కాపు సోదరులారా ఆలోచించండి. + ముట్లూరు పర్యటనలో డాక్టర్ పెమ్మసాని. ‘రాష్ట్ర ప్రజలను కన్నబిడ్డలా చూడటం, విద్యా, ఆర్థిక పరంగా వృద్ధిలోకి తీసుకురావటం అనే అంశాలను మాత్రమే చూస్తూ ఒక తండ్రిలా చంద్రబాబు నాయుడు పరిపాలన చేశారు. కానీ కాపు సోదరులంతా పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఉన్నారనే కోపంతో జగన్ కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు మాట్లాడారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని వట్టిచెరుకూరు మండలంలో గల ముట్లూరు గ్రామంలో డాక్టర్ పెమ్మసాని రోడ్ షో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలను కలుసుకుంటూ, స్థానిక సమస్యలతో పాటు వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రోడ్ షో ముగింపు ప్రసంగంలో పెమ్మసాని మాట్లాడుతూ… ఒక్కసారి ఆలోచించండి. కాపు సోదరులంతా జనసేన వైపు ఉన్నారు కాబట్టి వాళ్లకు ఏ మంచి చేయకూడదు అని జగన్ నిర్ణయించుకున్నారు. ప్రజలను ఒక పార్టీకి, ఒక సామాజిక వర్గానికి కట్టేయగల ఏకైక నాయకుడు ఈ జగన్. కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ఏ సామాజిక వర్గాన్ని ఒక ఘాటిన కట్టేయలేదు. చంద్రబాబు కూడా జగన్ లాగా ఓట్ల రాజకీయం చేయాలనుకుంటే టిడిపి హయాంలో ఇన్ని కార్పొరేషన్లు, ఉద్యోగ అవకాశాలు, విదేశీ విద్యలకు లక్షలాది రూపాయల రుణాలు అందించేవారు కారు. కష్ట సమయంలో టిడిపికి అండగా ఉండి పొత్తులకు సహకరించిన పవన్ కళ్యాణ్ కు, ఆ పార్టీ కార్యకర్తలకు అండగా టిడిపి, తాను ఉంటామని పెమ్మసాని హామీ ఇచ్చారు. అసమర్ధ నాయకుడుగా జగన్. వైయస్సార్ కొడుకు, ఓదార్పు యాత్ర చేశారనే కారాణాలతో జగన్ కు 151 సీట్లతో ప్రజలు అవకాశం ఇచ్చారు. కానీ ప్రజలు అందించిన బాధ్యతను జగన్ ఐదేళ్లలో ఏమాత్రం నెరవేర్చలేదు. టిడిపి జగన్ పాలనను ఒకసారి గుర్తు చేసుకోండి. రైతులకు ఆదాయం ఎలా పెంచాలి? ఖర్చులు ఎలా తగ్గించాలి? అనే కోణంలో చంద్రబాబు పాలన సాగితే, రైతుల వెన్ను విరిచేలాగా జగన్ పాలన చేశారు. రైతులకు కష్టమొచ్చినా, ప్రకృతి విపత్తులు వచ్చినా చంద్రబాబు కొద్ది గంటల్లోనే ఆ ప్రాంతంలో వాలిపోయేవారు. సమస్యలు పరిష్కారం అయ్యేదాకా అక్కడి నుంచి కదిలేవారు కారు. కానీ జగన్ ప్రభుత్వంలో రైతు సంక్షేమం కోసం ఒక కొత్త పథకం ప్రవేశపెట్టింది కానీ, నీటిపారుదల పరంగా తీసుకున్న ఉపయోగకర నిర్ణయాలు గాని ఏమీ లేవు. జలజీవన్ మెషిన్ కింద 48 శాతం రాష్ట్ర ప్రభుత్వం వాటా అందించి ఉంటే 52 శాతం కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చి ఉండేది. తద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి నీటి కుళాయిలు పంట పొలాలకు సాగునీరు అందేది. వైసీపీ ప్రభుత్వం ఎలాంటి తలకు మాసిన నిర్ణయాలు తీసుకుందని రాష్ట్ర అమాయక ప్రజలకు తెలియదు. అవినీతి సొమ్ము మన పూర్వీకులు 50- 100 ఏల్ల క్రితమే గ్రామాల్లో చెరువులు తవ్వి నీటి కొరత రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే, జగన్ ప్రభుత్వం గ్రానైట్లు, అక్రమ ఇసుక, మైనింగ్, బాక్సైట్లతో అక్రమ తవ్వకాలకు తెర తీశారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో లక్షలాది సిద్ధం పోస్టర్లు వేశారు. ఆ పోస్టర్ల ఖర్చుకు పెట్టిన సొమ్ము ఎక్కడ నుంచి వచ్చింది? ఈ అక్రమ తవ్వకాలు, గంజాయి వంటి మత్తుమందుల విక్రయాల నుంచి సంపాదించిన అక్రమ అవినీతి సొమ్ము కాదా? ఇవాళ వాలంటీర్లను అడ్డుపెట్టుకొని ఎలక్షన్ డ్రామాలు జగన్ మొదలుపెట్టారు. పండుటాకులు వంటి వృద్ధులను మండుటెండల్లో తిప్పుతూ వాలంటీర్లు ఉంటేనే పింఛన్లు ఇస్తామంటూ వేధిస్తున్నారు. కరోనా సమయంలో వైన్ షాపులు ముందు టీచర్లని పెట్టి మద్యం విక్రయింపచేసిన జగన్ కు ఈరోజు పింఛన్లు ఇవ్వడానికి ఆ టీచర్లను ఉపయోగించాలన్న ఆలోచన రావట్లేదా? సొంతప్రాంతాల్లో ఉపాధి. గతంలో మంచి మంచి ఉద్యోగాలు, వ్యాపారాలు చేయాలంటే ఇతర దేశాలకు వెళ్లేవాళ్లు. లక్షలమంది అక్కడికి వెళ్లడంతో , నేడు అక్కడ కూడా ఉద్యోగుల కొరత ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో మన రాష్ట్రానికి ఒక ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం పూర్తిచేసుకుని వందలాది సంస్థలను తీసుకొని రాగలిగితే మీ ఇంటి పిల్లలకు మీ కళ్ళముందే ఉద్యోగాలు చేసి ఎదిగేవారు. నల్ల మడుగు వాగు, పూడిక తో పాటు రోడ్ల సమస్యలను పరిష్కరిస్తాం. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, ప్రత్తిపాటి నియోజకవర్గ టిడిపి అసెంబ్లీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులు.