ముస్లింలకు అండగా ఉంటా.
* రోజా విరమణ కార్యక్రమంలో డాక్టర్ పెమ్మసాని.ముస్లిం సోదరులకు అండగా ఉంటానని, ఏ కష్టం వచ్చినా పెమ్మసాని చూసుకుంటారు అనే ధైర్యం కల్పిస్తానని గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులోని స్థానిక పొన్నూరు రోడ్లో గల లాల్ తలాబ్ మసీదులో జరిగిన రోజా విరమణ కార్యక్రమంలో పెమ్మసాని శనివారం పాల్గొన్నారు. మసీద్ మౌలానాలతో కలిసి నమాజ్ లో పాల్గొన్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి రోజా విరమణ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసంలో కఠోర ఉపవాస దీక్షలతో ముస్లిం సోదరులు పాటించే నియమ నిబంధనలు మానవాళికి మార్గదర్శకమని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం టిడిపి అభ్యర్థి మహమ్మద్ నసీర్ అహ్మద్ కూడా పాల్గొన్నారు.
Tags: No Categories