గుంటూరు జిల్లా బుర్రిపాలెం నుంచి వచ్చి సూపర్ స్టార్ గా ఎదిగిన కృష్ణ గురించి అందరికీ తెలుసు. ఇప్పుడు అదే బుర్రిపాలెం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు పెమ్మసాని చంద్రశేఖర్. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అరాచకాలు, విధ్వంసం చూసి వాటిని ఎదుర్కొనేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. తెలుగుదేశం నుంచి గుంటూరు ఎంపీ టికెట్ ఆశిస్తున్న ఆయన… రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో ఎంపీగా గెలుస్తానని విశ్వాసం వెలిబుచ్చారు. విద్య, ఉపాధి రంగాల్లో ఈ ప్రాంతాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దుతానని, ప్రవాసాంధ్రుల సహకారంతో సేవా కార్యక్రమాల్ని విస్తరిస్తానంటున్న పెమ్మసానితో ఈటీవీ ముఖాముఖి..

Tags: No Categories