మల్లేశ్వరస్వామి దర్శనంలో డా. పెమ్మసాని. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పెదకాకాని మల్లేశ్వర స్వామిని టీడీపీ నాయకులు డా. పెమ్మసాని చంద్రశేఖర్ దర్శించుకున్నారు. స్వామి గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. పిదప స్వామి ప్రసాదాలను పెమ్మసాని స్వయంగా భక్తులకు అందజేశారు.