“ప్రజలకు అండగా టిడిపి సూపర్ సిక్స్. + పెమ్మసాని ఆధ్వర్యంలో టిడిపిలో చేరిన 15వ డివిజన్ వైసిపి నాయకులు. ‘టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ ద్వారా ప్రజలకు మేలు చేసే బాధ్యత మాది.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు అన్నారు. తూర్పు నియోజకవర్గంలోని 15వ డివిజన్లో సుమారు 200 మంది వైసీపీ నాయకులు శనివారం టిడిపిలో చేరారు. పెమ్మసాని, నసీర్ అహ్మద్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరగగా, టిడిపి ప్రజా సంక్షేమ కార్యక్రమాలనుంచి పార్టీలోకి వస్తున్నట్లు కార్యకర్తలు తెలిపారు. అనంతరం పెమ్మసాని మాట్లాడుతూ డివిజన్లో రోడ్లన్నీ అద్వానంగా ఉన్నాయని, తాగునీటి సమస్యతో ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని ఆయన గుర్తు చేశారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సూపర్ సిక్స్ ద్వారా ప్రజలకు మేలు చేయడమే గాక రోడ్లు తాగునీరు, డ్రైనేజీ తదితర సమస్యలను పరిష్కరించే బాధ్యత తాము తీసుకుంటామని ఆయన తెలిపారు. నియోజకవర్గ అసెంబ్లీ టిడిపి అభ్యర్థి నసీర్ అహ్మద్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా ముస్లిం మహిళలు ధైర్యంగా ఉండేవారని తెలిపారు. సంక్షేమ పథకాలతో పాటు శిక్షణా కేంద్రాలు తదితర కార్యక్రమాలతో చంద్రబాబు ఆదుకున్నారని గుర్తు చేశారు. జగన్ చెప్పిన మోసపు అబద్ధాలు నమ్మి ఓట్లేసిన ప్రజలను ఐదేళ్లుగా అష్ట కష్టాలు పెడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు నంబూరు సుభాని, గుంటూరు నగర టిడిపి అధ్యక్షుడు డేగల ప్రభాకర్, మాజీ డిప్యూటీ మేయర్ షేక్ గౌస్ తదితరులు పాల్గొన్నారు.
తూర్పు వైసీపీకి తుప్పు వదిలిస్తున్న టిడిపి + ఒకే రోజులో నాలుగు డివిజన్ల నాయకులు టిడిపిలో చేరిక. + పెమ్మసాని ఆధ్వర్యంలో టిడిపి కండువా కప్పుకున్న వైసీపీ నేతలు. గుంటూరు తూర్పు నియోజకవర్గం లో ఒకేరోజు వందల మంది కార్యకర్తలు వైసిపికి గుడ్ బై చెప్పారు. టిడిపి కండువా కప్పుకొని పెమ్మసానికి జై కొట్టారు. నియోజకవర్గంలోని 5, 12, 14, 15వ డివిజన్లలో 500 మందికి పైగా వైసిపి కార్యకర్తలు ఆ పార్టీని వీడి గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో శనివారం నాడు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. వివరాల్లోకి వెళితే ఇటీవల వైసిపిని వీడి మాజీ ఎమ్మెల్యే షేక్ సుభాని గారు, పలువురు కార్పొరేటర్లు కార్యకర్తలు నాయకులతో కలిసి టిడిపిలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శనివారం కూడా టిడిపిలోకి చేరికలు జరిగాయి. కాగా 12వ డివిజన్ నుంచి 50 మంది, 14వ డివిజన్ నుంచి 150 మంది, 15వ డివిజన్ నుంచి 200, ఐదో డివిజన్ నుంచి మరో వందమంది నాయకులకు టిడిపి కండువా కప్పిన డా. పెమ్మసాని, నియోజకవర్గ అసెంబ్లీ టిడిపి అభ్యర్థి నసీర్ అహ్మద్, టిడిపి నాయకులు భరత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పెమ్మసాని గారు మాట్లాడుతూ నియోజకవర్గంలో పదేళ్లుగా ఎమ్మెల్యే ఏం అభివృద్ధి చేశారని ఆయన ప్రశ్నించారు. స్థానికంగా కొందరు నాయకులే గంజాయి అమ్ముతున్నా ప్రశ్నించలేని దుస్థితిలో ప్రజలు ఊరకుండి పోతున్నారన్నారు. నియోజకవర్గంలోని డివిజన్లలో రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ సమస్యలతో ప్రజల అవస్థలు పడుతున్నా ఈ ఎమ్మెల్యేకి ఏమీ పట్టడం లేదని విమర్శించారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మౌలిక వసతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, అలాగే ఇళ్ల పట్టాలు లేని అర్హులకు పట్టాలు అందించడం లేదా టిట్కో నివాసాలు కల్పించడం వంటి పరిష్కారాలు చూపిస్తామని భరోసా ఇచ్చారు. 2019లో జగన్ ను నమ్మి పనిచేసిన కార్యకర్తలకు కనీస గౌరవం కూడా పార్టీలో దక్కడం లేదని చెప్పారు. మద్యానికి బానిసలైన కొందరు జగన్ ప్రభుత్వం అందిస్తున్న కల్తీ మద్యానికి బలి అవుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని విచారణ వ్యక్తం చేశారు. మహమ్మద్ నశీర్ అహ్మద్ ఇల్లు ఉండి నేటికీ పట్టాలు అందని అర్హులకు ఇళ్ల పట్టాలు అందించేలా హామీ ఇస్తున్నానని భరోసా ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఓడిపోతుందనే భయంతోనే ఎన్డీఏ కూటమి వల్ల ముస్లింలకు ఇబ్బంది కలుగుతుందనే అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు. పోటీ చేసే దమ్ము లేకనే వైసీపీ నాయకులు ముస్లింలలో ఒక భయం సృష్టిస్తున్నారని ఆయన వివరించారు. ఈ చేరికల కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే షేక్ (నంబూరు) సుభాని, భరత్ రెడ్డి టిడిపి నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్, సిహెచ్ చిట్టిబాబు తదితర టిడిపి, జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు.”
Tags: No Categories