మహిళలు మనోధైర్యంతో ముందుకు వెళ్లాలి. * ఇంజనీరింగ్, సైన్స్ విద్యార్థినులతో మాట్లాడుతూ డాక్టర్ పెమ్మసాని. ‘కిరణ్ మజుందర్ షా, ఇంద్ర నూయి వలె మహిళలు మనోధైర్యంతో ముందుకు సాగాలి.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. పెద పలకలూరు లోని విజ్ఞాన్ నిరుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్సెస్ ఫర్ ఉమెన్ కాలేజీలో శనివారం జరిగిన పరిచయ కార్యక్రమానికి డాక్టర్ పెమ్మసాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు భవిష్యత్తులో ఏ బాధ్యతలు చేపట్టిన ప్రతి అంశంలోను నెంబర్ వన్ గా ఎదగాలని సూచించారు. తాను ఈరోజు ఇంత హుందాగా ఉండడానికి తన తల్లి, భార్య ప్రధాన కారణమని తెలిపారు. అతి తక్కువ మంది మహిళలు మాత్రమే దేశంలో ప్రెసిడెంట్ స్థాయికి వెలగలుగుతున్నారని, ఒకవేళ వెళ్లిన ఎక్కువ చోట్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా మాట్లాడారు. ఓటు హక్కు తొలిసారి ఉపయోగించుకునే ముందు మహిళలు ఒక్కసారి ఆలోచించి అభివృద్ధికి ఉపయోగపడే నాయకులను ఎన్నుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. అనంతరం ప్రత్తిపాడు నియోజకవర్గ టిడిపి అభ్యర్థి బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ మహిళలకు ఆస్తి హక్కును ఎన్టీఆర్ అందిస్తే చంద్రబాబు నాయుడు మహిళా సాధికారికతను అందించారని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన ఇన్చార్జి కొర్రపాటి నాగేశ్వరరావు, ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ కూర్మనాథం తదితరులు పాల్గొన్నారు.