గంజాయి విక్రేతలపై కఠిన చర్యలు.
+ అన్నదాత అడ్డాలో సాగునీరు లేని దుస్థితి. + నకిలీ ఎరువులు, కల్తీ మందులు అరికడతాం + విద్వేషాలు రెచ్చగొట్టే పనిలో అయోధ్య రామిరెడ్డి, ఆర్కే. + రోడ్లు వేయడం కంటే ఓట్లు కొనడానికే వైసిపి ఆసక్తి. + దుగ్గిరాల మండలం పర్యటనలో డాక్టర్ పెమ్మసాని.
రైతుకు న్యాయం చేయలేని ఈ ప్రభుత్వం గంజాయి విక్రేతలకు కొమ్ము కాస్తుంది. అక్రమ కేసులు పెట్టి చంద్రబాబును అరెస్ట్ చేయగలిగిన వైసీపీ ప్రభుత్వం గంజాయి స్మగ్లర్లను మాత్రం కనీసం టచ్ చేయలేకపోతోంది.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు. మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల మండలంలో డాక్టర్ పెమ్మసాని గురువారం పర్యటించారు. టిడిపి, జనసేన, బిజెపి నాయకులతో కలిసి మండలంలోని శృంగార పురం, రేవేంద్రపాడు తుమ్మపూడి చిలువూరు గ్రామాల్లో ఆయన విస్తృత పర్యటన చేశారు. ఈక్రమంలో భవన నిర్మాణ కార్మికులు, దళితులు, రైతులు, ఇలా పలు వర్గాలను ఆయన కలిశారు. సంబంధిత స్థానిక సమస్యలను ఆయా ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
జగన్ ఓట్ల రాజకీయ.అనంతరం డాక్టర్ పెమ్మసాని మాట్లాడుతూ ‘రోడ్లు వేయడం కంటే రూ. 2 వేలతో ఓట్లను కొనుక్కోవాలని జగన్ ప్రయత్నిస్తున్నారు. 2014-19 మధ్యలో టీడీపీ వేసిన రోడ్లే తప్ప గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఒక రోడ్డు కూడా వేయలేదు. పనికి డిమాండ్ ఉంటే ఆదాయం పెరుగుతుంది. టిడిపి ప్రభుత్వం ఆ సూత్రాన్ని అవలంబించి భవన నిర్మాణ కార్మికులకు, వ్యవసాయ కూలీలకు ఆదాయం కల్పించింది. కానీ నేటి ప్రభుత్వం ఖర్చులు పెంచిందే తప్ప ఆదాయాన్ని రూపాయి కూడా పెంచలేకపోయింది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన యువత ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు. ప్రస్తుత నిరుద్యోగులతో పాటు రాబోయే ఐదేళ్లలో విద్యావంతులకు కూడా ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఉంది. నేను, లోకేష్ గారు కలిసి సాధ్యమైనన్ని ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తాం. విచ్చలవిడి గంజాయి. 2019 ముందు ఎప్పుడైనా గంజాయి పేరు విన్నారా? ఈ ప్రభుత్వం హయాంలో విచ్చలవిడి గంజాయి పేట్రేగిపోవడంతో పాటు కనీసం ఒక్క గంజాయి స్మగ్లర్ ను కూడా శిక్షించలేని దుస్థితి ఏర్పడింది. ఒక్కసారి మత్తుమందు అలవాటు అయితే జీవితంలో మానలేరు. ఆ అలవాటుకు బానిసలైతే మందు కూడా లేదు. చంద్రబాబు లాంటి నాయకులను అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయించగలరు తప్ప రాష్ట్రంలో గంజాయి స్మగ్లర్లను విక్రేతలను మాత్రం అరెస్టు చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది.
మంగళగిరిలో బ్రదర్స్ అరాచకం. అయోధ్య రామిరెడ్డి ఆర్జించిన అక్రమ సంపాదనతో మంగళగిరి కి వచ్చి రాజధానిని ప్రజలకు దూరం చేశారు. కుల, మతాల విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రజల మధ్యన చిచ్చు పెడుతున్నారు. ఇక ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అయితే జగన్ అపాయింట్మెంట్ తీసుకోవడానికి నానా కష్టాలు పడాలి. దాదాపు 100 ఏళ్ల క్రితం నిర్మించిన రేవేంద్రపాడు వంతెనను పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కే పట్టించుకోలేదు. లోకేష్ వంటి నాయకులు ఈ వంతెన నిర్మాణం వంటివి చేపట్టగల సమర్థులు. రూ. 10 కోట్ల నిధులతో లిఫ్ట్ ఇరిగేషన్ కు టిడిపి హాయంలో ఖర్చు చేస్తే, ఈ ప్రభుత్వం వచ్చాక ఆ పనులు నిలిపివేసింది. టీడీపీకి పేరొచ్చే ఏ పనినైనా ప్రారంభించాలంటేనే జగన్ ప్రభుత్వం వణికిపోతుంది.
రైతులకు అన్యాయం చేస్తోన్న జగన్. అన్నం పెట్టే రైతుకు అనాదిగా నకిలీ ఎరువులు, కోల్డ్ స్టోరేజ్ లేమి, గిట్టుబాటు ధరలు లేక నష్టాలు, వర్షాభావ పరిస్థితులు ఇబ్బందులతో పడుతుంటే… ఎప్పుడు లేని విధంగా ఈ ప్రభుత్వం వచ్చాక సాగు నీటి సమస్య మొదలైంది. తొలిసారి ఈ సమస్య వింటున్నాం. ప్రతీ ఐదేళ్లకు టెక్నాలజీ మారిపోతుంది. అయినా రైతు వ్యవసాయంలో అభివృద్ధి కనిపించడంలేదు. నూతన తరహా పంటలపై రైతులకు అవగాహన కల్పించడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. రైతుల బలహీనతలను అడ్డుపెట్టుకుని వైసీపీ ప్రభుత్వం పబ్బం గడుపుకుంటుంది. ‘ అని వివరించారు. ఈ పర్యటనలో వాణిజ్య విభాగం కార్యదర్శి గూడూరు వెంకట్రావు, దుగ్గిరాల మం. పార్టీ అధ్యక్షులు కేసంనేని అనిత, ఎంపీటీసీ వాసిరెడ్డి లక్ష్మీ, మాజీ సర్పంచ్ నర్రా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు’గంజాయి విక్రేతలపై కఠిన చర్యలు. + అన్నదాత అడ్డాలో సాగునీరు లేని దుస్థితి. + నకిలీ ఎరువులు, కల్తీ మందులు అరికడతాం + విద్వేషాలు రెచ్చగొట్టే పనిలో అయోధ్య రామిరెడ్డి, ఆర్కే. + రోడ్లు వేయడం కంటే ఓట్లు కొనడానికే వైసిపి ఆసక్తి. + దుగ్గిరాల మండలం పర్యటనలో డాక్టర్ పెమ్మసాని. ‘రైతుకు న్యాయం చేయలేని ఈ ప్రభుత్వం గంజాయి విక్రేతలకు కొమ్ము కాస్తుంది. అక్రమ కేసులు పెట్టి చంద్రబాబును అరెస్ట్ చేయగలిగిన వైసీపీ ప్రభుత్వం గంజాయి స్మగ్లర్లను మాత్రం కనీసం టచ్ చేయలేకపోతోంది.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు. మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల మండలంలో డాక్టర్ పెమ్మసాని గురువారం పర్యటించారు. టిడిపి, జనసేన, బిజెపి నాయకులతో కలిసి మండలంలోని శృంగార పురం, రేవేంద్రపాడు తుమ్మపూడి చిలువూరు గ్రామాల్లో ఆయన విస్తృత పర్యటన చేశారు. ఈక్రమంలో భవన నిర్మాణ కార్మికులు, దళితులు, రైతులు, ఇలా పలు వర్గాలను ఆయన కలిశారు. సంబంధిత స్థానిక సమస్యలను ఆయా ప్రజలను అడిగి తెలుసుకున్నారు. జగన్ ఓట్ల రాజకీయం అనంతరం డాక్టర్ పెమ్మసాని మాట్లాడుతూ ‘రోడ్లు వేయడం కంటే రూ. 2 వేలతో ఓట్లను కొనుక్కోవాలని జగన్ ప్రయత్నిస్తున్నారు. 2014-19 మధ్యలో టీడీపీ వేసిన రోడ్లే తప్ప గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఒక రోడ్డు కూడా వేయలేదు. పనికి డిమాండ్ ఉంటే ఆదాయం పెరుగుతుంది. టిడిపి ప్రభుత్వం ఆ సూత్రాన్ని అవలంబించి భవన నిర్మాణ కార్మికులకు, వ్యవసాయ కూలీలకు ఆదాయం కల్పించింది. కానీ నేటి ప్రభుత్వం ఖర్చులు పెంచిందే తప్ప ఆదాయాన్ని రూపాయి కూడా పెంచలేకపోయింది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన యువత ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు. ప్రస్తుత నిరుద్యోగులతో పాటు రాబోయే ఐదేళ్లలో విద్యావంతులకు కూడా ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఉంది. నేను, లోకేష్ గారు కలిసి సాధ్యమైనన్ని ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తాం. విచ్చలవిడి గంజాయి. 2019 ముందు ఎప్పుడైనా గంజాయి పేరు విన్నారా? ఈ ప్రభుత్వం హయాంలో విచ్చలవిడి గంజాయి పేట్రేగిపోవడంతో పాటు కనీసం ఒక్క గంజాయి స్మగ్లర్ ను కూడా శిక్షించలేని దుస్థితి ఏర్పడింది. ఒక్కసారి మత్తుమందు అలవాటు అయితే జీవితంలో మానలేరు. ఆ అలవాటుకు బానిసలైతే మందు కూడా లేదు. చంద్రబాబు లాంటి నాయకులను అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయించగలరు తప్ప రాష్ట్రంలో గంజాయి స్మగ్లర్లను విక్రేతలను మాత్రం అరెస్టు చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. మంగళగిరిలో బ్రదర్స్ అరాచకం. అయోధ్య రామిరెడ్డి ఆర్జించిన అక్రమ సంపాదనతో మంగళగిరి కి వచ్చి రాజధానిని ప్రజలకు దూరం చేశారు. కుల, మతాల విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రజల మధ్యన చిచ్చు పెడుతున్నారు. ఇక ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అయితే జగన్ అపాయింట్మెంట్ తీసుకోవడానికి నానా కష్టాలు పడాలి. దాదాపు 100 ఏళ్ల క్రితం నిర్మించిన రేవేంద్రపాడు వంతెనను పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కే పట్టించుకోలేదు. లోకేష్ వంటి నాయకులు ఈ వంతెన నిర్మాణం వంటివి చేపట్టగల సమర్థులు. రూ. 10 కోట్ల నిధులతో లిఫ్ట్ ఇరిగేషన్ కు టిడిపి హాయంలో ఖర్చు చేస్తే, ఈ ప్రభుత్వం వచ్చాక ఆ పనులు నిలిపివేసింది. టీడీపీకి పేరొచ్చే ఏ పనినైనా ప్రారంభించాలంటేనే జగన్ ప్రభుత్వం వణికిపోతుంది. రైతులకు అన్యాయం చేస్తోన్న జగన్. అన్నం పెట్టే రైతుకు అనాదిగా నకిలీ ఎరువులు, కోల్డ్ స్టోరేజ్ లేమి, గిట్టుబాటు ధరలు లేక నష్టాలు, వర్షాభావ పరిస్థితులు ఇబ్బందులతో పడుతుంటే… ఎప్పుడు లేని విధంగా ఈ ప్రభుత్వం వచ్చాక సాగు నీటి సమస్య మొదలైంది. తొలిసారి ఈ సమస్య వింటున్నాం. ప్రతీ ఐదేళ్లకు టెక్నాలజీ మారిపోతుంది. అయినా రైతు వ్యవసాయంలో అభివృద్ధి కనిపించడంలేదు. నూతన తరహా పంటలపై రైతులకు అవగాహన కల్పించడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. రైతుల బలహీనతలను అడ్డుపెట్టుకుని వైసీపీ ప్రభుత్వం పబ్బం గడుపుకుంటుంది. ‘ అని వివరించారు. ఈ పర్యటనలో వాణిజ్య విభాగం కార్యదర్శి గూడూరు వెంకట్రావు, దుగ్గిరాల మం. పార్టీ అధ్యక్షులు కేసంనేని అనిత, ఎంపీటీసీ వాసిరెడ్డి లక్ష్మీ, మాజీ సర్పంచ్ నర్రా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.