*ఎన్డీఏ కూటమికే మా మద్దతు*. + పెమ్మసాని సమక్షంలో విలేకరులతో బీసీ సంఘం నాయకుల ప్రకటన. ‘గడిచిన ఐదేళ్ళుగా బీసీలపై హత్యలు, అత్యాచారాలు, వేధింపులు చేయడమే ఈ ప్రభుత్వం చేయంగా మారింది. బీసీలు రాజ్యాధికారం చేపట్టాలంటే ఎన్ డి ఏ కూటమితోనే సాధ్యం. బీసీ సబ్ ప్లాన్ నిధులను నవరత్నాలకు మళ్లించి ఈ సీఎం చోద్యం చూస్తున్నారు. బీసీలకు ప్రత్యేక రక్షణ హక్కు చట్టం టీడీపీతోనే సాధ్యం.’ అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు కేశన శంకర్రావు, గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర రావు గారు మాట్లాడారు. గుంటూరులోని అమరావతి రోడ్డులో గల స్వగృహ కన్వెన్షన్లో బీసీ రాష్ట్ర సంక్షేమ సంఘం ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతూ విలేకరుల సమావేశాన్ని శుక్రవారం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా బీసీ సంఘం నాయకులతోపాటు పెమ్మసాని చంద్రశేఖర్ గారు విలేకరులతో మాట్లాడారు. *బిసి నాయకులు కేశన శంకర్రావు*. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి సంక్షేమ సంఘం నాయకులు నుంచి అభిప్రాయ సేకరణ తీసుకున్న తర్వాతే ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించాం. గడిచిన ఐదేళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల వలన ప్రజా జీవనం, ప్రజాస్వామ్యం అస్తవ్యస్తంగా మారింది. సీఎం కేవలం బటన్ నొక్కడానికి మాత్రమే పరిమితమయ్యారు. మహిళల పట్ల మానభంగాలు, బీసీలపై హత్యలు, వేధింపులు, హింసలు అరాచక పాలన పెచ్చు మీరిపోయింది. బీసీలకు ప్రత్యేక రక్షణ హక్కు చట్టం కల్పిస్తామని ప్రకటించిన తర్వాత టిడిపి పై బీసీలకు నమ్మకం పెరిగింది. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రజా సంక్షేమం దృష్ట్యా ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించాల్సిన అవసరం ఉంది. బీసీ సామాజి వర్గానికి చెందిన పలువురు ఐఏఎస్, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు నిజాయితీగా పని చేశారన్న ఒకే ఒక కారణంతో ఈ ప్రభుత్వం పోస్టింగ్ లు ఇవ్వకుండా వేదిస్తోంది. రాష్ట్రం పారిశ్రామికంగా ఎదగాలన్నా, యువతకు ఉద్యోగాలు కల్పించాలన్నా ఎన్డీఏ కూటమి విజయం సాధించాల్సి ఉంది. *పెమ్మసాని చంద్రశేఖర్ గారు* 2019లో జగన్ చెప్పిన మాటలు విని బీసీలలో అన్ని వర్గాలు ఆయనకు ఓట్లు వేశాయి. కానీ అధికారంలోకి వచ్చాక బీసీలకు అన్యాయం చేశారు. 16 యూనివర్సిటీలలో వైస్ ఛాన్సెలర్ అవకాశాలు ఉంటే కేవలం ఒక పోస్ట్ మాత్రమే బీసీలకు ఇచ్చారు. జగన్ దృష్టిలో నవరత్నాలు తప్పించి మరో అభివృద్ధి, సంక్షేమం గురించి ఆయనకు పట్టదు. టిడిపి మాత్రమే ఒక ఎర్రన్నాయుడుగారిని, దేవేందర్ గౌడ్, కే.ఈ కృష్ణమూర్తి లాంటి ఎంతోమంది నాయకులను తయారు చేసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టింది. మా ప్రభుత్వం వచ్చాక ఇసుక పాలసీపై తగు నిర్ణయం బాబు గారి నేతృత్వంలో తీసుకుంటుంది. బీసీ సంఘాల నాయకులందరూ మళ్ళీ వెనక్కి వచ్చి ఎన్డీయే కూటమికి మద్దతు ఇవ్వడం ఎంతో సంతోషించకరమైన అంశం. *పిడుగురాళ్ల మాధవి* గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సాధికారత అంతకన్నా లేదు. బీసీల వెన్నుదన్నుగా పుట్టిన టిడిపికి ఈరోజు మళ్లీ బీసీ నాయకుల మద్దతు ఉండటం ఆనందించదగ్గ విషయం. బీసీలను కులాలవారీగా విభజించిన కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఈ వైసీపీ ప్రభుత్వం వాడుకుంటుంది. బీసీలకు కంచుకోట వంటి పశ్చిమ నియోజకవర్గంలో నాకు టిడిపి అవకాశం కల్పించింది. మీ అందరి మద్దతుతో పశ్చిమ నియోజకవర్గం లో టిడిపి జెండా రెపరెప ఆడాలి. *మహమ్మద్ నశీర్ అహ్మద్*: రాజ్యాధికారం కోసం బీసీలు పోరాటాలు చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఎన్టీఆర్ ఆనాటి రాజకీయాల నుంచి బీసీలకు అవకాశాలు కల్పించారు. అదే ఒరవడిని కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు కూడా బీసీలకు పదవుల శాతాన్ని పెంచారు. కానీ నేటి జగన్ ప్రభుత్వం బీసీలకు పదవులను, రాజ్యాధికారాన్ని దూరం చేసే విధంగా పాలన చేస్తుంది. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు అవకాశాలు ఇవ్వాల్సి ఉన్నా, ఆ పదవులనుంటిని జగన్ తన సామాజిక వర్గానికి సంబంధించిన వారికి ఇవ్వడం గమనార్హం. ఈ పక్షపాత వైఖరిని ప్రతి ఒక్క బీసీ నాయకులు గుర్తించాలనే విన్నవించుకుంటున్నాను. బీసీ సబ్ ప్లాన్ నిధులను నవరత్నాలకు మళ్ళించిన జగన్ తిరిగి బీసీలకు ఏదో ఉద్ధరించానని చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. *రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షుడు క్రాంతి కుమార్* బీసీ రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్ రావు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమికి మద్దతు తెలపాలని, గడిచిన మే 14వ తేదీన చంద్రబాబు నాయుడి సమక్షంలో స్పష్టత ఇచ్చాం. ఈ వైసీపీ పెద్దలు బీసీలకు సంబంధించిన 56 కార్పొరేషన్లలో బీసీలకు నాయకత్వం అవకాశాలు కల్పించారా? లేదా? వైసీపీలో ఉన్న బీసీ నాయకులను ఒకటే ప్రశ్నిస్తున్నాను, ప్రజా సంక్షేమం గురించి గానీ, రాష్ట్ర అభివృద్ధి గురించి గానీ, ఏ రోజైనా బయటకు వచ్చి ప్రశ్నించారా? ఈ రాష్ట్రంలో బీసీల్లోని 90 శాతం ఉన్న భవన నిర్మాణ కార్మికుల గురించి ఏ రోజైనా ఈ ప్రభుత్వం పట్టించుకుందా? బీసీల హక్కుల కోసం మేము ఎప్పుడూ పోరాడుతూనే ఉంటాం. ఈరోజు బీసీ ప్రత్యేక హక్కు చట్టం టిడిపి పెట్టిన తర్వాత వైసిపి కూడా ఇస్తానని చెప్పొచ్చు. మేనిఫెస్టోలో చేర్చవచ్చు. కానీ, ఈ ఐదేళ్లలో బీసీల కోసం ఏం చేశారు? అని ప్రశ్నిస్తున్నాను. రజకులపై ఎన్నో అత్యాచారాలు, హింసలు, వేధింపులకు పాల్పడ్డ వైసిపి ప్రజలకు ఏం సమాధానం చెబుతుంది. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు అన్నవరపు నాగమల్లేశ్వరరావు, నిమ్మల శేషయ్య, బాతుగున్నల శ్రీనివాసరావు, మల్లె ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Tags: No Categories