ప్రలోభాలు పవన్ ను టచ్ చేయలేవు. * గుంటూరు రూరల్ పర్యటనలో డా. పెమ్మసాని. ‘ పవన్ ను చాలామంది ప్రలోభ పెట్టాలని చూసారు. ఆ ప్రలోభాలన్నీ పవన్ కు వెంట్రుక తో సమానం.’ అని టీడీపీ నాయకులు డా. పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు రూరల్ ప్రాంతమైన ఏటుకూరు నుంచి ప్రారంభమైన ఎన్నికల పర్యటనలో పెమ్మసాని చంద్రశేఖర్, ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులు కలిసి శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ పదేళ్ల క్రితం ప్రారంభమైన జనసేనకు కార్యకర్తలు ఊపిరి అయి నిలబడ్డారన్నారు. రాష్ట్రం కష్టాల్లో ఉంటే అడ్డుకున్న మహోన్నత వ్యక్తి పవన్ అని తెలిపారు. ఆయన కుటుంబంలోనే కుల ప్రస్తావన లేని పవన్ పై ఈ వైసీపీ నాయకులు కులాల కుమ్ములాటలు రుద్దాలని చూడటం మూర్ఖత్వమేనని పెమ్మసాని తెలియజేశారు. అనంతరం రామాంజనేయులు మాట్లాడుతూ ఈ ప్రభుత్వ రాక్షస పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందని అన్నారు. పవన్ కళ్యాణ్ ను టచ్ చేయాలంటే ముందు ఆయన అభిమానులను టచ్ చేసే దైర్యం ఉండాలని తెలిపారు. పర్యటనలో ఆరో డివిజన్ కార్పొరేటర్ పోతురాజు సమత, గోరంట్ల కార్పొరేటర్ ఎర్రమట్టి పద్మావతి తదితరులు పాల్గొన్నారు.