తెనాలిలోని కొత్తపేటలో పార్లమెంటరీ టిడిపి కార్యాలయాన్ని డాక్టర్ పెమ్మసాని, తెనాలి నియోజవర్గ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తో కలిసి గురువారం ప్రారంభించారు. అనంతరం పెమ్మసాని మాట్లాడుతూ యువతను గంజాయి, కల్తీ మద్యం మత్తులో ఉంచుతూ ఈ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందని తెలిపారు. రూ. 70 వేల కోట్లతో ఇరిగేషన్ ప్రాజెక్టులపై అప్పట్లో టిడిపి దృష్టి పెట్టిందని, ఆ ఫలితంగానే పట్టిసీమ ప్రాజెక్టు నేటి గుంటూరు జిల్లా రైతాంగానికి ఉపయోగపడుతుందని వివరించారు. ప్రజా సమస్యలు, కష్టాలను చూసి టిడిపి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు ‘సూపర్ సిక్స్’ ప్రవేశపెట్టారని పెమ్మసాని గారు తెలిపారు. వంటి పథకాలతో సుభిక్షమైన పాలనకు టిడిపి, జనసేన, బీజేపీ ముందుకు వస్తున్నాయని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల ఆలోచనలు అటు ఇటు అయితే వ్యవస్థలు నిర్వీర్యం అవుతాయని, ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.  ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి, తదితర టిడిపి, జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు.