వ్యాపారస్తుల సమస్యల పరిష్కరిస్తాం. + చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులతో డాక్టర్ పెమ్మసాని ‘చాలామంది నాయకులు రాజకీయాల్లో పెట్టిన ఖర్చును ఎన్నికల తర్వాత వ్యాపారస్తులపై మోపుతుంటారు. మాకు అలాంటి అవసరం లేదు. చిన్నచిన్న వ్యాపారులు పడే ఇబ్బందులకు పరిష్కారం చూపిస్తాం.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులోని స్థానిక చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో శనివారం జరిగిన ఆత్మీయ సమావేశంలో డాక్టర్ పెమ్మసాని ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ అయితే వ్యాపారస్తులు లేదా సహజ వనరులే లక్ష్యంగా కొందరు రాజకీయ నాయకులు దండుకుంటున్నారన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కరూ ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటామని, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం గుంటూరు తూర్పు నియోజకవర్గం అసెంబ్లీ టిడిపి అభ్యర్థి మహమ్మద్ నశీర్ అహ్మద్ మాట్లాడుతూ వన్ టౌన్ లో ప్రశాంతంగా జీవించే వ్యాపారస్తుల ఆస్తులను కొందరు నాయకులు కబ్జా చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఒక చేతకాని దద్దమ్మ పాలనలో గుంటూరు ప్రజల అవస్థలు పడుతున్నారు అన్నారు. పెమ్మసాని గారి అడుగుజాడల్లో నడుస్తూ పెద్దవారికి తమ్ముడిగా చిన్నవారికి అనగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. అలాగే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అసెంబ్లీ టిడిపి అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి మాట్లాడుతూ అందరి సమస్యలను తన సమస్యలుగా భావించి పరిష్కరిస్తాను అని చెప్పారు. రాజకీయాల్లో తానేమి సంపాదించాలని ఉద్దేశంతో రాలేదని సేవ చేయాలని ఉద్దేశంతో వచ్చానని వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్, 35వ డివిజన్ కార్పొరేటర్ ఈరంటి వరప్రసాద్(బాబు), గుంటూరు చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ ఆతుకూరి ఆంజనేయులు, మిర్చి మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ కొత్తూరి వెంకట్, ఆరో డివిజన్ కార్పొరేటర్ పోతురాజు సమత, తదితరులు పాల్గొన్నారు.