వనమా ఇంటికి పెమ్మసాని. బిజెపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సరస్వతీ శిశు మందిర్ జిల్లా అధ్యక్షులు వనమా పూర్ణచంద్రరావు నివాసానికి గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు శనివారం వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆనాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి మొదలు నేటి ప్రధాని నరేంద్ర మోడీ వరకు రాజకీయ విశేషాలను పెమ్మసానికి వనమా వివరించారు. ఆనాటి ఉద్యమ కాలంలో పోరాటం చేసినందుకుగాను 12 రోజులు తిహారు జైల్లో ఉంచిన విషయాన్ని ఈ సందర్భంగా వనమా వివరించి చెప్పారు. బిజెపి కూడా ఎన్నో ప్రజా రంజక పథకాలను మోదీ నాయకత్వంలో అమలు అవుతున్నాయని ఈ సందర్భంగా పెమ్మసాని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం అసెంబ్లీ టిడిపి అభ్యర్థి మహమ్మద్ నశీర్ అహ్మద్, వనమా తనయులు బిజెపి జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర తదితర బిజెపి నాయకులు పాల్గొన్నారు.
Tags: No Categories