టిడిపి విజయానికి కృషి చేస్తాం. + తూర్పు నియోజకవర్గం అంతర్గత సమావేశంలో పెమ్మసానితో కార్యకర్తలు. జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో టిడిపికి విజయం దక్కేలా కష్టించి పనిచేస్తామని గుంటూరు తూర్పు నియోజకవర్గం టిడిపి నాయకులు కార్యకర్తలు చెప్పారు. గుంటూరులోని టిడిపి పార్లమెంటరీ కార్యాలయంలో గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గ అంతర్గత సమావేశం శనివారం జరిగింది. ఈ క్రమంలో నియోజకవర్గంలోని డివిజన్ల నాయకులతో డాక్టర్ పెమ్మసాని నసీర్ అహ్మద్ మాట్లాడారు. కాగా స్థానిక, సంస్థాగత సమస్యలపై ఈ సమావేశంలో పెమ్మసాని చర్చించారు. క్లస్టర్ బూతు డివిజన్ స్థాయి నాయకులు కష్టించి పనిచేయాలని ఎన్నికల్లో టిడిపి విజయం చారిత్రాత్మకం కాబోతుందని పెమ్మసాని తెలిపారు. అయితే డివిజన్లో ఉన్న చిన్నపాటి సమస్యలను పెమ్మసాని దృష్టికి తీసుకెళ్లగా, ఆయన పరిష్కరించారు. దీంతో డివిజన్ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం అసెంబ్లీ టిడిపి అభ్యర్థి మహమ్మద్ నశీర్ అహ్మద్, టిడిపి నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్, ఆరో డివిజన్ కార్పొరేటర్ పోతురాజు సమత, టిడిపి రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు, తదితర నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.