గుంటూరులోని స్థానిక అమరావతి రోడ్డులో గల ఏ కన్వెన్షన్ హాల్లో ఆదివారం సాయంత్రం జరిగిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ ఆత్మీయ సమావేశానికి డాక్టర్ పెమ్మసాని ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని సహజ వనరులను దోచుకుంటూ వచ్చిన అవినీతి సొమ్ముతో సిద్ధం పోస్టర్లు, సోషల్ మీడియాను ఈ ప్రభుత్వం నిర్వహిస్తోందని విమర్శించారు.జన సైనికులను మా గుండెల్లో పెట్టుకుని టిడిపి కార్యకర్తల్లా చూసుకునే బాధ్యత తమదని పెమ్మసాని వివరించారు. అనంతరం జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కష్టాలు, సుఖాలు వచ్చినా కలిసి పంచుకుందాం అనే నినాదంతో పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారని, రాష్ట్రం, ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతోనే పవన్ పార్టీ స్థాపించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ నాయకులు కోవెలమూడి రవీంద్రబాబు (నాని) తదితరులు పాల్గొన్నారు.