టిడిపి, బిజెపి, జనసేన మూడు పార్టీల ఉమ్మడి సమావేశం గుంటూరులోని స్థానిక మౌర్య ఫంక్షన్ హాల్ లో శనివారం జరిగింది.అనంతరం డాక్టర్ పెమ్మసాని మాట్లాడుతూ మూడు శక్తివంతమైన, సామర్థ్యం గల పార్టీలు ఏర్పరచిన సభ అంటే ఎంత శక్తిదాయకంగా ఉంటుందో ఈ సమావేశాన్ని చూస్తే అర్థమవుతోందని ఆయన తెలిపారు. అమరావతి వంటి ప్రతిష్టాత్మకమైన నగర నిర్మాణానికి బిజెపి సహకారం కూడా కావాలని ఆయన కోరారు. అనంతరం బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్ కోసం మూడు పార్టీలు కలిసి ఎన్నికలలో పోటీకి సిద్ధమయ్యాయని తెలిపారు.  ఈ కార్యక్రమంలో తెనాలి జనసేన టిడిపి కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్, గుంటూరు పశ్చిమ టిడిపి అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి, గుంటూరు తూర్పు నియోజకవర్గ టిడిపి అభ్యర్థి మహమ్మద్ నసీర్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ కోవెలమూడి రవీంద్రబాబు(నాని) తదితరులు పాల్గొన్నారు. పెమ్మసాని ఆధ్వర్యంలో చేరికలు టిడిపి నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పై వైసీపీ నాయకుల్లో నమ్మకం నానాటికి పెరుగుతుంది. ఆయన ఆధ్వర్యంలో టిడిపిలో చేరే వారి సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతుండడంతో క్రమంగా నియోజకవర్గాల వారీగా వైసిపి ఖాళీ అవుతుంది. తాడికొండ మండలం రావెల గ్రామానికి చెందిన మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కొమ్మినేని రామ చంద్రరావు ఆధ్వర్యంలో 600 కుటుంబాలు నేడు టిడిపిలో చేరాయి.