ట్రాన్స్ జెండర్ ల సమస్యలు పరిష్కరిస్తాం. * 21వ డివిజన్ పర్యటనలో డాక్టర్ పెమ్మసాని ‘చంద్రబాబు నాయుడు హయాంలో అందించిన పెన్షన్లతో పాటు ఇళ్ల స్థలాలు అందించాలని ట్రాన్స్ జెండర్లు కోరుతున్నారు. టిడిపి ప్రభుత్వం రాగానే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. 21వ డివిజన్లలోని, శ్రీనివాసరావు తోట ప్రాంతంలో గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టిడిపి అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి కలిసి బుధవారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ స్థానిక సమస్యలను అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ పర్యటనలో టిడిపి నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్, టిడిపి నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య, డివిజన్ టిడిపి ప్రెసిడెంట్ మస్తాన్ వలీ తదితరులు పాల్గొన్నారు.