*జయహో బీసీ. గుంటూరు పార్టీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా డా. పెమ్మసాని బయలుదేరగా, లక్ష్మీపురం నుంచి తూర్పు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి నసీర్ కూడా తమ ర్యాలీతో కలిసి భారీ ఊరేగింపుగా ‘ జయహో బీసీ’ కార్యక్రమానికి బయల్దేరి వెళ్లారు. లక్ష్మీపురం నుంచి జిన్నా టవర్ సెంటర్, బీ ఆర్ స్టేడియం రోడ్డు మీదుగా ఎన్టీయార్ సర్కిల్, బస్టాండ్, ఆర్టీసీ కాలనీ, ఆటోనగర్ గుండా జాతీయ రహదారి పైకి వాహన ర్యాలీ చేరుకుంది. చిన, పెద కాకాని మీదుగా నాగార్జున యునివర్సిటీ ఎదురుగా ఏర్పాటు చేసిన సభాస్థలి వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం సభలో పాల్గొన్న పెమ్మసాని చంద్రశేఖర్, తెనాలి శ్రావణ్ కుమార్ కలిసి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడికి పుష్ప గుచ్చం ఇచ్చి అభినందనలు తెలియజేశారు.