కిలా(రి)డి దోపీడీ. * 700 ఎకరాల్లో అక్రమ మైనింగ్. * రూ. 2,100 కోట్లు తినేసిన భూ బకాసురులు * దోపిడీ కింగ్ కు ఎంపీ అభ్యర్థిగా జగన్ ప్రమోషన్. * దళితుల భూముల ఆక్రమణ – అక్రమ గ్రావెల్ : డా. పెమ్మసాని.’దళితుల, ప్రభుత్వ భూములను ఆక్రమించి, అక్రమ గ్రావెల్ తవ్వుకోవడానికి మీకు అనుమతులు ఎవరిచ్చారు?దాదాపు 700 ఎకరాలకు పైగా భూముల్లో జరుగుతున్న అక్రమ తవ్వకాలను అడ్డుకోవాల్సింది పోయి ఎకరానికి రూ. 30 లక్షలు చొప్పున ఈ ఎమ్మెల్యే కప్పం వసూలు చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యంగా వీరనాయునిపాలెంలోని అక్రమ మైనింగ్ జరుగుతున్న 60 ఎకరాల్లో 20 ఎకరాలు దళితులకు చెందినవేనని, మిగిలినవన్నీ ప్రభుత్వ భూములేనని గ్రామస్తులు ఆరోపిస్తున్నారని పేర్కొన్నారు. వందలకొద్దీ అడుగులు తవ్వుకుంటూ పోవడంతో భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయన్నారు. కనీసం పంట పొలాలకు కూడా నీళ్లు అందే పరిస్థితి కనిపించడం లేదని తెలిపారు. సకాలంలో నీరు అందక 40 క్వింటాళ్లు పండాల్సిన మొక్కజొన్న, తదితర పంటల దిగుబడి నేడు 10 క్వింటాళ్లకు పడిపోయిందని వివరించారు. రూ. 2,100 కోట్లు దిగమింగారు మండలంలో ప్రతి ఎకరా అక్రమ తవ్వకానికి 30 లక్షలు చొప్పున వసూలు చేయడమే గాక గడిచిన నాలుగున్నర ఏళ్లలో రూ. 2,100 కోట్లను ఈ వైసీపీ నాయకులు దిగమింగారని చెప్పారు. అదే సొమ్మును నియోజకవర్గంలోని రోడ్ల నిర్మాణానికి గాని డ్రైన్ల నిర్మాణానికి గాని ఉపయోగించి ఉంటే ప్రజాజీవనం బాగుపడేదని ఆయన అభిప్రాయపడ్డారు. పచ్చని సపోటా, మొక్కజొన్న తోటలు కూడా తవ్వేసి గ్రావెల్ అక్రమ సరఫరా చేస్తున్న ఈ నాయకులను మళ్లీ గెలిపిస్తే నియోజకవర్గం భూస్థాపితం అవుతుందని ఆయన తన ఆవేదనను వ్యక్తపరిచారు.