పరిశ్రమల రాకకు ప్రయత్నాలు. నిరుద్యోగ యువత సమావేశంలో పెమ్మసాని. పరిశ్రమలు తీసుకురావడం అంటే పేపర్లపై సంఖ్యలు చదవడం కాదు. పారిశ్రామికవేత్తలతో చర్చలు జరపాలి, బతిమాలాలి, వాళ్లకు ఒక భరోసా కల్పించాలి.అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు అన్నారు. గుంటూరులోని స్థానిక అమరావతి రోడ్డులో గల ఏ వన్ కన్వెన్షన్ హాల్ లో సోమవారం జరిగిన పశ్చిమ నియోజకవర్గం నిరుద్యోగ యువత సమావేశానికి ముఖ్య అతిథిగా పెమ్మసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ లాగా తాడేపల్లి ఇంట్లో కూర్చొని కబుర్లు చెప్తే పరిశ్రమలు రావు అన్నారు. చంద్రబాబు నాయుడు ఐదేళ్లు కష్టపడి 120 సంస్థలను రాజధానికి తీసుకురావడానికి కృషి చేశారని, స్థలాలు కేటాయించి, జీవోలు కూడా విడుదల చేశారని చెప్పారు. అయితే జగన్ రాగానే సంస్థలను, పరిశ్రమలను రాజధానికి రాకుండా రద్దు చేశారని వివరించారు. అనంతరం తూర్పు నియోజకవర్గ అసెంబ్లీ టిడిపి అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో యువత తమ సత్తా చాటాలని, తెలుగుదేశం పార్టీ నాయకులకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఇప్పటికే నిరుద్యోగ భృతిని ప్రకటించిన టిడిపి అధికారంలోకి రాగానే పరిశ్రమలను తీసుకువచ్చి ఉద్యోగ అవకాశాలను అందిస్తుందని తెలిపారు. తిరువీధి హరికృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గుంటూరు నగర టిడిపి అధ్యక్షుడు డేగల ప్రభాకర్, టిడిపి రాష్ట్ర కార్యదర్శి వడ్రానం హరిబాబు, రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి చిట్టా బత్తిన చిట్టిబాబు, రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి మద్దిరాల మ్యాని, జిల్లా అధికార ప్రతినిధి బొబ్బిలి రామారావు తదితరులు పాల్గొన్నారు.
Tags: No Categories