*బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న పెమ్మసాని* * పూర్ణకుంభంతో ఆహ్వానించిన వేద పండితులు. గుంటూరులోని పలు దేవాలయాలను టిడిపి నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గురువారం దర్శించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు రూరల్ టిడిపి ఇన్చార్జ్ బోర్ల రామాంజనేయులు కూడా పాల్గొన్నారు. స్థానిక గోరంట్లలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్న శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని అలాగే 47వ ఏడవ డివిజన్లోని షిరిడి సాయి, జ్ఞాన సరస్వతి దేవి దేవాలయాలను కూడా ఆయన దర్శించారు. సదరు దేవాలయాల్లో పూర్ణ కుంభంతో వేద పండితులు మంత్రోచ్చారణల నడుమ పెమ్మసానిని ఆహ్వానించారు. ఆయా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయ కమిటీ సభ్యులతో మాట్లాడిన పెమ్మసాని దేవాలయాల ప్రాసిస్థ్యమ్, విశేషాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతోన్న అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు దగ్గరుండి భోజనాలు వడ్డించారు. ఈ సందర్భంగా క్యూ లో వెళ్లే భక్తులు ‘లక్షకు పైగా మెజారిటీతో గెలుస్తారు సార్..’ అంటూ ఆశీర్వదిస్తూ ముందుకు సాగారు.