ఓటు హక్కును నిర్లక్ష్యం చేయొద్దు. * ప్రభుత్వం వచ్చిన 1-2 ఏళ్లలో అభివృద్ధికి శ్రీకారం. * తారకరామ నగర్ వాసుల సమావేశంలో డా. పెమ్మసాని. ‘ఓటర్లు తమ ఓటు హక్కును కచ్చితంగా ఉపయోగించుకోవాలి. నా ఒక్క ఓటు వేయకపోతే ఏమోవుతుందిలే అని అనుకోవద్దు. అపార్ట్మెంట్ వాసులు కచ్చితంగా పోలింగ్ రోజు ఓటింగ్ కు సమయం కేటాయించండి.’ అని గుంటూరు పార్లమెంటు టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కోరారు. గుంటూరులోని స్థానిక 41వ డివిజన్లలో శుక్రవారం జరిగిన ఆత్మీయ సమావేశానికి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గల్లా జయదేవ్ హయాంలో గుంటూరుకు రూ. 900 కోట్ల నిధులతో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. అందులో రూ. 500 కోట్ల పనులు జరిగాయని, మిగిలిన పనులు కూడా పూర్తి అయుంటే గుంటూరు రూపురేఖలు మారిపోయి ఉండేవని పెమ్మసాని వివరించారు. ఓట్లలో పోలింగ్ బూత్ లు మారాయనో, ఓటు ఎక్కడ ఉన్నదీ తెలియడం లేదనో ఓటింగ్ కు దూరంగా ఉండటం సరికాదని స్థానికులకు సూచించారు.ఈ సమావేశంలో మాజీ మంత్రి మాకినేని పెద రత్తయ్య, ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ అబ్జర్వర్ వందనా దేవి, 46వ డివిజన్ కార్పోరేటర్ నూకవరపు బాలాజీ తదితరులు పాల్గొన్నారు.