బీసీలకు అండగా టీడీపీ. + ఈ ప్రభుత్వంలో ఎదిగిన ఒక్క బీసీ నాయకుడైనా ఉన్నారా? + తెనాలి బీసీ ఆత్మీయ సమావేశంలో పెమ్మసాని. తెనాలి నియోజకవర్గ కేంద్రంలోని స్థానిక ఎన్విఆర్ కళ్యాణ మండపంలో గురువారం జరిగిన యాదవ ఆత్మీయ సమావేశం కార్యక్రమానికి గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కూడా పాల్గొన్నారు. * పెమ్మసాని చంద్రశేఖర్: నటుడిగా జీవితాన్ని ప్రారంభించి, దేవుడి మందిరంలో దేవుడి పటంగా ఉంచుకునే స్థాయికి ఎదిగిన నందమూరి తారక రామారావు గారు పెట్టిన టిడిపికి ఆనాటి నుంచి నేటి వరకు బీసీలు అండగా ఉన్నారు. అన్నగారి నాయకత్వంలోనే ఒక దేవేందర్ గౌడ్ గాని, ఎర్ర నాయుడు వంటి ఎంతోమంది బీసీ నాయకులుగా ఎదిగారు. గెలుస్తామని నమ్మకమున్న సీట్లలో 90 శాతం పైగా జగన్ తన సామాజిక వర్గానికి కేటాయించుకుని, ఓడిపోయే సీట్లను మాత్రం బీసీలు, ఇతర కులాలకు ఇచ్చారు. పేదవాళ్లకు ఇళ్ళు ఇస్తామని చెప్పి, తెనాలి పట్టణం, పట్టణ పరిసరాల ప్రాంతాల్లోని అందరినీ తీసుకెళ్లి సిరిపురంలో పడేశారు. ఇదేనా సమసమానత్వం అంటే? యాదవ సోదర, సోదరీమణులు ఒకసారి మాట ఇస్తే ప్రాణం పోయేంతవరకు ఆ మాటపై నిలబడతారని నాకు తెలుసు. మీరే ఆలోచించండి. మీ అభివృద్ధికి బాటలు వేస్తానని నా సాయ శక్తులకు కృషి చేస్తానని మాట ఇస్తున్నాను. * నాదెండ్ల మనోహర్: రాష్ట్ర రాజకీయాలకు అతీతంగా తెనాలి నియోజకవర్గంలో రాజకీయ లక్షలు ఎప్పుడూ నేను వినలేదు. ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టారో ఎవరైతే మనల్ని వేధించారో ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, తెనాలి నియోజవర్గంలోని టిడిపికి కార్యకర్తలకు మరోసారి నేను హామీ ఇస్తున్నాను. ప్రజలకు అంకిత భావంతో మనం పని చేసినప్పుడు మార్పు అనేది కచ్చితంగా తీసుకురావచ్చు. చేతిలో ఉన్న అవకాశాలు, ఓట్లను ఉపయోగించుకుందాం అనుకుంటే, అంతకుమించిన పొరపాటు మరొకటి ఉండదు. యాదవులు మానవత్వం ఉన్న వ్యక్తులు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మిమ్ములను మా సొంత మనుషులుగా చూసుకుంటాం అని యాదవులకు హామీ ఇస్తున్నాను. స్థానికంగా యాదవులు కోరుకుంటున్న కమ్యూనిటీ హాల్ ను నిర్మింపజేసే బాధ్యత నేను తీసుకుంటాను. మీరు ఏ స్థాయిలో మాకు అండగా నిలబడతారో, అదే స్థాయిలో నేను, పెమ్మసాని గారు ప్రజలకు, ప్రజాభివృద్ధికి అండగా నిలబడతాం. * ఆలపాటి రాజేంద్రప్రసాద్: యాదవులు అంతా టిడిపికి అనుకూలంగా ఉన్నారు. తెనాలి నియోజకవర్గంలో బీ.సీలే పార్టీకి వెన్నెముక. గడిచిన ఈ ఐదేళ్లలో నియోజకవర్గంలో జగన్ ప్రభుత్వం యాదవులకు ఏ పదవులు ఇచ్చిందో చెప్పండి. జగన్ కు అబద్ధం చెప్పడం తప్ప నిజం చెప్పకూడదు అనే శాపం ఉందేమో! ఏ సభలో చూసినా, ఏ ప్రచారం చేసినా కళ్ళు ఆర్పుకుంటూ అబద్ధాలే చెబుతూ ఉంటారు. రాజ్యాంగం కల్పించిన స్థానికంగా 16 వేల పదవులను నిర్ధాక్షన్యంగా ఈ జగన్ యాదవులకు దూరం చేశారు. బీసీ డిక్లరేషన్ ప్రకటించిన ఏకైక పార్టీ టిడిపి నే అని గర్వంగా చెబుతున్నాను. ప్రజలను, ప్రజా సంపదను దోచుకునే నాయకులు కావాలా! ప్రజా సంక్షేమం కోరుకునే పెమ్మసాని చంద్రశేఖర్, నాదెండ్ల మనోహర్ వంటి నాయకులు కావాలా! మనసంతా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ తాడిబోయిన శ్రీనివాసరావు, తెనాలి పట్టణ టీడీపీ తాడిబోయిన హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Event Photos
Candid Videos Link
Camera Videos Link