ది. 10.3.2024 ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు డా. పెమ్మసాని చంద్రశేఖర్ గారితో జిల్లా మైనార్టీ విభాగం ఆత్మీయ సమావేశం జరిగింది. గుంటూరు తూర్పు ఇంచార్జి మొహమ్మద్ నసీర్ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు డా. పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ ముస్లింలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో జగన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందన్నారు.. వైకాపా పాలనలో మైనార్టీ సోదరులకు ఆర్ధిక అభివృద్ధి లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు… మైనార్టీలు కుటుంబ పోషణ నిమిత్తం ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూసి కళ్ళు చెమ్మగిల్లాయన్నారు. నిరుపేద మైనార్టీల జీవితాల్లో వెలుగులు నింపడానికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తామంటూ ఎన్నికల ముందు ఊదరగొట్టి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ప్రభుత్వం సదరు పధకాలను అమలు చేయడంలో మీనమేషాలు లెక్కిస్తోందని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ పరంగా మైనార్టీలకు చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలే కాక… నా సొంతగా కూడా మైనార్టీలకు చేయూతగా ఉంటానని తెలిపారు… పాఠశాలలు ప్రారంభిస్తాను, నీటి కొరత సమస్యకు పరిష్కారం తీసుకొస్తాను, రోడ్లు బాగుచూపిస్తాను, డ్రైనేజి సమస్యను పరిష్కరిస్తాను. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి గంజాయి, గుట్కా వంటి మత్తు పదార్ధాల అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్నాడు… దీనిపై మనందరం పోరాడదామని తెలిపారు..