కొల్లిపరను మింగేస్తున్న ఇసుక మాఫియా వ్యవసాయాన్ని, నీటిపారుదలను పట్టించుకోనిప్రభుత్వం. + కొల్లిపర మండల పర్యటనలో పెమ్మసాని ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కొల్లిపర మండల కేంద్రంలో గురువారం పర్యటించారు. ఈ పర్యటనలో మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, నియోజకవర్గ అసెంబ్లీ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా కొల్లిపర శివారు ప్రాంతం నుంచి ప్రారంభమైన ప్రచార యాత్ర అంగరంగ వైభవంగా ముందుకు సాగింది. వీధి వీధినా కొనసాగిన ప్రచార రథానికి స్థానికులు అడుగడుగునా పూల వర్షం కురిపించారు. మహిళలు హారతులు పట్టి నాయకులకు స్వాగతం పలుకగా, అభిమానులు, కార్యకర్తలు పలు కూడళ్ల వద్ద గజమాలలు వేసి ఆహ్వానించారు. పెమ్మసాన్ని చంద్రశేఖర్ గారు పట్టిసీమను నిర్వహించే సామర్థ్యం కూడా ఈ ప్రభుత్వానికి లేదు. కేంద్ర ప్రభుత్వం సహాయం అందించే డ్రిప్ ఇరిగేషన్ ఈ ప్రాంతంలోను అందుబాటులో ఉంది. అయితే డ్రిప్ ఇరిగేషన్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ వాటాను ఈ ప్రభుత్వం అందించలేకపోవడంతో ఆ పథకం కూడా మూలన పడింది. ఇసుక మాఫియా జరుగుతుందని ఫిర్యాదులు చేస్తే అలాంటివి ఏమీ జరగడంలేదని మాయమాటలు చెప్పి ఈ నాయకులు తప్పించుకున్నారు. ఇసుక మాఫియా తవ్విన గోతుల వల్ల కొల్లిపర పరిసర ప్రాంతాల్లోని 38 మంది గడిచిన ఐదేళ్లలో ప్రాణాలు వదిలారు. అటు ప్రకృతి పరంగా ఇటు ప్రాణాల పరంగా భారీ నష్టం జరుగుతున్నా ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు. మన ప్రాంతంలో ఇసుక, మైనింగ్, గ్రావెల్ అన్నీ పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. ఈ అవినీతి సొమ్మంతా నాయకులే తింటున్నారా? లేదా పెద్ద తలలకు అందిస్తున్నారా? ప్రజా ధనాన్ని కొందరు అధికారులు, నాయకులు ఇలా దోచుకుంటూ ఉంటే ప్రశ్నించడానికి ఓ పవన్ కళ్యాణ్, ఒక పెమ్మసాని రాకూడదా? అని ప్రశ్నిస్తున్నాను. రాజధాని కోసం 33 వేల ఎకరాలను అందించగా, అందులో 20వేల ఎకరాలను ఒక ఎకరం మాత్రమే ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు అందించారు. కానీ ఆ భూములన్నీ కేవలం ఒక సామాజిక వర్గమానికి మాత్రమే చెందినవంటూ ఈ ప్రభుత్వం నెపం మోపింది. ఒక వ్యక్తి పై కక్షతో వేలాది, లక్షలాదిమంది ప్రజలకు చెందాల్సిన భూములను, ఆస్తులను, భవనాలను నిర్వీర్యం చేసింది. రాష్ట్రానికి రాజధాని అమరావతికి ఇంత ద్రోహం చేసిన నాయకులను ఇంకా నమ్మాలా! వద్దా! అని ప్రజలే నిర్ణయించుకోవాలి. నాదెండ్ల మనోహర్: రోడ్లు, సంక్షేమ పథకాలు, రైతులకు కావలసిన అవసరాలు తీర్చడంలో పూర్తి సహకారం అందిస్తాం. రాష్ట్ర పాలన చేతకాక జగన్ అడ్డదారుల్లో ముందుకు సాగారు. ప్రశ్నించిన టిడిపి, జనసేన, బిజెపి నాయకులను వేధించారు. అరెస్టులు చేసి హింసాత్మక ఘటనలకు తెర తీశారు. ఇన్నాళ్లు కార్యకర్తలంతా పోరాటం చేశారు, ఇంకొక్క నెల గట్టిగా ప్రయత్నిస్తే ఈ రాక్షస పాలనకు చరమ గీతం పాడేయవచ్చు.
ఆలపాటి రాజేంద్రప్రసాద్:ఇల్లు పేరు చెప్పి, పథకాల పేరు చెప్పి ప్రజలను మోసగించి దోచుకున్న ఈ జగన్ ప్రభుత్వాన్ని మీ ఓటు హక్కుతో తరిమికొట్టండి. టిడిపి, జనసేన, బిజెపి కూటమి బలపరిచిన గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమసాని చంద్రశేఖర్, అసెంబ్లీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్లకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి విజయం చేకూర్చాలని కోరుతున్నాను.
Tags: No Categories