ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క. + జగన్ ప్రభుత్వానికి పెమ్మసాని హెచ్చరిక. + తెనాలి ఎన్నికల పర్యటనలో పెమ్మసాని, మనోహర్. ‘రౌడీయిజాలు, గల్లీ గల్లీలో గంజాయి విక్రయాలు ఇకనైనా ఆపేయాలి. వచ్చేది టిడిపి ప్రభుత్వం అన్యాయం అరాచకాలపై ఉక్కు పాదం మోపుతుంది.ఇప్పటిదాకా ఒక లెక్క ఇకనుంచి మరో లెక్క.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలిలోని ఐతానగర్ నుంచి గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తన పర్యటనను గురువారం ప్రారంభించారు. తెనాలి నియోజకవర్గం కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తో కలిసి చేపట్టిన పర్యటనలో స్థానికులతో మాట్లాడుతూ ముందుకు సాగారు. పెమ్మసాని చంద్రశేఖర్: జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ ప్రతి ఏటా జాబ్ విషయం మర్చిపోయి సాక్షి కేలండర్ విడుదల చేస్తున్నారు. రాజధాని ప్రాంతాన్ని స్మశానం అని వ్యాఖ్యానించిన జగన్, ఆ పార్టీ నాయకులు ఆ స్మశానంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఎందుకు ఇచ్చారు? అంటే పేదలను కాటికాపరులుగా భావించటం మీ ప్రభుత్వం ఉద్దేశమా? అబద్ధాలు చెప్పి, చెప్పి.. నిజం అంటే ఏంటో కూడా జగన్ మర్చిపోయారు. పొద్దున లెగిస్తే నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ జగన్ ప్రచారం చేసుకుంటారు. మరి ఒక దళిత డ్రైవర్ ను వైసిపి నాయకులు చంపితే ఎందుకు ఊరుకున్నారు? ఒక దళిత వైద్యుడు మాస్క్ అడిగాడు అన్న కోపంతో అతని ప్రాణాలు పోయేవరకు హింసించారు. ఇదేనా ఎస్సీ, ఎస్టీలకు వైసీపీ ప్రభుత్వంలో దక్కే విలువ? పేరుకు మాత్రం బీసీలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన జగన్ ప్రభుత్వం కనీసం ఆ కార్పొరేషన్ కార్యాలయాల్లో కూర్చోడానికి కుర్చీ కూడా ఇవ్వలేకపోతున్నారు. జగన్ ప్రభుత్వంలో మంచినీళ్లు దొరుకుతున్నాయో లేదో గాని, ప్రతి గల్లీలో గంజాయి మాత్రం దొరుకుతుంది. ఈ జగన్ ప్రభుత్వానికి ఒకటే చెబుతున్నాను. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇకనుంచి ఇంకో లెక్క ఉంటుంది. రౌడీయిజం చేసే వాళ్లకు, గంజాయి విక్రేతలపై మా ప్రభుత్వం ఉక్కు పాదం మోపబోతుంది. ప్రభుత్వ శాఖల్లో చాలామంది అధికారులు ఈ ప్రభుత్వానికి వంత పాడుతున్నారు. పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ వేసుకోవడంపై ఆ ప్రభుత్వం ఆంతర్యం ఏంటో అర్థం కావడం లేదు. మహా అయితే గడిచిన ఐదేళ్లు మాత్రమే ఉండే జగన్, ప్రజలు జీవితాంతం వాడుకోవాల్సిన పాస్ పుస్తకాలపై ఫోటోలు ఎందుకు వేసుకోవలసి వచ్చింది? నాదెండ్ల మనోహర్: ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వారంలోనే గంజాయి విక్రయాలను అరికడతాం. తెనాలిలో ఇదివరకు ఎప్పుడూ లేనివిధంగా రౌడీయిజం, గంజాయి విక్రయాలు మితిమీరి పోయాయి. * ఈ పర్యటనలో మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి, మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, టిడిపి తెలంగాణ నాయకులు నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags: No Categories