టిడిపిలోకి వరుస చేరికలు.తూర్పులో వైసీపీకి నాయకుల గుడ్ బై.పెమ్మసాని ఆధ్వర్యంలో 350 మంది చేరిక. గుంటూరు:ఒక్క రూపాయి అవినీతి లేకుండా అభివృద్ధి చేస్తాం. రాష్ట్ర చరిత్రలో చెట్లు నరికిన నాయకుడు ఎవరైనా ఉంటే అది జగనే.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు అన్నారు. గుంటూరులోని తూర్పు నియోజకవర్గంలో గల 6, 57 డివిజన్లలోని సుమారు 350 మంది వైసీపీ కార్యకర్తలు టిడిపిలో శనివారం చేరారు. పార్టీలో చేరుతున్న వారిని పెమ్మసాని చంద్రశేఖర్ గారు టిడిపి కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో గుంటూరు పేరును ఇండియా మొత్తం వినపడేలా చేస్తాను అని అన్నారు. ఐదేళ్లు అధికారంలో ఉండి కూడా రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించలేకపోయిన వైసీపీ ప్రభుత్వం పై ఆయన విమర్శలు గుప్పించారు. గంజాయి, గుట్కాలు అమ్ముకున్న ఎమ్మెల్యే బాగుపడ్డారని, ప్రజలు మాత్రం ఇబ్బందుల పాలవుతున్నారని అన్నారు. టిడిపి ప్రభుత్వం వచ్చాక రెండు సెంట్లలో ఇళ్ల నిర్మాణం లేదా టిట్కో ఇల్ల అందజేత ద్వారా పేదలకు నివాస సౌకర్యం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. నిరుద్యోగ సమస్యను తరిమికొట్టే విధంగా ఇండస్ట్రీలు తెస్తామని, ఇంటి నుంచి బయటకు రాలేని మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉపాధి అవకాశాలకు కృషి చేస్తామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అలాగే నియోజకవర్గ టిడిపి అసెంబ్లీ అభ్యర్థి మహమ్మద్ నశీర్ అహ్మద్ మాట్లాడుతూ వైసీపీకి ఐదేళ్ళుగా క్రియాశీలకంగా పనిచేసిన నాయకులు కూడా ఆ ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తున్నారని, అందువల్లే టిడిపిలో చేరుతున్నారని వివరించారు. స్థానిక ప్రజలకు రోడ్లు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు టిడిపి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. టిడిపి నాయకులు భరత్ రెడ్డి, ఆరో డివిజన్ కార్పొరేటర్ పోతురాజు సమత ఆధ్వర్యంలో జరిగిన ఈ చేరికల కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యేలు నంబూరు సుభాని, రావి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
Tags: No Categories