శ్రమ ఆయన రక్తంలోనే ఉంది. * నారా లోకేష్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో డా. పెమ్మసాని. ‘ చేనేతల గురించి చెప్పిన ఎన్టీయార్ గళం మనిషై మంగళగిరి బరిలో కాలు దువ్వుతుంది. ఈ నియోజకవర్గం నిజంగా చాలా అదృష్టం చేసుకుంది.’ అని టీడీపీ నాయకులు డా. పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. తాడేపల్లిలోని నివాసంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో బుధవారం రోటరీ క్లబ్, కిరాణా అసోసియేషన్, చేనేత సంఘ సభ్యులతో జరిగిన సమావేశంలో పెమ్మసాని కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర సంబంధిత ప్రాజెక్టులు తీసుకు రావడంతో తమ వంతు కృషి తాము చేస్తామని, ఉద్యోగాల కల్పనకు సహకరిస్తామని చెప్పారు. ఇతరుల గురించి ఆలోచించే అలాంటి వ్యక్తులు ఉండబట్టే దుర్మార్గులు ఉన్న ఈ సమాజం ఇంకా బ్యాలెన్స్ గా ఉందన్నారు. కష్టపడే తత్వం, శ్రమ తన రక్తంలో నింపుకున్న నారా లోకేశ్ వంటి నాయకులు మంగళగిరికి లభించారన్నారు. కాగా సభ్యులతో మాట్లాడుతూ స్థానిక సమస్యలు, ప్రజలకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై లోకేశ్ సవివరంగా సభ్యులతో చర్చించారు. రాబోయే ఎన్నికల దృష్ట్యా ఏదేని సమస్యలు తలెత్తినా తనను సంప్రదించాలని లోకేశ్ కోరారు.