బేషరతు క్షమాపణ. సద్దాం హుస్సేన్ అంశంపై తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న డాక్టర్ పెమ్మసాని ‘నేను వీలైనంతవరకు ఉపకారం చేసే వ్యక్తినే తప్ప ఇబ్బంది పెట్టే వ్యక్తిని కాను. ఏ ఒక్కరిని బాధ పెట్టేటువంటి సంకుచిత భావం కలిగిన వ్యక్తిని కాను. ముస్లిం సోదరుల మనోభావాలకు ఇబ్బంది కలిగింది కాబట్టి నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ, బేషరతుగా క్షమాపణ కోరుతున్నాను.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఫిరంగిపురం మండలం, అమీనాబాద్ గ్రామంలో మాట్లాడారు. తాడికొండ నియోజకవర్గం, ఫిరంగిపురం మండలంలో నియోజకవర్గ టిడిపి అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ తో కలిసి డాక్టర్ పెమ్మసాని సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వేములూరుపాడు నుంచి ర్యాలీగా మొదలైన కార్యక్రమం అనంతరం అమీనాబాద్, ఫిరంగిపురం, రేపూడి, గొల్లపాలెం తదితర గ్రామాల్లో కొనసాగింది. పర్యటనలో భాగంగా అమీనాబాద్ గ్రామం చేరుకున్న డాక్టర్ పెమ్మసాని అక్కడి ముస్లిం సోదరులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన పర్యటనలో ఒక్కో ప్రాంతంలో, ఇంటిలోని ఒక మగ వ్యక్తి మత్తు మందుకు బానిసై, ఆ కుటుంబం అల్లాడుతుందని, సదరు కుటుంబం ఆర్థిక సమస్యలతో ఇక్కట్లు పాలైనట్లు తాను గుర్తించానని చెప్పారు. టిడిపి అధికారంలోకి రాగానే ముస్లిం మహిళలకు ఇంటి నుంచే పని చేసుకుని, ఆర్థికంగా ఎదిగే అవకాశం కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. చాలామందిలో బిజెపి పొత్తు పై కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, అయితే 2014 – 19 మధ్యలో టిడిపి, బిజెపి పొత్తులో ఉన్నా సరే ఏ ఒక్క ముస్లింకు అన్యాయం జరగలేదన్న విషయంను పెమ్మసాని గుర్తు చేశారు. గడిచిన ఐదేళ్ల కాలంలో జగన్ ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్లారు? ప్రధానమంత్రికి రాష్ట్ర సమస్యలు ఎన్నిసార్లు మొరపెట్టారో! ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల రీత్యా మాత్రమే బిజెపితో పొత్తులో ఉన్నామని ఆయన మరోసారి ప్రజలకు స్పష్టం చేశారు. లాం గ్రామంలో జరిగిన గత పర్యటనలో పలువురు వైసీపీ ముస్లిం సోదరులు టిడిపిలో చేరేందుకు ముందుకొచ్చారని, ఆ క్రమంలో వైసిపి నాయకుల నుంచి తమకు బెదిరింపులు వస్తున్నాయని ఆ ముస్లింలు తనకు చెప్పారన్నారు. కాగా ఆ ముస్లిం సోదరులకు మనో ధైర్యాన్ని ఇచ్చేందుకుగానూ తాను కొన్ని వ్యాఖ్యలు చేశానని, అయితే ఆ వ్యాఖ్యలు కొందరు ముస్లిం సోదరులకు ఇబ్బంది కలిగించాయన్న విషయం తన దృష్టికి వచ్చాయని వివరించారు. పలువురిని బాధ పెట్టినట్లు తనకు తెలిసింది కాబట్టి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని, ఈ సందర్భంగా ఆయన క్షమాపణలు కోరారు. అనంతరం వేములూరుపాడు, అమీనాబాద్ గ్రామాల్లో పలువురు వైసీపీకి చెందిన 60 కుటుంబాలు టిడిపిలో చేరాయి. కొండేపాక సాంబశివరావు, పీలా గోపి ఆధ్వర్యంలో టిడిపిలో చేరిన నాయకులను డా. పెమ్మసాని చంద్రశేఖర్ టిడిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ పర్యటనలో స్థానిక గ్రామ పార్టీ టిడిపి నాయకులతోపాటు జనసేన బిజెపి నాయకులు కూడా పాల్గొన్నారు. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్: వైసీపీ నుంచి పోటీ చేస్తున్న సుచరిత గారు ఒక పవర్ లేని మినిస్టర్. హోం మంత్రిగా ఉంటూ కనీసం ఒక కానిస్టేబుల్ ను కూడా తన సొంత నిర్ణయంతో మార్చలేని దుస్థితిలో పనిచేశారు. ఒక దళిత మహిళ అయి ఉండి రాష్ట్రంలో ఎంతోమంది దళితులపై ధమనకాండ జరుగుతున్నా స్పందించలేని స్థితిలో ఉన్నారు. ఇక ఆమె బంధువుల విషయానికొస్తే ఎక్కడికి అక్కడ ఆర్థిక వనరులే లక్ష్యంగా దోచుకున్నారు. కానీ శ్రావణ్ కుమార్ గారు నీతి, నిజాయితీకి మారుపేరు. నియోజకవర్గంలో ఎక్కడైనా రోడ్లు నిర్మాణం జరిగాయి అంటే అది శ్రావణ్ కుమార్ గారి వల్లేనన్నారు. టిడిపి హయాంలో ఏ ఒక్క దళితుల పైనా దాడులు గానీ, అన్యాయం గాని జరగలేదని గుర్తు చేశారు. ప్రలోభాలకు లొంగక ప్రజల కోసం పనిచేసే తెనాలి శ్రావణ్ కుమార్ గారు అని ప్రజలను ఉద్దేశించి ఈ సందర్భంగా పెమ్మసాని వివరించారు. ఎవరు నీతి గల వ్యక్తి, ఎవరు ప్రజలకు ఉపయోగపడతారు అని ఆలోచించి ఓటేయాలని ప్రజలను ఆయన కోరారు. ‘నా విషయానికి వస్తే, నీళ్లు లేక కాలువలు కన్నీళ్లు పెట్టుకోవడం చూడలేక, ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు లేక యువత బాధపడుతుంటే చూడలేక వచ్చాను. చెప్పుకుంటూ పోతే ఇలా ఎన్నో వందల సమస్యలు ఉన్నాయి. రాజధాని నిర్మాణం పూర్తయి ఉంటే యువతకు ఉద్యోగాలు, అమరావతి ప్రాంతానికి గుర్తింపు వచ్చేదా! కాదా! ఇన్ని అవకాశాలు ఉంచుకుని కూడా పరిపాలన చేతకాక, ప్రజా సంక్షేమం ఎలా చేయాలో తెలియని ఈ సీఎంకు ఉద్వాసన పలకాలి. ఈ ప్రభుత్వాన్ని రాజకీయ సమాధి చేయాలి.’ అని ప్రజలను ఉద్దేశించి పెమ్మసాని మాట్లాడారు. బేషరతు క్షమాపణ. సద్దాం హుస్సేన్ అంశంపై తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న డాక్టర్ పెమ్మసాని ‘నేను వీలైనంతవరకు ఉపకారం చేసే వ్యక్తినే తప్ప ఇబ్బంది పెట్టే వ్యక్తిని కాను. ఏ ఒక్కరిని బాధ పెట్టేటువంటి సంకుచిత భావం కలిగిన వ్యక్తిని కాను. ముస్లిం సోదరుల మనోభావాలకు ఇబ్బంది కలిగింది కాబట్టి నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ, బేషరతుగా క్షమాపణ కోరుతున్నాను.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఫిరంగిపురం మండలం, అమీనాబాద్ గ్రామంలో మాట్లాడారు. తాడికొండ నియోజకవర్గం, ఫిరంగిపురం మండలంలో నియోజకవర్గ టిడిపి అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ తో కలిసి డాక్టర్ పెమ్మసాని సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వేములూరుపాడు నుంచి ర్యాలీగా మొదలైన కార్యక్రమం అనంతరం అమీనాబాద్, ఫిరంగిపురం, రేపూడి, గొల్లపాలెం తదితర గ్రామాల్లో కొనసాగింది. పర్యటనలో భాగంగా అమీనాబాద్ గ్రామం చేరుకున్న డాక్టర్ పెమ్మసాని అక్కడి ముస్లిం సోదరులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన పర్యటనలో ఒక్కో ప్రాంతంలో, ఇంటిలోని ఒక మగ వ్యక్తి మత్తు మందుకు బానిసై, ఆ కుటుంబం అల్లాడుతుందని, సదరు కుటుంబం ఆర్థిక సమస్యలతో ఇక్కట్లు పాలైనట్లు తాను గుర్తించానని చెప్పారు. టిడిపి అధికారంలోకి రాగానే ముస్లిం మహిళలకు ఇంటి నుంచే పని చేసుకుని, ఆర్థికంగా ఎదిగే అవకాశం కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. చాలామందిలో బిజెపి పొత్తు పై కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, అయితే 2014 – 19 మధ్యలో టిడిపి, బిజెపి పొత్తులో ఉన్నా సరే ఏ ఒక్క ముస్లింకు అన్యాయం జరగలేదన్న విషయంను పెమ్మసాని గుర్తు చేశారు. గడిచిన ఐదేళ్ల కాలంలో జగన్ ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్లారు? ప్రధానమంత్రికి రాష్ట్ర సమస్యలు ఎన్నిసార్లు మొరపెట్టారో! ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల రీత్యా మాత్రమే బిజెపితో పొత్తులో ఉన్నామని ఆయన మరోసారి ప్రజలకు స్పష్టం చేశారు. లాం గ్రామంలో జరిగిన గత పర్యటనలో పలువురు వైసీపీ ముస్లిం సోదరులు టిడిపిలో చేరేందుకు ముందుకొచ్చారని, ఆ క్రమంలో వైసిపి నాయకుల నుంచి తమకు బెదిరింపులు వస్తున్నాయని ఆ ముస్లింలు తనకు చెప్పారన్నారు. కాగా ఆ ముస్లిం సోదరులకు మనో ధైర్యాన్ని ఇచ్చేందుకుగానూ తాను కొన్ని వ్యాఖ్యలు చేశానని, అయితే ఆ వ్యాఖ్యలు కొందరు ముస్లిం సోదరులకు ఇబ్బంది కలిగించాయన్న విషయం తన దృష్టికి వచ్చాయని వివరించారు. పలువురిని బాధ పెట్టినట్లు తనకు తెలిసింది కాబట్టి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని, ఈ సందర్భంగా ఆయన క్షమాపణలు కోరారు. అనంతరం వేములూరుపాడు, అమీనాబాద్ గ్రామాల్లో పలువురు వైసీపీకి చెందిన 60 కుటుంబాలు టిడిపిలో చేరాయి. కొండేపాక సాంబశివరావు, పీలా గోపి ఆధ్వర్యంలో టిడిపిలో చేరిన నాయకులను డా. పెమ్మసాని చంద్రశేఖర్ టిడిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ పర్యటనలో స్థానిక గ్రామ పార్టీ టిడిపి నాయకులతోపాటు జనసేన బిజెపి నాయకులు కూడా పాల్గొన్నారు. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్: వైసీపీ నుంచి పోటీ చేస్తున్న సుచరిత గారు ఒక పవర్ లేని మినిస్టర్. హోం మంత్రిగా ఉంటూ కనీసం ఒక కానిస్టేబుల్ ను కూడా తన సొంత నిర్ణయంతో మార్చలేని దుస్థితిలో పనిచేశారు. ఒక దళిత మహిళ అయి ఉండి రాష్ట్రంలో ఎంతోమంది దళితులపై ధమనకాండ జరుగుతున్నా స్పందించలేని స్థితిలో ఉన్నారు. ఇక ఆమె బంధువుల విషయానికొస్తే ఎక్కడికి అక్కడ ఆర్థిక వనరులే లక్ష్యంగా దోచుకున్నారు. కానీ శ్రావణ్ కుమార్ గారు నీతి, నిజాయితీకి మారుపేరు. నియోజకవర్గంలో ఎక్కడైనా రోడ్లు నిర్మాణం జరిగాయి అంటే అది శ్రావణ్ కుమార్ గారి వల్లేనన్నారు. టిడిపి హయాంలో ఏ ఒక్క దళితుల పైనా దాడులు గానీ, అన్యాయం గాని జరగలేదని గుర్తు చేశారు. ప్రలోభాలకు లొంగక ప్రజల కోసం పనిచేసే తెనాలి శ్రావణ్ కుమార్ గారు అని ప్రజలను ఉద్దేశించి ఈ సందర్భంగా పెమ్మసాని వివరించారు. ఎవరు నీతి గల వ్యక్తి, ఎవరు ప్రజలకు ఉపయోగపడతారు అని ఆలోచించి ఓటేయాలని ప్రజలను ఆయన కోరారు. ‘నా విషయానికి వస్తే, నీళ్లు లేక కాలువలు కన్నీళ్లు పెట్టుకోవడం చూడలేక, ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు లేక యువత బాధపడుతుంటే చూడలేక వచ్చాను. చెప్పుకుంటూ పోతే ఇలా ఎన్నో వందల సమస్యలు ఉన్నాయి. రాజధాని నిర్మాణం పూర్తయి ఉంటే యువతకు ఉద్యోగాలు, అమరావతి ప్రాంతానికి గుర్తింపు వచ్చేదా! కాదా! ఇన్ని అవకాశాలు ఉంచుకుని కూడా పరిపాలన చేతకాక, ప్రజా సంక్షేమం ఎలా చేయాలో తెలియని ఈ సీఎంకు ఉద్వాసన పలకాలి. ఈ ప్రభుత్వాన్ని రాజకీయ సమాధి చేయాలి.’ అని ప్రజలను ఉద్దేశించి పెమ్మసాని మాట్లాడారు.