నమ్మకాన్ని వమ్ము చేయం. * బాబు చలవతో ఎయిమ్స్ ద్వారా మూడు వేల ఉద్యోగాలు. ‘ఎయిమ్స్ ను మంగళగిరికి తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు కృషి ఎనలేనిది. ఎయిమ్స్ ను తీసుకురాకుంటే మూడు వేల ఉద్యోగాలు వచ్చేవే కావు. లోకేష్ గారు, తానుప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయబోము’ అని టిడిపి నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. మంగళగిరి మండలం నవులూరు గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగిన కార్మిక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎయిమ్స్, ఎయిమ్స్ లో పనిచేసే సిబ్బందిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 2014లో చంద్రబాబు పట్టుబట్టి మరి ఎయిమ్స్, మూడు యూనివర్సిటీలను రాజధాని ప్రాంతంలో తీసుకు రాగలిగారన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం మంగళగిరి పరిసరాల్లో యువతను గంజాయి, మత్తుమందుకు బానిసలను చేస్తుందని వివరించారు. మహిళలు తలుచుకుంటే ఆదిశక్తులుగా మారి ప్రభుత్వాలనే కూల్చేసిన చరిత్ర మనకు విధితమేనని తెలిపారు. ఎయిమ్స్ చుట్టుపక్కల డ్రైన్ సిస్టం, డంపింగ్ యార్డ్ నిర్మూలన, తాగునీటి సమస్య వంటి ఎన్నో ఇబ్బందులతో ప్రజలు సతమతమవుతున్నారని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయా సమస్యలపై దృష్టి పెడతామని పెమ్మసాని చెప్పారు. నారా లోకేష్ ఒక సింహం.  ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ టిడిపి సమన్వయకర్త నందం అబద్దయ్య, బిజెపి జిల్లా మాజీ అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మైనర్ బాబు తదితరులు పాల్గొన్నారు.