*ఆల్ రౌండర్ గా ఉంటేనే సక్సెస్. * విద్యార్థులతో డాక్టర్ పెమ్మసాని. విద్యార్థులు ఆల్ రౌండర్ గా, టీమ్ గా పనిచేసినప్పుడే సక్సెస్ వస్తుందని టిడిపి నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. పుల్లడిగుంట వద్ద ఉన్న ప్రియదర్శిని ఇన్స్ టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్ మెంట్ గ్రౌండ్స్ లో ఫ్రెషర్స్ డే కార్యక్రమం మంగళవారం జరిగింది. ఆ కార్యక్రమానికి డాక్టర్ పెమ్మసానితో పాటు ప్రత్తిపాడు నియోజకవర్గ టిడిపి అభ్యర్థి బూర్ల రామాంజనేయులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ విద్యార్థులు తలుచుకుంటే సాధించలేనిది అంటూ ఏదీ లేదని, వ్యక్తిగత ప్రేరణ, క్రమశిక్షణ ఉన్న ప్రతి విద్యార్థి తన లక్ష్యాన్ని చేరుకోగలరని చెప్పారు. ప్రతి వ్యక్తి తన చివరి నిమిషంలో ఫలానా పని చేయలేకపోయామని బాధపడకూడదని సూచించారు. ఓటేసే ముందు ప్రతీ ఒక్కరు వ్యక్తిగతంగా ప్రశ్నించుకొని, ఎవరైతే సమాజానికి ఉపయోగపడతారో ఆలోచించి మరీ ఓటేయాలని డా. పెమ్మసాని కోరారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ చైర్మన్ చందు రామారావు, ప్రిన్సిపల్ చందు బాబు తదితరులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు.