పేదలకు ఇల్లు కట్టించే బాధ్యత మాది. + స్థానిక ఎమ్మెల్యేకు ప్రజా సమస్యలపై అవగాహన శూన్యం. + తెనాలిలో జరిగిన పద్మశాలి ఆత్మీయ సమావేశంలో పెమ్మసాని. తెనాలి నియోజకవర్గ కేంద్రంలోని స్థానిక ఎన్విఆర్ కళ్యాణ మండపంలో గురువారం జరిగిన పద్మశాలీ ఆత్మీయ సమావేశం కార్యక్రమానికి గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ కోటమీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. * పెమ్మసాని చంద్రశేఖర్: నేను బుర్రిపాలెం బుల్లోడు కాను, అవినీతిపరుల గుండెల్లో దిగబోయే బుల్లెట్ ను. పద్మశాలీలు అంటే ఒక సంస్కృతి, సాంప్రదాయం. ప్రతి ఒక్కరికి దుస్తులు ధరించడంలో వినూత్నతను పరిచయం చేసిన పద్మశాలీలకు నా వందనాలు. కళను నమ్మకొని ఎక్కడెక్కడకో వెళ్లి జీవిస్తున్న వారు కొందరైతే ఇక్కడే ఉంటూ చేనేత కళపై ఆధారపడి జీవిస్తున్న వారు మరెందరో ఉన్నారు. నా సతీమణి కూడా ఈ చేనేత కార్మికుల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం చేనేత కార్మికుల సమస్యలను ఆమె ద్వారా విన్నప్పుడు చాలా బాధనిపించింది. ఆ సమస్యలు విన్నాక ఏదో ఒక మంచి చేయాలి అని మేమిద్దరం దృఢమైన నిర్ణయం తీసుకున్నాం. ఎన్నికల తర్వాత మీతో కూర్చొని, మీ సమస్యలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే మెరుగైన జీవన విధానాలను అందించగలుగుతామనేది సంఘ నాయకులతో కూర్చుని చర్చిద్దాం. నేను, లోకేష్, మనోహర్ గారు అందరం కలిసి చేనేత సంఘాలకు వీలైనంత సహాయ సహకారాలు అందిస్తాం. కనీసం ఇల్లు లేని వ్యక్తులు కూడా మీలో చాలామంది ఉన్నారు. అయితే అలాంటి పేదలకు జగన్ రెడ్డి లాగా ఒక సెంటు భూమి ఇచ్చి చేతులు దులుపుకునే అవసరం టిడిపికి లేదు. టిడిపి నేతృత్వంలో రెండు సెంట్లు స్థలాల్లో ఇల్లు లేదా టిట్కో నివాసాలు అందించే బాధ్యత టిడిపి, మేము తీసుకుంటాము. ముందు ముందు అవకాశాలు ఉన్న ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలన్న అంశంపై జగన్ గారితో పాటు స్థానిక ఎమ్మెల్యేకు కూడా అవగాహన శూన్యం అనుకుంటా! * నాదెండ్ల మనోహర్: జనసేనలో మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సంఘం చేనేత సంక్షేమ సంఘం. ప్రభుత్వంలోని యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ఉపాధి, సంక్షేమ అవకాశాలు మెరుగుపలుచుకోవాల్సిన అవసరం ఉంది. చేనేతల నుంచి యూనిఫామ్ లు తీసుకున్నామని జగన్ అబద్ధం చెప్పారు. ఐదు కంపెనీలకు రూ. 670 కోట్లు కేవలం యూనిఫామ్ లకు కట్టబెట్టిన ఘనత ఈ జగన్ ప్రభుత్వానిది. పచ్చి అబద్ధాలు చెప్పి, ప్రజలను మోసం చేసి, ఇప్పుడు ఓట్ల కోసం ఈ వైసీపీ నాయకులు మన ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 40 రోజుల పాదయాత్రను పూర్తి చేసుకున్నాను. ఈ పాదయాత్రలో అడుగడుగునా ప్రజలు వైసిపి వల్ల పడ్డ బాధలను చెప్పుకున్నారు. * ఇతర ప్రాంతాల్లో, రాష్ట్రాల్లో నివసిస్తున్న మన ప్రాంతానికి చెందిన యువత, ఇతర వర్గాల ఓటర్లు ఓటు వేయాలని బాధ్యతగా సొంత ఖర్చు పెట్టుకుని ఎన్నికల కోసం వస్తున్నారు. ప్రజల సమస్యలను తీర్చాలని ఉద్దేశంతో చంద్రబాబు గారు ఉచిత బస్సు, మహిళల కోసం మరిన్ని పథకాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈరోజు టెక్నాలజీని ఎంతగా ఉపయోగిస్తే అన్ని మెరుగైన ఉద్యోగాలు లభిస్తున్నాయి. మహిళలు కూడా అదే స్థాయిలో సాంకేతికతను ఉపయోగించుకొని అవకాశాలు అందిపుచ్చుకోవాలి. ఆలపాటి రాజేంద్రప్రసాద్: మన ప్రాంతంలో పద్మశాలీలను విశాల హృదయులు అని పిలుస్తుంటాం. విభజనకు ముందు నుంచి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పద్మశాలీలకు టిడిపీ ఉన్నత స్థానం కల్పించింది. ఈ ప్రభుత్వంలో ఇల్లు కట్టుకోవాలనుకున్న బీదల ఆశలు అడియాశలు అయ్యాయి. టిడిపి హయాంలో ఇల్లు కట్టించి ఏర్పాటుచేసినా సరే, ఈ ప్రభుత్వం వచ్చాక ఇళ్లన్నీ మట్టిపాలు చేసింది. తెనాలి నియోజకవర్గంలో 10,000 మంది ఉన్న ఈ ఓటర్లలో మెజారిటీ శాతం ఓటర్లంతా టిడిపికే వేస్తామని చెబుతున్నారంటే, వైసిపి ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకత స్పష్టమవుతుంది. మన ఇళ్లల్లో మనం ఉండగలమా! మన భూములు మనకు సొంతం అవుతాయా! అన్న అభద్రతా భావంలో ఉన్నామంటే, ఈ ప్రభుత్వం ఎంత అరాచక పాలన చేస్తుందో అర్థమవుతుంది. ఇలాంటి ఎన్నో విపత్కర పరిస్థితుల్లో మనకి ఉన్న ఒకే ఒక్క ఆసరా మన ఓటు హక్కు. చేతిలో ఉన్న ఆ ఆయుధంతోని మనల్ని మనం కాపాడుకుంటూనే సమాజాన్ని కూడా కాపాడే బాధ్యత తీసుకోవాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఓటు వేయకపోవడం అనేది మహా పాపం అనే గ్రహించాలి. జొన్నాదుల మహేష్ సభా అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి చిల్లపల్లి శ్రీనివాసరావు, అవ్వారు శ్రీనివాసరావు, దివి అనిత, దివి హేమంత్, పడవల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Tags: No Categories