మేడికొండూరు మండలం తురకపాలెంలో ఆదివారం సాయంత్రం జరిగిన ముస్లిం నాయకుల ఆత్మీయ పరిచయ కార్యక్రమంలో డాక్టర్ పెమ్మసాని ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక పక్కా ప్రణాళిక కొద్దీ తాను సేవ చేయాలని నిర్ణయించుకుని ప్రజల్లోకి వచ్చానన్నారు. తన జీవితంలో 30 ఏళ్లు ప్రజా జీవితానికి అంకితం చేయాలనే వచ్చానని, ప్రతి ఇంటికి తిరిగి ముస్లింల పేదరిక నిర్మూలనకు కృషి చేస్తానని తెలిపారు.  ముస్లింల హక్కులకు భంగం కలిగితే ఎంత దూరమైనా వెళ్లి, ఏం చేయడానికైనా తాను సిద్ధమేనని డాక్టర్ పెమ్మసాని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అనంతరం శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ మాట్లాడుతూ ముస్లింల పట్ల పెమ్మసాని ప్రత్యేక అభిమానం కనబరుస్తారనే నమ్మకం తనకు ఉందని చెప్పారు. ప్రస్తుత రోజుల్లో, ముఖ్యంగా రాజకీయాల్లో మంచి మనుషులు కనబడటం లేదని, అలాంటిది తన వైద్య వృత్తిని వదులుకొని మరీ ప్రజాసేవకు వచ్చిన చంద్రశేఖర్ ను చూసి తనకు గర్వంగా ఉందన్నారు.అలాగే ఆ రెండు గ్రామాలకు కలిపి షాదీఖానా కావాలని తదితర సమస్యలపై గ్రామస్తులు విన్నవించిన సమస్యలపై శ్రావణ్ కుమార్, పెమ్మసాని మాట్లాడుతూ అధికారంలోకి వచ్చాక సమస్యలపై పరిష్కారానికి పాటుపడతామని వివరించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు ఈస్ట్ టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ నసీర్, రాష్ట్ర టిడిపి ప్రధాన కార్యదర్శి నజీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.