యాదవులకు అండగా టిడిపి + బీసీ ఆత్మీయ సమావేశంలో పెమ్మసాని గుంటూరులోని స్థానిక ఏ కన్వెన్షన్ హాల్లో బీసీ సోదరుల ఆత్మీయ సమావేశం ఆదివారం సాయంత్రం జరిగింది. పెమ్మసాని చంద్రశేఖర్ గారు: యాదవ సోదరుల్లో ఎంతోమంది నాయకులను తయారుచేసిన ఘనత అన్న ఎన్టీఆర్, టిడిపికే దక్కుతుంది. ఈరోజుకు కూడా చంద్రబాబు గారు ఎక్కడికి వెళ్లినా యాదవ సోదరుడైన యనమల రామకృష్ణుడిని తన పక్కనే ఉంచుకుంటారు. అది యాదవ సోదరులకు చంద్రబాబు గారి ఇచ్చే గౌరవం. కానీ జగన్ ను చూస్తే పక్కన పెట్టుకోవడం సంగతి దేవుడెరుగు, కనీసం యాదవులకు గౌరవం ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఆ పార్టీలో ఉన్న యాదవ సోదరుల కైనా కనీసం కుర్చీ వేసి గౌరవిస్తున్నారా! లేదా! ఆ నాయకులే చెప్పాలి. వైసీపీలోకి కొత్తగా వెళ్లిన నాయకులు ఎవరైనా సరే సజ్జల కుమారుడు భార్గవరెడ్డి ఎలా చెప్తే అలా వింటేనే పార్టీలో ఉండాలట! నేను రాజకీయాల్లోకి స్వార్థం కోసం రాలేదు, పదవుల కోసం రాలేదు. భగవంతుడిచ్చిన జ్ఞానంతో నా చుట్టూ ఉన్నవారికి మంచి చేయాలని ఒకే ఒక ఆలోచనతో ఇక్కడికి వచ్చాను. జీవితంలో పేదరికం నుంచి బయటపడలేని స్థితిలో ఇబ్బందులు పడుతున్న వారికి నాలాంటి వారి అవసరం ఉందని నమ్మి మీ ముందుకు వచ్చాను. పిడుగురాళ్ల మాధవి: ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధి లాగా పనిచేసేందుకు సంసిద్ధమై వస్తున్నాం. మా సేవలు ఎప్పుడు గుర్తుండేలా పని చేయాలనేదే మా ధ్యేయం. ప్రభుత్వం అందించే అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందించాలానే బలమైన నిర్ణయంతో వస్తున్నాం. నాకు మీరు అందించే సహాయ సహకారాలను దృష్టిలో ఉంచుకొని మీ అందరి అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. బోనబోయిన శ్రీనివాస్ యాదవ్: యాదవులు ఏదైనా మాట ఇవ్వడానికి ఆలోచిస్తారేమో గాని, మాట ఇస్తే మాత్రం ప్రాణం పోయినా కట్టుబడి ఉంటారు. ఒకసారి సర్దుకుపోయి పని చేయడం మొదలుపెడితే విజయ తీరాలకు చేరేవరకు కృషి చేస్తాం. ఎన్డీఏ కూటమి విజయానికి మా సహకారం ఎప్పుడూ మీకు ఉంటుంది. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు తాళ్ల వెంకటేష్ యాదవ్, రాష్ట్ర బీసీ సంఘం ఉపాధ్యక్షుడు కుమ్మర క్రాంతి కుమార్, కార్పొరేటర్ ఎల్లావుల అశోక్ యాదవ్, మాజీ కార్పొరేటర్ అడక శ్రీనివాసరావు, యాదవ నాయకులు తట్టుకోల కేశవ్ తదితరులు పాల్గొన్నారు.
Tags: No Categories