నుంచి పన్నుల రూపేణా గతం కంటే 200% ఎక్కువగా ఈ ప్రభుత్వం సామాన్యుల నుంచి వసూలు చేస్తుందని తెలిపారు. టీడీపీ అధికారంలోకి రాగానే మైక్రో రుణాలు, అసోసియేషన్ సమస్యల పరిష్కారాలకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. అలాగే తెనాలి నియోజకవర్గ అసెంబ్లీ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఈ ఆటోనగర్ ద్వారా 4 వేల మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పారు. ఆటోనగర్లో కష్టపడే వారికి సహకరిస్తున్న సభ్యులకు అభినందనలు తెలిపారు. తాను ప్రజా ప్రతినిధిగా ఉన్న సమయంలో సోలార్ ప్లాంట్, పెదరావూరు – నందివెలుగు నాలుగు లైన్ల రహదారి తదితర ప్రతిపాదనలు, కేటాయింపులు చేశానని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లోనూ ఉన్నతమైన ఆలోచనలతో తాను, పెమ్మసాని గారు కలిసి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని, తమ ఇరువురికి ఓట్లు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులను నాదెండ్ల కోరారు. ఈ కార్యక్రమాన్ని కార్యక్రమంలో అసోసియేషన్ చైర్మన్ చుక్క పల్లి శివ నాగేశ్వరరావు, జనసేన నాయకులు తోటకూర వెంకటరమణ, తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Tags: No Categories