“నేనొక తెరిచిన పుస్తకం. + ప్రజా సమస్యలను పార్లమెంట్ లో వినిపిస్తాను. + ఆ బలమైన గళం అవ్వగలననే చంద్రబాబు నన్ను పంపారు + తుళ్లూరు మండలం పర్యటనలో పెమ్మసాని. ‘ ప్రజా సమస్యలను ఒక బలమైన గళంగా పార్లమెంట్లో వినిపించాలి. వివరించడమే కాదు పరిష్కరించే ఒక విద్యావంతుడు కావాలనే ఉద్దేశంతోనే నన్ను చంద్రబాబు గారు మీ దగ్గరకు పంపారు.’ అని డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు మాట్లాడారు. తుళ్లూరు మండల పర్యటనలో భాగంగా గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు నియోజకవర్గ అసెంబ్లీ టిడిపి అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ గారితో కలిసి సోమవారం రోడ్ షో నిర్వహించారు. రోడ్ షో లో భాగంగా మండలంలోని పెద్ద పరిమి, నెక్కల్లు, అనంతవరం, వడ్డమాను, హరిశ్చంద్రపురం, బోరుపాలెం, దొండపాడులో ఆయన గ్రామ గ్రామాన ప్రజలను పలకరిస్తూ ముందుకు సాగారు. దారి పొడవునా పూల వర్షాలతో ప్రజలు ఇరువురు నాయకులను స్వాగతించారు. కాగా ప్రజా సమస్యలను ప్రజా సమస్యలను ఉద్దేశించి పెదపరిమి, అనంతవరం, వడ్డమాను, హరిశ్చంద్రపురం, దొండపాడులో ఆయన ప్రసంగించారు. +చదువు పూర్తయి నాలుగేళ్లు+ ‘చదువు పూర్తయి నాలుగేళ్లు అవుతున్నా, ఉద్యోగాలు లేక యువకులు నిట్టూరుస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మాత్రమే బిజెపితో టిడిపి, జనసేన పొత్తు పెట్టుకుంది. టీడీపీ హయాంలో బిజెపితో పొత్తు ఉన్నప్పటికీ ఏ ఒక్క ముస్లింకు గాని ముస్లిం కుటుంబానికి గానీ అన్యాయం జరగలేదు అని చెప్పడానికి గర్వపడుతున్నాం. పార్లమెంట్లో మనకంటూ బలమైన గళం వినపడాలంటే విద్యావంతులు కావాలని కోరుకుంటున్న తరుణంలో చంద్రబాబు గారు నన్ను గుంటూరు పార్లమెంటుకు ఎంపిక చేశారు. నా జీవితం ఒక తెరిచిన పుస్తకం. తెలుగువాడి తెలివితేటలను ప్రపంచంలో చాటిన వాళ్ళలో నేను కూడా ఒకడిని. గొప్ప స్థాయిని చూసిన నేను ఈరోజు చిన్నాభిన్నమైన సామాన్యుడి జీవితాన్ని చూసి వెనక్కి వచ్చాను. నా వంతు సహాయం చేసి ప్రతీ ఒక్కరి అభివృద్ధికి కృషి చేస్తాను. నేను ఉన్నాను, నేను విన్నాను అంటూ జనాన్ని నమ్మించి, అధికారంలోకి వచ్చాక ప్రజా వేదికను కూల్చడంతో జగన్ తన పాలనను మొదలుపెట్టారు. అభివృద్ధి చేసే కంటే ఆ డబ్బులతో ఓట్లను కొనాలనే ఉద్దేశంతో జగన్ కొత్త రాజకీయానికి తెర తీశారు. చుట్టూ పక్కల ప్రాంతాలలో వాటర్, ఇంటి సమస్యలు ఉన్నవాళ్ళకు టిడిపి అధికారంలోకి రాగానే పరిష్కరించే బాధ్యతను నేను, శ్రావణ్ కుమార్ గారు తీసుకుంటాం. సుచరిత గారు పేరుకు మాత్రమే హోం మంత్రిగా పనిచేశారు. అధికారం అడ్డుపెట్టుకున్న ఆమె బంధువులు ఎన్నో రకాలుగా అవినీతికి పాల్పడ్డారు. నిజంగా నిజాయితీగా ఆమె పనిచేసే ఉంటే గత నియోజకవర్గంలోనే పోటీ చేయవచ్చు కదా!’ అని పెమ్మసాని గారు మాట్లాడారు. తెనాలి శ్రావణ్ కుమార్ గారు మాట్లాడుతూ ‘రాజధాని ప్రాంతంలో 2014 సమయంలో భూ సమీకరణకు వైసీపీ నాయకులు కూడా ఆమోదం తెలిపారు. దురదృష్టవశాత్తు 2019లో అసత్య ప్రచారాల కారణంగా రాజధాని అభాసు పాలయింది. కొన్ని వర్గాల వారికి మాత్రమే ఈ ప్రాంతం ఎడారిలా కనిపించింది. ఆ దౌర్భాగ్య వైసిపి నాయకుల కుతంత్రాల కారణంగా రాజధాని వాసులు ప్రజలు నష్టపోయారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ సహకరిస్తున్నారు.’ అని అన్నారు. అలాగే దొండపాడు పర్యటన ముగింపు అనంతరం పలువురు వైసిపి నాయకులు పెమ్మసాని గారి ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ కండువా కప్పుకున్నారు. దొండపాడు గ్రామం మాజీ సర్పంచ్ కొమ్మినేని శివయ్య గారి ఆధ్వర్యంలో పెమ్మసాని చంద్రశేఖర్, తెనాలి శ్రావణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. ఈ పర్యటనలో టిడిపి సీనియర్ నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య, విద్యార్థులు తుళ్లూరు మండల పార్టీ ప్రెసిడెంట్ దనేకుల వెంకట సుబ్బారావు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ బెల్లంకొండ నరసింహారావు, దొండపాడు మాజీ ఎంపీటీసీ మైనేని గిరిజ, అదేవిధంగా తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు నూతలపాటి రామారావు, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి పుట్టి చంద్రం తదితర టిడిపి, జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు.
పరిశ్రమల రాకకు ప్రయత్నాలు. + నిరుద్యోగ యువత సమావేశంలో పెమ్మసాని. ‘పరిశ్రమలు తీసుకురావడం అంటే పేపర్లపై సంఖ్యలు చదవడం కాదు. పారిశ్రామికవేత్తలతో చర్చలు జరపాలి, బతిమాలాలి, వాళ్లకు ఒక భరోసా కల్పించాలి.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు అన్నారు. గుంటూరులోని స్థానిక అమరావతి రోడ్డులో గల ఏ వన్ కన్వెన్షన్ హాల్ లో సోమవారం జరిగిన పశ్చిమ నియోజకవర్గం నిరుద్యోగ యువత సమావేశానికి ముఖ్య అతిథిగా పెమ్మసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ లాగా తాడేపల్లి ఇంట్లో కూర్చొని కబుర్లు చెప్తే పరిశ్రమలు రావు అన్నారు. చంద్రబాబు నాయుడు ఐదేళ్లు కష్టపడి 120 సంస్థలను రాజధానికి తీసుకురావడానికి కృషి చేశారని, స్థలాలు కేటాయించి, జీవోలు కూడా విడుదల చేశారని చెప్పారు. అయితే జగన్ రాగానే సంస్థలను, పరిశ్రమలను రాజధానికి రాకుండా రద్దు చేశారని వివరించారు. అనంతరం తూర్పు నియోజకవర్గ అసెంబ్లీ టిడిపి అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో యువత తమ సత్తా చాటాలని, తెలుగుదేశం పార్టీ నాయకులకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఇప్పటికే నిరుద్యోగ భృతిని ప్రకటించిన టిడిపి అధికారంలోకి రాగానే పరిశ్రమలను తీసుకువచ్చి ఉద్యోగ అవకాశాలను అందిస్తుందని తెలిపారు. తిరువీధి హరికృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గుంటూరు నగర టిడిపి అధ్యక్షుడు డేగల ప్రభాకర్, టిడిపి రాష్ట్ర కార్యదర్శి వడ్రానం హరిబాబు, రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి చిట్టా బత్తిన చిట్టిబాబు, రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి మద్దిరాల మ్యాని, జిల్లా అధికార ప్రతినిధి బొబ్బిలి రామారావు తదితరులు పాల్గొన్నారు.టిడిపి రాకతో పేదలకు నివాసాలు. తుళ్లూరు మండలం పర్యటనలో భాగంగా పరిమి గ్రామ పంట పొలాల్లో పనిచేస్తున్న పలువురు వ్యవసాయ కూలీలను కలుసుకొని పెమ్మసాని గారు మాట్లాడారు. కూలీల సమస్యలను, పని సమయం, రోజువారి కూలీ వివరాలు తదితరాలను ఆయన కూలీల నుంచి అడిగి తెలుసుకున్నారు. రోజువారి కూలీలతో జీవనం దుర్భరంగా మారిందని, ఇంట్లోని మగవాళ్ళు కల్తీ మధ్యానికి బానిసలై ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారని ఈ సందర్భంగా కొందరు మహిళా కూలీలు పెమ్మసాని వద్ద వాపోయారు. సొంత ఇల్లు, స్థలాలు వంటి విషయాలను పెమ్మసాని అడుగగా తమకు సొంత ఇల్లు లేవని ఆ కూలీలు సమాధానం ఇచ్చారు. దీంతో పెమ్మసాని స్పందిస్తూ టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు, వ్యవసాయ కూలీలకు నివాసాలు ఏర్పాటు చేసే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన తెలిపారు.”
Tags: No Categories