*సమన్వయ సన్నాహం. * పార్లమెంట్ నియోజకవర్గ జనసేన సమన్వయకర్తలతో డా. పెమ్మసాని, మనోహర్ సమావేశం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా చేతులు కలిపిన చంద్రబాబు – పవన్ ఆదేశాలను గ్రామస్థాయికి తీసుకెళ్లబోతున్నామని టిడిపి నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల జనసేన పార్టీ సమన్వయకర్తలతో తెనాలిలో సమావేశం జరిగింది. నియోజకవర్గ టిడిపి – జనసేన కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన ఈ సమావేశంలో టిడిపి నాయకులు డాక్టర్ పెమ్మసాని పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల, గ్రామ స్థాయిలో ఉన్న టిడిపి – జనసేన కార్యకర్తలను, నాయకులను ఒక తాటిపైకి తీసుకురావడంపై మాట్లాడామన్నారు. ఇరు పార్టీల నాయకులతో త్వరలోనే ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తామని చెప్పారు. అనంతరం మనోహర్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని మెరుగైన ఎన్నికల వాతావరణం ఏర్పరచి ఇరు పార్టీలకు ఉపయోగపడేలా సంసిద్ధమవుతున్నామన్నారు. చంద్రబాబు, పవన్ ఆదేశాలకు తగ్గట్టు ఓటు ట్రాన్స్ ఫర్ జరిగేలా చేయడమే తమ ధ్యేయమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Event Photos