తెనాలి నియోజకవర్గ కేంద్రంలో గురువారం జరిగిన ఎన్నికల ప్రచారంలో డాక్టర్ పెమ్మసాని, నియోజకవర్గ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తో కలిసి పాల్గొన్నారు. రోడ్ షోలో భాగంగా దారి పొడవునా ప్రజలతో మమేకమవుతూ, ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఇరువురు అభ్యర్థులు ముందుకు సాగారు. రోడ్ షో లో ఉన్న పెమ్మసానిపై పూల వర్షం కురిపిస్తూ, పల్లెచోట్ల భారీ గజమాలలు, శాలువాలతో ఆయన్ను ప్రజలు గౌరవించారు. తర్వాత పెమ్మసాని మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలతో ప్రజలు విసిగిపోయారని, ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ఓటర్ల ఉత్సాహం చూస్తుంటే తాము ప్రచార యాత్రకు వచ్చినట్లు లేదని, విజయోత్సవ సభకు వచ్చినట్లు ఉందని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అనంతరం మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల రీత్యా టిడిపి, జనసేన, బిజెపి పార్టీలు ఏకమయ్యాయని, ప్రజలందరూ ఈ పొత్తును స్వాగతించాలని కోరారు. ప్రజల పక్షాన పోరాటానికి ఎప్పుడూ సిద్ధమని చెప్పిన పవన్ కళ్యాణ్ మార్గాన్ని అనుసరించడానికి తాను కూడా ఎప్పుడు సిద్ధమేనని చెప్పారు. ఈ పర్యటనలో టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
Tags: No Categories